సతీ సుకన్య
శ్రీ వేంకటేశ్వరా ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందించిన సతీ సుకన్య సినిమా 1959, జనవరి 30న విడుదలైంది.
సతీ సుకన్య (1959 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | చంద్రమోహన్ |
---|---|
తారాగణం | అమర్‌నాథ్ , కృష్ణకుమారి , కాంతారావు , అమ్మాజీ , రమణారెడ్డి , మిక్కిలినేని |
సంగీతం | ఘంటసాల |
నిర్మాణ సంస్థ | వెంకటేశ్వరా ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
చిత్రకథ
మార్చుభృగుమహర్షి, పులోమి దంపతుల పుత్రుడు చ్యవనుడు. మహా తపశ్శాలి. శర్వాతి మహారాజు (మిక్కిలినేని), మహారాణి (రమాదేవి)ల కుమార్తె సుకన్య (కృష్ణకుమారి). తల్లిదండ్రులు, చెలులతో వన విహారానికి వెళ్తుంది. అలా వన విహారంలో ఆమె విసిరిన పూమాల ఓ పుట్టపై పడుతుంది. దాన్ని తీయబోయి, అందులోనుంచి వచ్చే వింతకాంతులు చూసి ఓ పుల్లతో చిదిమివేస్తుంది. దాంతో ప్రకృతిలో ప్రళయ కంపనలు వస్తాయి. ఆ పుట్టలోని చ్యవనుడు (అమర్‌నాథ్) అంధుడు కావడం జరుగుతుంది. మహర్షి ఆగ్రహాన్ని శాంతింపచేసి, అతనికి పరిచర్య చేయటానికి నారద మహర్షి (పద్మనాభం) సూచనపై శర్వాతి తన కుమార్తె సుకన్యనిచ్చి అతనికి వివాహం చేస్తాడు. సుకన్య అనుకూలవతియైన ఇల్లాలిగా పతికి సేవ చేస్తుంటుంది. దేవ వైద్యులు, సంధ్యాదేవి పుత్రులు అయిన అశ్వనీ కుమారులు (కాంతారావు) తమకు యజ్ఞ్ఫలం అర్హతలేదని దేవేంద్రుడు సభలో నిరాకరించటంతో, నారదుని సలహాతో సుకన్యను ఆశ్రయించి ఆమెను సోదరిగా భావించి, ఆమె భర్త చ్యవనునికి యవ్వనం ప్రసాదిస్తారు. సుకన్య చ్యవనులు ఆనందంగా దాంపత్య జీవితం గడుతుంటారు. దేవేంద్రుడు కోపంతో విద్యాధరుని పంపి, చ్యవనుడిగా మార్చి అతడు మరణించినట్టు సృష్టిస్తాడు. చ్యవన మహర్షి శిష్యుడు మార్గాన్వేషి (రమణారెడ్డి) అంత్యక్రియలు జరుపుతాడు. శర్వాతి మహరాజు తన కుమార్తె పర పురుషునితో ఉందని భావించి, ఆమెను, చ్యవనుని కారాగారంలో బంధిస్తాడు. జగన్మాత అనుగ్రహంతో సుకన్య అగ్నిపరీక్షలో జయంపొంది, అశ్వనీ దేవతలకోసం భర్త ఆధ్వర్యంలో తలిదండ్రులచే యజ్ఞం చేయిస్తుంది. జగన్మాత అనుగ్రహంతో దేవేంద్రుడు కల్పించిన ఆటంకాలను ఎదుర్కొని, యజ్ఞాన్ని పూర్తిచేయించి, అశ్వనీ దేవతలకు యజ్ఞ్ఫలం అందించటానికి దేవేంద్రుడు కూడా సిద్ధపడటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది[1].
నటీనటులు
మార్చు- అమర్‌నాథ్ - చ్యవనుడు
- కాంతారావు - అశ్విని దేవతలు
- కృష్ణకుమారి - సుకన్య
- రమాదేవి
- పద్మనాభం - నారదుడు
- మిక్కిలినేని
- రమణారెడ్డి - మార్గాన్వేషి
- మీనాకుమారి - చెలికత్తె
- అమ్మాజీ - చెలికత్తె
- రాజనాల - దేవేంద్రుడు
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకుడు: చంద్రమోహన్
- మాటలు, పాటలు : శ్రీరామచంద్
- కూర్పు: పద్మనాభన్
- కళ: కోటేశ్వరరావు, సత్యనారాయణ
- ఛాయాగ్రహణం: ఎస్.కె.వరదరాజన్
- సంగీతం : ఘంటసాల
- నేపథ్య గాయకులు: ఘంటసాల, పి.లీల, మాధవపెద్ది, కె.జమునారాణి
పాటలు
మార్చు- అందాల సొగసులు చిందెనే కనువిందేనే మది పొంగేనే ఔనే - పి.లీల
- కన్నీరు నిట్టూర్పు కలతలే వీక్షింప కట్టేనే మౌని (పద్యం) - ఘంటసాల
- జయజయ లోకావన భవభయ హరణా కరుణాభరణా - ఘంటసాల - రచన:శ్రీరామచంద్
- జీవితమే మనోహరమే జాజిసుమాల పరిమళమే - పి.లీల బృందం
- నేడే హాయీ హాయీ ఆనందంచిందే రేయీ - పి.లీల, ఘంటసాల - రచన:శ్రీరామచంద్
- పతిపదసేవదక్క ఇతరముల.. తాపసవృత్తి (సంవాద పద్యాలు) - పి.లీల,మాధవపెద్ది
- పుణ్యవతి ఓ త్యాగవతీ ధన్యురాలవే సుగతీ - ఘంటసాల - రచన:శ్రీరామచంద్
- మధురమైన రేయి మరి రాదుకదా హాయీ మధురమైన - పి.లీల,ఘంటసాల - రచన:శ్రీరామచంద్
- సోమపానం ఈ దివ్యగానం సురలోకవాసుల సొమ్మేకదా - కె. జమునారాణి
- హే జగన్మాతా కరుణాసమేతా హే జగన్మాతా .. నిరతము నిన్నే - పి.లీల
విశేషాలు
మార్చుఈ సినిమా కన్నడలో ఇదే పేరుతో రాజ్‌కుమార్, ఉదయకుమార్, హరిణి కాంబినేషన్‌లో పునర్నిర్మిపబడి 1967, మార్చి 8వ తేదీన విడుదలయ్యింది.
మూలాలు
మార్చు- ↑ సి.వి.ఆర్.మాణికేశ్వరి (18 May 2019). "ఫ్లాష్‌బ్యాక్ @50 సతీసుకన్య". ఆంధ్రభూమి దినపత్రిక. Archived from the original on 3 ఆగస్టు 2019. Retrieved 3 August 2019.
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)