పిడుగురాళ్ల

ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా పట్టణం

పిడుగురాళ్ల, పల్నాడు జిల్లా చెందిన పట్టణం, పిడుగురాళ్ల మండల కేంద్రం.

పట్టణం
పటం
Coordinates: 16°29′N 79°54′E / 16.48°N 79.9°E / 16.48; 79.9
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపల్నాడు జిల్లా
మండలంపిడుగురాళ్ళ మండలం
విస్తీర్ణం
 • మొత్తం31.63 కి.మీ2 (12.21 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం63,103
 • జనసాంద్రత2,000/కి.మీ2 (5,200/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1003
ప్రాంతపు కోడ్+91 ( 08649 Edit this on Wikidata )
పిన్(PIN)522 413 Edit this on Wikidata
WebsiteEdit this at Wikidata

భౌగోళికం

మార్చు

జిల్లా కేంద్రమైన నరసరావుపేట నుండి వాయవ్య దిశలో 35 కి.మీ దూరంలో ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లా గుంటూరు పట్టణం నుండి పిడుగురాళ్ళకు 65 కిలోమీటర్ల దూరంలో ఉంది

జనగణన గణాంకాలు

మార్చు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 50,127. ఇందులో పురుషుల సంఖ్య 25,546, స్త్రీల సంఖ్య 24,581, గ్రామంలో నివాస గృహాలు 11,222 ఉన్నాయి. పట్టణ విస్తీర్ణము 3,149 హెక్టారులు.

రవాణా సౌకర్యాలు

మార్చు

పిడుగురాళ్ల, పలు జాతీయ రహదారుల కూడలి. జాతీయ రహదారి 167A (భారతదేశం), నార్కెట్‌పల్లి - అద్దంకి - మేదరమెట్ల రహదారి ఇక్కడ కలుస్తాయి. గుంటూరు-నడికుడి - మాచర్ల రైలు మార్గం, హైదరాబాదు - నడికుడి - గుంటూరు రైలు మార్గం ఇక్కడ కలుస్తాయి. పగిడిపల్లి -నల్లపాడు విభాగంలోకి ఈ రైలు నిలయం వస్తుంది. ఇక్కడ కొత్త పిడుగురాళ్ల జంక్షన్ నుండి నడికుడి- శ్రీకాళహస్తి మార్గంలో శావల్యాపురం వరకు 46 కి.మీ. దూరం కొత్త రైలుమార్గం పనులు పూర్తయ్యాయి.

విద్యా సౌకర్యాలు

మార్చు

మన్నెం పుల్లారెడ్డి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల: రాష్ట్రంలోనే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలలో ఇది మూడవది. ఇక్కడ 1583 మంది విద్యార్థులు ఉన్నారు.[3]

ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మ్యూజిక్ ఎకాడమీ

మార్చు

పిడుగురాళ్ళలోని ఏ.బి.సి.విద్యాసంస్థల నిర్వాహకులు ఏ.కె.అయ్యంగార్‌కు సంగీతం అంటే ప్రాణం. వీరు హైదరాబాదులోని యూసఫ్‌గూడాలో ఒక రికార్డింగ్ స్టూడియో నిర్మించాడు. ఈ స్టూడియోని ప్రముఖ గాయకులు ఎస్.ప్.బాలసుబ్రహ్మణ్యం ప్రారంభించాడు. పిడుగురాళ్ళలో బాలుగారి అనుమతితో అయ్యంగార్, "శ్రీ బాలసుబ్రహ్మణ్యం మ్యూజిక్ అకాడమీ"ని రిజిస్టర్ చేయించి, తద్వారా పిల్లలకు సంగీతం, నాట్యం, సాహిత్యం, చిత్రలేఖనం నేర్పించుచున్నాడు.[4]

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

మార్చు
  • శ్రీ భోగలింగేశ్వర స్వామివారి ఆలయం: ఈ ఆలయం ఐదు శతాబ్దాల కాలం నాటిదని చారిత్రిక ఆధారాల ద్వారా తెలియుచున్నది. శివపరివార దేవతలతో అందంగా ఆహ్లాదకరంగా ఉన్న ఈ ఆలయ శోభ విశిస్టమైనది. ప్రతి సోమవారం విశేష పర్వదినాలలో ప్రత్యేక పూజలు విశేషంగా జరుగును.[5]
  • శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం
  • శ్రీ దేవీ భూదేవీ సమేత శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయం
  • శ్రీ సరస్వతీ అమ్మవారి ఆలయం: ఈ ఆలయం, పిడుగురాళ్ళలోని నాగులగుగుడిలో ఉంది.
  • శ్రీ సువర్చలా సమేత శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయం: పిడుగురాళ్ళ పట్టణంలోని ప్రజాశక్తినగర్ లో ఉన్న ఈ ఆలయంలో, 2016,జనవరి-28వ తేదీ గురువారంనాడు, స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు.[6]
  • శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం అయ్యప్ప
నగర్ పిడుగురాళ్ల ఈ దేవాలయం 
పిడుగురాళ్ల నుంచి అద్దంకి నార్కెట్పల్లి 
హైవేలో ఉన్నది ఈ దేవస్థానము 

లో ప్రతి సంవత్సరం 5000 మందికి

మాలాధారణ జరుగుతుంది స్వామివారికి 
అభిషేకాలు ప్రత్యేకము ఈ దేవస్థానంలో 
నవంబరు 16 నుండి డిసెంబరు 26 వరకు 
భారీగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది 
భక్తులు వేల సంఖ్యలో పాల్గొంటారు 
ప్రతి సంవత్సరం
పడిపూజ మహోత్సవం జరుగు తేదీలు
1, జూన్15 దేవస్థానం ప్రతిష్ఠాదిన 
మహోత్సవం
2, నవంబరు 16 మండల కాలం ప్రారంభం 
3, డిసెంబరు 26 మండల కాలంముగింపు
4, జనవరి 1 నూతన సంవత్సరం
5, జనవరి 14 మకర సంక్రాంతి, 
జ్యోతి ప్రజ్వలన
ప్రతిరోజు మహాగణపతి హోమం 
జరుగుతుంది.

మూలాలు

మార్చు
  1. http://piduguralla.cdma.ap.gov.in/. {{cite web}}: Missing or empty |title= (help)
  2. 2.0 2.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
  3. ఈనాడు గుంటూరు రూరల్; 2017,జులై-12; 8వపేజీ.
  4. ఈనాడు గుంటూరు రూరల్;2020,సెప్టెంబరు-26;1వపేజీ.
  5. ఈనాడు గుంటూరు రూరల్; 2013,జులై-8; 15వపేజీ.
  6. ఈనాడు గుంటూరు రూరల్; 2016,జనవరి-29; 16వపేజీ.

వెలుపలి లింకులు

మార్చు