పిడుగురాళ్ల

ఆంధ్ర ప్రదేశ్, గుంటూరు జిల్లా లోని మండలం
(పిడుగురాళ్ళ నుండి దారిమార్పు చెందింది)

పిడుగురాళ్ల,గుంటూరు జిల్లా చెందిన పట్టణం. పిన్ కోడ్:522 413., ఎస్.టి.డి.కోడ్ = 08649.

పిడుగురాళ్ల
—  రెవిన్యూ గ్రామం  —
పిడుగురాళ్ల is located in Andhra Pradesh
పిడుగురాళ్ల
పిడుగురాళ్ల
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°32′05″N 79°53′13″E / 16.534848°N 79.886856°E / 16.534848; 79.886856
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం పిడుగురాళ్ళ
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 522 413
ఎస్.టి.డి కోడ్

గ్రామ భౌగోళికంసవరించు

సమీప గ్రామాలుసవరించు

కోనంకి 4 కి.మీ, జానపాడు 5 కి.మీ, మల్లవోలు 6 కి.మీ, పిల్లుట్ల 6 కి.మీ, కోటనెమలిపురం 7 కి.మీ.

సమీప మండలాలుసవరించు

ఉత్తరాన మాచవరం మండలం, తూర్పున బెల్లంకొండ మండలం, దక్షణాన నకరికల్లు మండలం, తూర్పున రాజుపాలెం మండలం.

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు

మన్నెం పుల్లారెడ్డి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- రాష్ట్రంలోనే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలలో ఇది మూదవది. ఇక్కడ్ 1583 మంది విద్యార్థులు ఉన్నారు. వీరు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఫలితాలు సాధించుచున్నారు. క్రీడలలో గూడా రాణించుచున్నారు. విశాలమైన తరగతి గదులు, క్రీడా మైదానం, గ్రంథాలయం వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. నైపుణ్యం ఉన్న ఉపాధ్యాయులు ఇక్కడ పనిచేస్తున్నారు. [5]

గ్రామములోని మౌలికసదుపాయములుసవరించు

బ్యాంకులుసవరించు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు.

గ్రామములోని దర్శనీయ ప్రదేశమలు/దేవాలయాలుసవరించు

శ్రీ భోగలింగేశ్వర స్వామివారి ఆలయంసవరించు

ఈ ఆలయం మహిమాన్వితమైన క్షేత్రంగా పేరుగాంచింది. ఈ ఆలయం ఐదు శతాబ్దాల కాలం నాటిదని చారిత్రిక ఆధారాల ద్వారా తెలియుచున్నది. శివపరివార దేవతలతో అందంగా ఆహ్లాదకరంగా ఉన్న ఈ ఆలయ శోభ విశిస్టమైనది. ప్రతి సోమవారం మరియూ విశేష పర్వదినాలలో ప్రత్యేక పూజలు విశేషంగా జరుగును. [2]

శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంసవరించు

శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంసవరించు

మండల పరిధిలోని అంజనీపురంలో వేంచేసియున్న ఈ ఆలయంలో, స్వామివారి కళ్యాణం, 2017,మార్చి-23వతేదీ గురువారం ఉదయం 10-30 కి వైభవంగా నిర్వహించెదరు. [4]

శ్రీ సరస్వతీ అమ్మవారి ఆలయంసవరించు

ఈ ఆలయం, పిడుగురాళ్ళలోని నాగులగుగుడిలో ఉంది.

శ్రీ సువర్చలా సమేత శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయంసవరించు

పిడుగురాళ్ళ పట్టణంలోని ప్రజాశక్తినగర్ లో ఉన్న ఈ ఆలయంలో, 2016,జనవరి-28వ తేదీ గురువారంనాడు, స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలను వేదిక మీద ఏర్పాటుచేసి, 30మంది దంపతులు పీటలమీద ఆసీనులై స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దయెత్తున భక్తులు తరలివచ్చారు. అనంతరం భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం పట్టణంలో నిర్వహించిన రథయాత్ర కన్నులపండువగా సాగినది. స్వామివారి రథంలాగటానికి భక్తులు పోటీపడినారు. [3]

గణాంకాలుసవరించు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 50,127.[1] ఇందులో పురుషుల సంఖ్య 25,546, స్త్రీల సంఖ్య 24,581, గ్రామంలో నివాస గృహాలు 11,222 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 3,149 హెక్టారులు.

మూలాలుసవరించు

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-04-15. Retrieved 2013-08-26.