పిప్లాంట్రి

రాజస్థాన్ రాష్ట్రం, రాజసమంద్ జిల్లా లోని గ్రామం

పిప్లాంట్రి (గ్రామం), భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రాజసమంద్ జిల్లాకు చెందిన గ్రామం. [1][2] [3]

పిప్లాంట్రి
పిప్లాంట్రి is located in Rajasthan
పిప్లాంట్రి
పిప్లాంట్రి
రాజస్థాన్‌లో పిప్లాంట్రి గ్రామ స్థానం
పిప్లాంట్రి is located in India
పిప్లాంట్రి
పిప్లాంట్రి
పిప్లాంట్రి (India)
Coordinates: 25°06′40″N 73°47′20″E / 25.11111°N 73.78889°E / 25.11111; 73.78889
దేశం భారతదేశం
రాష్ట్రంరాజస్థాన్
జిల్లారాజసమంద్
భాషలు
 • అధికారకహిందీ
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
313324
ISO 3166 codeRJ-IN
Websitewww.piplantri.com

గ్రామ విశేషాలు

మార్చు

పిప్లాంట్రి గ్రామస్థులు గ్రామంలో ఎవరికి ఆడపిల్ల జన్మించినా వారు పుట్టిన సందర్బంగా 111 చెట్లను నాటుతారు. అక్కడి సమాజం ఈ చెట్లను బతికేలా చూస్తుంది. ఆడపిల్లలు పెరిగేకొద్దీ ఈ చెట్లు పెరిగి ఫలాలను పొందుతాయి. భారతదేశంలో ఆడపిల్లల కొరత చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే సమాజం మగబిడ్డపై మక్కువ కలిగి, వరకట్న పద్ధతుల కారణంగా ఆడపిల్లలను ఆర్థిక భారంగా పరిగణిస్తారు[4].

సంవత్సరాలుగా, ఇక్కడి ప్రజలు గ్రామ పరిధిలోని బీడు మైదానాలలో నాటిన చెట్లతో, ఈ ప్రాంతం ఇప్పుడు 3,50,000 కంటే ఎక్కువ చెట్లను కలిగి ఉంది. ఈ చెట్లు 1,000 హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి. వీటిలో ఎక్కువుగా ఇరిడి, మామిడి, గూస్బెర్రీ, గంధం, వేప, వెదురు, ఆమ్లా మొదలగు చెట్లు ఉన్నాయి. ఇవి ఒకప్పుడు బంజరు భూములలో పెరిగేవి.[5]

ఆర్థికభద్రతను నిర్ధారించడానికి, ఒక ఆడపిల్ల పుట్టిన తరువాత, గ్రామస్తులు సమిష్టిగా రూ.21 వేలు ఇచ్చి, తల్లిదండ్రుల నుండి రూ.10,000 తీసుకొని బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాలోఉంచుతారు. ఆమెకు 20 ఏళ్లు దాటిన తర్వాత మాత్రమే ఆ డబ్బును ఉపయోగించుకోవటానికి అవకాశం ఉంది.[6]

ఆడ పిల్లలకు సరైన విద్య లభిస్తుందని నిర్ధారించుకోవడానికి,గ్రామస్తులు, తల్లిదండ్రులను అఫిడవిట్ (లీగల్ కాంట్రాక్ట్) పై సంతకం చేయుంచుకునే పద్దతి ఉంటుంది. ఇది వివాహానికి చట్టబద్దమైన వయస్సు వచ్చేలోపు ఆమెను వివాహం చేసుకోకుండా పరిమితం చేస్తుంది.

మొదటగా శ్యామ్ సుందర్ పాలివాల్ [7] మాజీ సర్పంచ్ 2006లో మరణించిన తన కుమార్తె కిరణ్ జ్ఞాపకార్థం ఈ ప్రయత్నాన్ని ప్రారంభించాడు.[8] 2007 లో ప్రారంభమైన చెట్లను నాటే చొరవ పిప్లాంట్రి గ్రామాన్ని ఒయాసిస్‌గా మార్చింది. ఆడపిల్లల పుట్టుక ఇప్పుడు స్వాగతించబడింది.

ఈ బృహత్తర కార్యక్రమం వలన గ్రామ పరిసరాలలో భూగర్భ నీటిమట్టం పెరగాటనికి, వన్యప్రాణుల సంరక్షణకు దారితీసింది.[9]ఈ చొరవ గ్రామ ఆర్థికవ్యవస్థ బలపడటానికి కూడా సహాయపడింది. చెట్ల నుండి చెదపురుగులను దూరంగా ఉంచడానికి, వీటిలో చాలా ఫలాలను కలిగి ఉంటాయి.

గ్రామం వాటి చుట్టూ 2.5 మిలియన్లకు పైగా కలబంద మొక్కలను నాటారు. క్రమంగా, అలోవెరాను వివిధ రకాలుగా ప్రాసెస్ చేసి విక్రయించవచ్చని గ్రామస్తులు గ్రహించారు.ఆ ఆలోచనలతో గ్రామ సంఘం కలబంద ఆధారిత రసం, జెల్ వంటి ఉత్పత్తులను ఉత్పత్తి చేసి, విక్రయిస్తుంది. [10]

మూలాలు

మార్చు
  1. "A village that plants 111 trees for every girl born in Rajasthan". The Hindu. Retrieved 26 March 2015.
  2. "ndian-village-plants-111-trees-every-time-a-girl-child-is-born".
  3. "Piplantri - Rajasthan - India".
  4. This village in India plants 111 trees every time a girl is born - CNN Video, retrieved 2020-08-05
  5. Dore, Bhavya. "Piplantri: The Indian village where girls rule". www.bbc.com. Retrieved 2022-02-18.
  6. Singh, Mahim Pratap (2013-04-13). "A village that plants 111 trees for every girl born in Rajasthan". The Hindu. ISSN 0971-751X. Retrieved 2022-02-18.
  7. "Padma awardee Shyam Sunder Paliwal turned Rajasthan village into oasis". Hindustan Times (in ఇంగ్లీష్). 2021-01-26. Retrieved 2022-02-18.
  8. "Celebrating girl child: Here's what India can learn from a Rajasthani village, Piplantri". www.firstpost.com. Firstpost. Retrieved 26 March 2015.
  9. "Piplantri villagers plant 111 trees to celebrate a girl child's birth". ibnlive.in.com. Cable News Network LP, LLLP. A Time Warner Company. Archived from the original on 2015-03-27. Retrieved 26 March 2015.
  10. "Indian Village Plants Future for Young Girls". time.com. Time Inc. Retrieved 26 March 2015.