పిల్లుట్ల ప్రకాశ్
పిల్లుట్ల ప్రకాశ్ జానపదకళాకారుడు, యక్షగాన రాష్ట్ర అధ్యక్షుడు.[1] అతను జానపద కళల విభాగంలో తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాన్ని 2017లో అందుకున్నాడు[2]
జీవిత విశేషాలు
మార్చుపిల్లుట్ల ప్రకాష్ తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లా, కొండపాక మండలంలోని బందారం గ్రామంలో జన్మించాడు. అతను తన తండ్రి నుంచి వారసత్వంగా చిందుయక్షగానాన్ని నేర్చుకున్నాడు. ఆ యక్షగానాన్ని గ్రామగ్రామాన ప్రదర్శించి కుటుంబ పోషణ చేస్తూండేవాడు. క్రమంగా జానపదం వైపు తన కళను మరల్చుకొని జానపద కళాకారునిగా అందరిచేత మన్ననలు పొందాడు. చిందు యక్షగానంలో తన కుల వృత్తిని ప్రారంభించిన అతను కళాకారునిగా ఎదిగి జానపదంలో తనదైన బాణీని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు తెలంగాణ ఉద్యమానికి తన కళను అంకితం చేశాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి చెందిన ఆర్పిత సాహిత్యసాంస్కృతిక స్వచ్ఛంధ సేవా సంస్థ అతనికి తెలంగాణ రత్న పురస్కారాన్ని విశాఖపట్టణంలోని కళాభారతి ఆడిటోరియంలో జరిగిన 15వ వార్షికోత్సవ సందర్భంగా అందజేసింది. తెలంగాణ ఉద్యమంలో తనదైన శైలిలో చిందుయక్షగానంతో ప్రజలను చైతన్యపరిచాడు. చిందుయక్షగానం, పౌరణిక, పద్యనాటకం, జానపదం పలు కళరంగాల్లో ప్రసిద్ద కళాకారునిగా గుర్తింపు సాధించుకున్నాడు. దేశ వీదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చాడు.[3]
మూలాలు
మార్చు- ↑ "సంస్కృతిని.. జానపద జాతర".[permanent dead link]
- ↑ ఈనాడు (డైలీహంట్) (13 October 2015). "43 మందికి తెలుగువర్సిటీ కీర్తి పురస్కారాలు". Archived from the original on 15 October 2018. Retrieved 15 October 2018.
- ↑ "పిల్లుట్ల ప్రకాశ్‌కుతెలంగాణ రత్న".[permanent dead link]