పి. విజయా రెడ్డి
పబ్బతిరెడ్డి విజయా రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె రెండుసార్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఖైరతాబాద్ డివిజన్ కార్పొరేటర్‌గా గెలిచింది.[2]
పి. విజయా రెడ్డి | |||
2016లో పి. విజయారెడ్డి | |||
పదవీ కాలం 2016 నుండి ప్రస్తుతం | |||
నియోజకవర్గం | ఖైరతాబాద్, హైదరాబాదు | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 26-10-1979 హైదరాబాదు, తెలంగాణ | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
ఇతర రాజకీయ పార్టీలు | తెలంగాణ రాష్ట్ర సమితి | ||
తల్లిదండ్రులు | పి. సులోచన, పి.జనార్ధనరెడ్డి | ||
జీవిత భాగస్వామి | జీవిబిఆర్ రెడ్డి[1] | ||
బంధువులు | గాయత్రి రెడ్డి, అనురాగిణి రెడ్డి, పావని రెడ్డి (సోదరీమణులు), పి.విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే (సోదరుడు) | ||
సంతానం | ప్రభాత్, హరేశ్వరి | ||
నివాసం | ఇంటి నంబర్ 12-2-823/ఏ/36 సంతోష్ నగర్, మెహిదీపట్నం దర్గా, హైదరాబాద్ | ||
మతం | హిందూ |
రాజకీయ జీవితం
మార్చువిజయారెడ్డి తన తండ్రి మాజీ మంత్రి పి.జనార్ధనరెడ్డి మరణాంతరం ఆయన అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్య ర్ధిగా పోటీ చేసి ఓడిపోయి ఆ తర్వాత వైఎస్సార్‌సీపీలో చేరింది.[3] ఆమె 2014లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి[4] అనంతరం 2014 ఆగష్టు 20న టీఆర్‌ఎస్‌లో చేరింది.[5]
విజయారెడ్డి 2016లో జరిగిన [హైదరాబాదు మహానగరపాలక సంస్థ|గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్]] ఎన్నికల్లో ఖైరతాబాద్ డివిజన్ నుండి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కార్పొరేటర్‌గా గెలిచింది. ఆమె 2018లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే టికెట్ ఆశించినా దక్కకపోవడంతో ఆమె 2019లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసి రెండోసారి ఖైరతాబాద్ కార్పొరేటర్‌గా గెలిచింది.
విజయారెడ్డి 2022 జూన్ 18న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసిన అనంతరం టీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసి జూన్ 23న కాంగ్రెస్ పార్టీలో చేరింది.[6][7][8] 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన రెండో జాబితాలో ఆమెను ఖైరతాబాద్ అభ్యర్థిగా టికెట్ ప్రకటించింది.[9][10][11]
మూలాలు
మార్చు- ↑ Andhrajyothy (14 November 2023). "భార్యలే ఐశ్వర్యవంతులు! టాప్‌లో ఓ మహిళా కాంగ్రెస్ అభ్యర్థి!". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
- ↑ TV5 News (4 December 2020). "ఖైరతాబాద్‌లో విజయారెడ్డి, చర్లపల్లిలో బొంతు శ్రీదేవీ గెలుపు" (in ఇంగ్లీష్). Archived from the original on 20 August 2021. Retrieved 20 August 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Eenadu (21 November 2023). "నాన్న బాట.. గెలుపు వేట". Archived from the original on 21 November 2023. Retrieved 21 November 2023.
- ↑ Sakshi (27 April 2014). "మాయలోళ్లను నమ్మొద్దు: విజయారెడ్డి". Archived from the original on 20 June 2022. Retrieved 20 June 2022.
- ↑ "PJR daughter joins TRS" (in ఇంగ్లీష్). 21 August 2014. Archived from the original on 20 June 2022. Retrieved 20 June 2022.
- ↑ TV9 Telugu (18 June 2022). "నాన్న బాటలోనే నేనూ.. ఆ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించిన టీఆర్ఎస్ కార్పొరేటర్ విజయారెడ్డి". Archived from the original on 20 June 2022. Retrieved 20 June 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (19 June 2022). "కాంగ్రెస్‌లోకి విజయారెడ్డి.. రేవంత్‌రెడ్డిని కలిసి చర్చలు". Archived from the original on 20 June 2022. Retrieved 20 June 2022.
- ↑ Andhra Jyothy (23 June 2022). "కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2022. Retrieved 23 June 2022.
- ↑ Eenadu (27 October 2023). "తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదల". Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.
- ↑ Sakshi (27 October 2023). "కాంగ్రెస్ రెండో జాబితా విడుదల". Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.
- ↑ Andhrajyothy (28 October 2023). "విష్ణును పక్కనెట్టి అజారుద్దీన్‌కే కాంగ్రెస్ టికెట్ ఎందుకు..?". Archived from the original on 28 October 2023. Retrieved 28 October 2023.