ఎనుముల రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి
(రేవంత్ రెడ్డి నుండి దారిమార్పు చెందింది)

ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ ఎన్నికయ్యాడు.[4][5] అతను 2023 తెలంగాణా శాసనసభ ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడుగా ఎన్నికయ్యాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా రేవంత్ రెడ్డి పేరును నిర్ణయం చేసిన‌ట్లు ఢిల్లీలో 2023 డిసెంబరు 5న ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో కాంగ్రెస్ పార్టీ నేష‌న‌ల్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ కేసీ వేణుగోపాల్ ప్ర‌క‌టించాడు. ఆయన హైదరాబాద్ ఎల్.బి.స్టేడియంలో డిసెంబర్ 7న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేశాడు.

ఎనుముల రేవంత్ రెడ్డి
ఎనుముల రేవంత్ రెడ్డి


2వ తెలంగాణ ముఖ్యమంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2023 డిసెంబరు 7
గవర్నరు
మల్లు భట్టివిక్రమార్క
ముందు కల్వకుంట్ల చంద్రశేఖరరావు

తెలంగాణ శాసన సభాపక్ష నేత
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2023 డిసెంబరు 7
ముందు కల్వకుంట్ల చంద్రశేఖరరావు
(ముఖ్యమంత్రి)

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2023 డిసెంబరు 7
ముందు పట్నం నరేందర్ రెడ్డి
నియోజకవర్గం కొడంగల్
పదవీ కాలం
2 జూన్ 2014 – 11 డిసెంబర్ 2018
ముందు అనుముల రేవంత్ రెడ్డి'
తరువాత పట్నం నరేందర్ రెడ్డి
నియోజకవర్గం కొడంగల్

తెలంగాణ కాంగ్రెస్ కమిటీ 3వ అధ్యక్షుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
7 జూలై 2021
ముందు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
23 మే 2019 - – 8 డిసెంబర్ 2023[1]
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు మల్లారెడ్డి
నియోజకవర్గం మల్కాజ్‌గిరి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు
పదవీ కాలం
2009 – 2014
ముందు గురునాధ్ రెడ్డి
తరువాత అనుముల రేవంత్ రెడ్డి
నియోజకవర్గం కొడంగల్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడు
పదవీ కాలం
2007 – 2009
నియోజకవర్గం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్

మిడ్జిల్ జెడ్పిటిసీ
మహబూబ్​నగర్​ జిల్లా పరిషత్
మహబూబ్​నగర్​ జిల్లా
పదవీ కాలం
2006 – 2007

వ్యక్తిగత వివరాలు

జననం (1969-11-08) 1969 నవంబరు 8 (వయసు 55)
కొండారెడ్డిపల్లి గ్రామం వంగూరు మండలం నాగర్‌కర్నూల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ (2017 - ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ (2008–2017)
తల్లిదండ్రులు అనుముల నర్సింహారెడ్డి, రామచంద్రమ్మ
జీవిత భాగస్వామి గీతారెడ్డి (మ. 1992)[2]
సంతానం నైమిష[3]
వృత్తి రాజకీయ నాయకుడు

తొలినాళ్ళు

మార్చు

రేవంత్ రెడ్డి 1969 నవంబరు 8న, తెలంగాణ రాష్ట్రం నాగర్‌కర్నూల్ జిల్లా, వంగూరు మండలం, కొండారెడ్డిపల్లి గ్రామం లో జన్మించాడు. చిన్నప్పటి నుండే రాజకీయాల్లో ఆసక్తితో ఉన్నా ఆర్ట్స్ లో స్నాతకులు.[6]

రేవంత్ రెడ్డికి మొత్తం ఏడుగురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. పెద్దన్న భూపల్ రెడ్డి రిటైర్డ్ ఎస్సై, రెండో అన్న కృష్ణారెడ్డి, మూడో అన్న తిరుపతి రెడ్డి కొడంగల్ కాంగ్రెస్ ఇంఛార్జ్‌గా పని చేశాడు. నాల్గొవ సోదరుడు జగదీశ్వర్ రెడ్డి యూఎస్‌లో స్ధిరపడ్డాగా మరో ఇద్దరు సోదరులు కొండల్ రెడ్డి, కృష్ఱారెడ్డి హైదరాబాద్‌లో వ్యాపారాలు చేస్తున్నారు. మరో సోదరుడు కొండల్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు కవల సోదరులు.[7]

వ్యక్తిగత జీవితం

మార్చు

రేవంత్ రెడ్డి మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి తమ్ముడి కూతురు గీతా రెడ్డిని ప్రేమించి, పెద్దలను ఒప్పించి 1992లో వివాహం చేసుకున్నాడు.[8] వారికీ ఒక కుమార్తె నైమిషా రెడ్డి ఉంది.

రాజకీయ జీవితం

మార్చు

రేవంత్‌రెడ్డి 2006లో మిడ్జిల్ మండలం జడ్పీటీసి సభ్యుడుగా విజయం సాధించి[9], అతను 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[10] ఆయన ఆ తరువాత తెలుగుదేశం పార్టీలో చేరి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి రావులపల్లి గురునాథ్ రెడ్డి పై 14694 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా శాసనసభకు ఎన్నికయ్యాడు. అతను 2014లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. రేవంత్‌ రెడ్డి 2014 నుండి 17 వరకు టీడీఎల్పీ ఫ్లోర్‌ లీడర్‌గా పని చేసి 2017 అక్టోబరులో టిడిపికి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరి[11] ఆ తరువాత 2018లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యాడు. ఆయన 2018 డిసెంబరులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి ఓడిపోయాడు.[12]

రేవంత్‌ రెడ్డి 2019 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[13] ఆయన 2021 జూన్ 26న తెలంగాణ పీసీసీ అధ్యక్ష్యుడిగా నియమితుడై[14] 2021 జూలై 7న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ సమక్షంలో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[15][16]

రేవంత్ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి 119 నియోజకవర్గాల్లో 64 అసెంబ్లీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు గెలిచారు. రేవంత్‌రెడ్డి 2023లో కొడంగల్, కామారెడ్డి నియోజకవర్గాల‌ నుంచి పోటీ చేసి కామారెడ్డిలో ఓటమిపాలై, కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచాడు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శాసనసభాపక్షం రేవంత్ రెడ్డిని సిఎల్పీ నేతగా, రాష్ట్ర ముఖ్యమంత్రి గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.2023 డిసెంబరు 7 నాడు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు. ‌

 
హైదరాబాద్ అసెంబ్లీ ప్రాంగణంలో మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్, డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు

మూలాలు

మార్చు
  1. Andhrajyothy (8 December 2023). "మల్కాజ్‌గిరి ప్రజలకు సీఎం రేవంత్ బహిరంగ లేఖ.. ఏమన్నారంటే..?". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  2. "Illali Muchatlu With Geetha(Revanth Reddy Wife) 17th Nov 2011 Abn Andhrajyothy". youtube.com. Nov 17, 2011. Retrieved February 15, 2013.
  3. Deccan Chronicle (28 December 2023). "Talk of the town: Making a mark in 2023". Archived from the original on 29 December 2023. Retrieved 29 December 2023.
  4. Eenadu (28 October 2023). "కాంగిరేసు అభ్యర్థులు వీరే". Archived from the original on 28 October 2023. Retrieved 28 October 2023.
  5. News18 తెలుగు (23 May 2019). "రేవంత్ రెడ్డా మజాకా...ఎమ్మెల్యేగా ఓడి ఎంపీగా గెలిచారు." Archived from the original on 6 December 2023. Retrieved 6 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. Eenadu (14 November 2023). "మన అభ్యర్థులవి పెద్ద చదువులే". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
  7. News18 తెలుగు (6 December 2023). "తెలంగాణ కాబోయే సీఎం రేవంత్ రెడ్డికి ఎంత మంది సోదరులున్నారో తెలుసా." Archived from the original on 6 December 2023. Retrieved 6 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  8. Prabha News (6 December 2023). "కొత్త సిఎం… ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీ…". Archived from the original on 6 December 2023. Retrieved 6 December 2023.
  9. V6 Velugu (6 December 2023). "జడ్పీటీసీ నుంచి సీఎం దాకా.. రేవంత్ రెడ్డి ప్రస్థానం". Archived from the original on 6 December 2023. Retrieved 6 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  10. Eenadu (26 October 2023). "అంచెలంచెలుగా ఎదిగి అసెంబ్లీకి". Archived from the original on 26 October 2023. Retrieved 26 October 2023.
  11. Sakshi (31 October 2017). "కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న రేవంత్‌ రెడ్డి". Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.
  12. TV9 Telugu (27 October 2023). "టీఆర్ఎస్ టూ కాంగ్రెస్.. వయా టీడీపీ.. రేవంత్ సంచలన రాజకీయ ప్రస్థానం ఇదే." Archived from the original on 6 December 2023. Retrieved 6 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  13. Sakshi (27 June 2021). "TPCC: మరి అసంతృప్తుల పరిస్థితి ఏమిటి?". Sakshi. Archived from the original on 27 June 2021. Retrieved 27 June 2021.
  14. Namasthe Telangana (26 June 2021). "టీపీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్ రెడ్డి నియామ‌కం". Namasthe Telangana. Archived from the original on 26 June 2021. Retrieved 26 June 2021.
  15. Andrajhyothi (7 July 2021). "టీపీసీపీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం". Archived from the original on 7 July 2021. Retrieved 7 July 2021.
  16. Sakshi (27 June 2021). "అంచెలంచెలుగా ఎదిగి.. అధ్యక్షుడిగా." Archived from the original on 27 July 2021. Retrieved 27 July 2021.

బయటి లంకెలు

మార్చు
 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.