పి.ఎం. సయీద్
పదనాథ మహమ్మద్ సయీద్ (10 మే 1941 - 18 డిసెంబర్ 2005) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన లక్షద్వీప్ లోక్‌సభ నియోజకవర్గం నుండి 1967 నుండి 2004 వరకు వరుసగా పది సార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై[1] 22 మే 2004 నుండి 18 డిసెంబర్ 2005 వరకు మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిగా పని చేశాడు.[2]
పదనాథ మహమ్మద్ సయీద్ | |||
| |||
కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 22 మే 2004 – 18 డిసెంబర్ 2005 | |||
ముందు | అనంత్ గీతే | ||
---|---|---|---|
తరువాత | సుశీల్ కుమార్ షిండే | ||
నియోజకవర్గం | లక్షద్వీప్ | ||
పదవీ కాలం 1967 – 2004 | |||
తరువాత | డాక్టర్ పి. పూకున్హి కోయా | ||
నియోజకవర్గం | లక్షద్వీప్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఆండ్రోట్ ద్వీపం, లక్షద్వీప్ , బ్రిటిష్ ఇండియా | 1941 మే 10||
మరణం | 2005 డిసెంబరు 18 సియోల్, దక్షిణ కొరియా | (వయసు 64)||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | ఏ.బి. రహ్మత్ సయీద్ | ||
సంతానం | ముహమ్మద్ హమ్దుల్లా సయీద్ | ||
నివాసం | లక్షద్వీప్ | ||
మూలం | TOI obituary |
వ్యక్తిగత జీవితం
మార్చుపీఎం సయీద్ లక్షద్వీప్‌లోని ఆండ్రోట్ ద్వీపంలో మే 10, 1941న జన్మించాడు. ఆయన మంగళూరులోని ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో బికామ్, ముంబైలోని సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ లాలో న్యాయశాస్త్రం పూర్తి చేశాడు.
ఆయన కుమారుడు ముహమ్మద్ హమ్దుల్లా సయీద్ పూణేలోని ఇండియన్ సొసైటీ కళాశాల నుండి లా గ్రాడ్యుయేట్, 26 సంవత్సరాల వయస్సులో లక్షద్వీప్ నియోజకవర్గం నుండి ఎన్నికై 15వ లోక్‌సభలో అతి పిన్న వయస్కుడైన ఎంపీగా రికార్డు సృష్టించాడు.[3]
నిర్వహించిన పదవులు
మార్చు- 1979 నుండి 1980 వరకు కేంద్ర రాష్ట్ర, ఉక్కు, బొగ్గు & గనుల మంత్రి
- 1993 నుండి 1995 వరకు కేంద్ర హోం వ్యవహారాల శాఖ మంత్రి
- 1995 నుండి 1996 వరకు కేంద్ర సమాచార & ప్రసార శాఖ మంత్రి 1995–1996; మరియు * 1998 నుండి 2004 వరకు లోక్ సభ డిప్యూటీ స్పీకర్
- 22 మే 2004 నుండి 18 డిసెంబర్ 2005 వరకు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి
- 2004 నుండి 2006 వరకు రాజ్యసభ సభ్యుడు, ఢిల్లీ [4]
మరణం
మార్చుసయీద్ కాలేయం పెరగడం & ప్రాణాంతక లక్షణాలతో వైద్య చికిత్స కోసం దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని హ్యుందాయ్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతూ 2005 డిసెంబర్ 19న గుండెపోటుతో మరణించాడు. అతనికి భార్య ఎబి రహమత్ సయీద్, ఒక కుమారుడు, ఏడుగురు కుమార్తెలు ఉన్నారు.[5][6][7]
మూలాలు
మార్చు- ↑ Sayeed, P.M. "Ten Terms in Lok Sabha". Lok Sabha Secretariat. Retrieved 29 March 2011.
- ↑ "Statistical report on general elections, 2004 to the Fourteenth Lok Sabha" (PDF). ECI. p. 361. Retrieved 30 May 2014.
- ↑ "Entry into Parliament is a reward: Hamdulla Sayeed". The Indian Express. 21 May 2009. Retrieved 30 May 2014.
- ↑ "Delhi Pradesh Congress Committee". Delhi Pradesh Congress Committee. Archived from the original on 13 August 2013. Retrieved 30 May 2014.
- ↑ "Power Minister P M Sayeed is dead". IBNLive. 19 December 2005. Archived from the original on 5 June 2014. Retrieved 30 May 2014.
- ↑ News18 (19 December 2005). "Power Minister P M Sayeed is dead" (in ఇంగ్లీష్). Archived from the original on 23 May 2024. Retrieved 23 May 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Cabinet condoles PM Sayeed's death". The Times of India. 19 December 2005. Retrieved 30 May 2014.