ముహమ్మద్ హమ్‌దుల్లా సయీద్
ముహమ్మద్ హమ్‌దుల్లా సయీద్ (జననం 11 ఏప్రిల్ 1982) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన లక్షద్వీప్ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
ముహమ్మద్ హమ్‌దుల్లా సయీద్ | |||
పదవీ కాలం 2024 | |||
ముందు | మహమ్మద్ ఫైజల్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | లక్షద్వీప్ | ||
పదవీ కాలం 2009 - 2014 | |||
ముందు | పి. పూకున్హి కోయా | ||
తరువాత | మహమ్మద్ ఫైజల్ | ||
నియోజకవర్గం | లక్షద్వీప్ | ||
లక్షద్వీప్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు
| |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఆండ్రోట్, లక్షద్వీప్ | 1982 ఏప్రిల్ 11||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | పీఎం సయీద్ , రహ్మత్ సయీద్ | ||
జీవిత భాగస్వామి | డాక్టర్ అమ్నా | ||
నివాసం | లక్షద్వీప్ |
వివాహం
మార్చుముహమ్మద్ హమ్‌దుల్లా సయీద్ ఢిల్లీకి చెందిన డా. అమ్నా మీర్జాను 19 ఫిబ్రవరి 2012న వివాహం చేసుకున్నాడు.[2]
రాజకీయ జీవితం
మార్చుముహమ్మద్ హమ్‌దుల్లా సయీద్ తన తండ్రి మాజీ కేంద్ర మంత్రి పీఎం సయీద్ మరణాంతరం రాజకీయాల్లోకి వచ్చి 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో లక్షద్వీప్ లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ అభ్యర్థి పి. పూకున్హి కోయాపై 2,198 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
ఆయన ఆ తరువాత 2014, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో వరుసగా ఎన్‌సీపీ అభ్యర్థి మహమ్మద్ ఫైజల్ చేతిలో ఓడిపోయి, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఎన్‌సీపీ అభ్యర్థి మహమ్మద్ ఫైజల్ పై 2,647 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3][4]
మూలాలు
మార్చు- ↑ The Hindu (4 June 2024). "Lok Sabha elections: Hamdullah Sayeed of Indian National Congress wrests back Lakshadweep". Archived from the original on 6 August 2024. Retrieved 6 August 2024.
- ↑ The Times of India (19 March 2019). "Youngest MP gets married". Archived from the original on 6 August 2024. Retrieved 6 August 2024.
- ↑ TimelineDaily (20 March 2024). "Congress Nominates Former MP Muhammad Hamdullah Sayeed For Lakshadweep". Archived from the original on 6 August 2024. Retrieved 6 August 2024.
- ↑ Keralakaumudi Daily (5 June 2024). "Victory after 15 years; Muhammed Hamdullah Sayeed wins back Lakshadweep". Archived from the original on 6 August 2024. Retrieved 6 August 2024.