పులికాట్ పక్షుల సంరక్షణ కేంద్రం

ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల మధ్య ఉన్న సహజ సిద్ధమైన అభయారణ్యం.

పులికాట్ పక్షుల సంరక్షణ కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా, తమిళనాడు రాష్ట్రంలోని తిరువల్లూరు జిల్లాల మధ్య 759 చ.కి.మీ.ల విస్తీర్ణంలో ఉన్న సహజ సిద్ధమైన అభయారణ్యం. భారతదేశంలోని ఉప్పు-నీటి సరస్సుల్లో ఒరిస్సాలోని చిలికా సరస్సు తరువాత పులికాట్ లేక్ రెండవ అతిపెద్ద సరస్సు.[1] దీని అంతర్జాతీయ పేరు పులికాట్ లేక్ వైల్డ్ లైఫ్ సంక్చురి, IBA కోడ్: IN261, ప్రమాణం: A1, A4iii.[2]

పులికాట్ పక్షుల సంరక్షణ కేంద్రం
పులికాట్-మచ్చల పెలికాన్
Map showing the location of పులికాట్ పక్షుల సంరక్షణ కేంద్రం
Map showing the location of పులికాట్ పక్షుల సంరక్షణ కేంద్రం
పులికాట్ పక్షుల సంరక్షణ కేంద్రం
Locationఆంధ్రప్రదేశ్-తమిళనాడు, భారతదేశం
Nearest cityశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా-తిరువల్లూరు
Coordinates13°34′N 80°12′E / 13.567°N 80.200°E / 13.567; 80.200
Governing bodyఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ, తమిళనాడు అటవీ శాఖ

భౌగోళికం

మార్చు

ఇది 13°34′N 80°12′E / 13.567°N 80.200°E / 13.567; 80.200 అక్షాంశరేఖాంశాల మధ్యలో ఉంది. ఇందులోని 327.33 చ.కి.మీ.ల ప్రాంతం ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ,[3] 153.67 చ.కి.మీ.ల ప్రాంతం తమిళనాడు అటవీ శాఖ నిర్వహిస్తుంటుంది. 108 చ.కి.మీ.ల నేషనల్ పార్క్ ప్రాంతం ఉంది. ఇక్కడ దాదాపు800–2000 మి.మీ. వర్షపాతం ఉండగా, 14°C నుండి 33C వరకు ఉష్ణోగ్రత మారుతుంటుంది. సగటు సముద్ర మట్టానికి 100' నుండి 1200' వరకు ఎత్తు ఉంటుంది.[1]

 
పెయింటెడ్ కొంగ (మైక్టేరియా ల్యూకోసెఫాలా)

జంతుజాలం

మార్చు

ఇక్కడ చాలా వృక్షజాలం ఉంది.[1][4] గూడ బాతు, కొంగలు వంటి జల, భూసంబంధమైన పక్షులకు ఆహారం, గూడు లభించే ప్రదేశం కనుక అనేక పక్షులు ఇక్కడికి వలస వస్తాయి. ఈ సరస్సుకు ప్రతి ఏటా వందల వేల సందర్శకులు వస్తారు.

ప్రమాదాలు

మార్చు

పులికాట్ సరస్సు నత్తలతో నిండిపోయి రాబోయే 100 సంవత్సరాలలో అదృశ్యమయ్యే ప్రమాదం ఉంది.[5] ఈ ప్రమాదాన్ని అరికట్టడానికి ప్రభుత్వ, ప్రైవేటు ప్రభుత్వేతర సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 Tamil Nadu Forest Department retrieved 9/9/2007 Pulicat Lake Bird Sanctuary Archived 4 జనవరి 2017 at the Wayback Machine
  2. BirdLife International Pulicat Lake Wildlife Sanctuary[permanent dead link]
  3. Andhra Pradesh Forest Department, PULICAT Wildlife Sanctuary Archived 25 జనవరి 2014 at the Wayback Machine
  4. Bird Forum, Pulicat Lake (Andhra Pradesh) (2008)
  5. Raj, P. J. Sanjeeva. Macro Fauna of Pulicat Lake Archived 27 జూలై 2011 at the Wayback Machine, National Biodiversity Authority Chennai, Tamil Nadu, India. (2006)