పుల్వామా
పుల్వామా, (దీనిని పురాతన కాలంలో పన్వంగం అని పిలుస్తారు.[1] తరువాత పుల్గాంఅని పిలిచేవారు.) [2]భారతదేశ ఉత్తర కేంద్రపాలిత భూభాగమైన జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఇది ఒక నగరం, పురపాలక సంఘం.ఇది వేసవిరాజధాని శ్రీనగర్ నుండి దాదాపు 25 కి.మీ.దూరంలో ఉంది.
పుల్వామా
పుల్వాం | |
---|---|
Coordinates: 33°53′N 74°55′E / 33.88°N 74.92°E | |
భారతదేశం | భారతదేశం |
రాష్ట్రం | జమ్మూ కాశ్మీరు |
జిల్లా | పుల్వామా |
Government | |
• Type | పురపాలక సంఘం |
• Body | పుల్వామా మున్సిపల్ కౌన్సిల్ |
విస్తీర్ణం | |
• Total | 30.63 కి.మీ2 (11.83 చ. మై) |
• Rank | 4 |
Elevation | 1,630 మీ (5,350 అ.) |
జనాభా (2011) | |
• Total | 18,440 |
• Rank | 4 |
• జనసాంద్రత | 600/కి.మీ2 (1,600/చ. మై.) |
Demonym | పుల్వామియన్ |
భాషలు | |
• అధికార | కాశ్మీరీ |
Time zone | UTC+5:30 |
ప్రాంతపు కోడ్ | 91-1933 |
Vehicle registration | JK13 |
లింగనిష్పత్రి | 913 |
Website | www.pulwama.gov.in |
భౌగోళికం
మార్చుపుల్వామా 32°53′N 74°55′E / 32.88°N 74.92°E.వద్ద ఉంది.[3] సముద్రమట్టానికి దీని సగటు ఎత్తు1,630మీ. (53,50అ) ఉంది.సగటు వర్షపాతం సంవత్సరానికి 505.3 మి.మీ.గరిష్ఠ ఉష్ణోగ్రత 37°C వరకు చేరుకుంటుంది. కనిష్ఠ ఉష్ణోగ్రత 6°C వరకు తగ్గుతుంది.పుల్వామా ఇతరజిల్లాల మాదిరిగా వార్షిక హిమపాతాన్ని పొందుతుంది, కానీ ఇది కనిష్ఠంగా ఉంటుంది.
జనాభా
మార్చు2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పుల్వామాలో 18,440 జనాభా ఉంది.వారిలో 10,070 మంది పురుషులు కాగా,8,370 మంది మహిళలు ఉన్నారు.[4] 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 3,167, ఇది పుల్వామా మొత్తం జనాభాలో 17.17%.స్త్రీల లింగనిష్పత్తి రాష్ట్ర సగటు 889కు వ్యతిరేకంగా 831గా ఉంది.పుల్వామాలో పిల్లల లింగనిష్పత్తి 718, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర సగటు 862 తో పోలిస్తే. పుల్వామా నగర అక్షరాస్యత రాష్ట్ర సగటు 67.16% కంటే 91.18% ఎక్కువగాఉంది. [5]
మతం
మార్చుజనాభాలో ఎక్కువ భాగం ఇస్లాంను అనుసరిస్తుంది.ఇది మొత్తం పట్టణ జనాభాలో 94.59%గా ఉంది.ఇతర మైనారిటీ మతాలు హిందూ 4.63%, సిక్కు 0.34%, క్రైస్తవమతం 0.17%, బౌద్ధమతం 0.02%, జైనులు 0.01%. ఉన్నారు. 0.24% మంది ప్రజలు తమ మతాన్ని ప్రకటించలేదు.[5]
విద్య సౌకర్యాలు
మార్చుప్రస్తావనలు
మార్చు- ↑ Jasbir Singh (2004). The economy of Jammu & Kashmir. Radha Krishan Anand & Co. ISBN 9788188256099. Retrieved 2010-12-02.
The original name of Pulwama was Panwangam, which comprised four local namely, Malikpora, Dangerpora, Chatapora, Dalipora.
- ↑ Parvéz Dewân (2004). Parvéz Dewân's Jammû, Kashmîr, and Ladâkh: Kashmîr. Manas Publications. ISBN 9788170491798. Retrieved 2010-12-02.
The original name of Pulwama city(from which the district takes its name) was Panwangam. Over the centuries it got shortened to Pulgam. This in turn gradually changed to Pulwama.
- ↑ Falling Rain Genomics, Inc - Pulwama
- ↑ https://censusindia.gov.in/2011census/dchb/0112_PART_B_DCHB_PULWAMA.pdf
- ↑ 5.0 5.1 "Pulwama Population Census 2011 - 2019". census2011.co.in. Retrieved 17 February 2019.