పువ్వాడ నాగేశ్వరరావు

తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు

పువ్వాడ నాగేశ్వరరావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండుసార్లు ఖమ్మం ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎమ్మెల్సీగా పని చేశాడు.

పువ్వాడ నాగేశ్వరరావు

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1989 - 1999
ముందు మంచికంటి రాంకిషన్ రావు
తరువాత యూనిస్ సుల్తాన్
నియోజకవర్గం ఖమ్మం నియోజకవర్గం

ఎమ్మెల్సీ
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1981 - 1985
2006 - 2011
నియోజకవర్గం ఖమ్మం స్థానిక సంస్థల కోటా

వ్యక్తిగత వివరాలు

జననం సెప్టెంబర్ 14
కూనవరం, భద్రాద్రి జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ సి.పి.ఐ
తల్లిదండ్రులు చిన్న నర్సింహారావు
జీవిత భాగస్వామి విజయ లక్ష్మి
సంతానం పువ్వాడ అజయ్ కుమార్
వృత్తి రాజకీయ నాయకుడు, విద్యావేత్త[1]

రాజకీయ జీవితం

మార్చు

పువ్వాడ నాగేశ్వరరావు సి.పి.ఐ ద్వారా రాజకీయాలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి 1978లో సుజాత నగర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 1981లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో తొలిసారి సరి పోటీ చేసి శీలం సిద్ధారెడ్డి పై గెలిచి తొలిసారి శాసనమండలికి ఎన్నికై టిడిపి హయాంలో మండలి రద్దు అయ్యే వరకు ఎమ్మెల్సీగా పనిచేశాడు.

పువ్వాడ నాగేశ్వరరావు 1989, 1994 శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుండి సి.పి.ఐ అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మండలి పునరుద్ధరించబడిన తరువాత 2007లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటా నుండి శాసనమండలికి ఎమ్మెల్సీగా రెండోసారి ఎన్నికయ్యాడు. ఆయన 2015లో మూడోసారి స్థానిక సంస్థల కోటా నుంచి వామపక్ష ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.[2]

శాసనసభకు పోటీ

మార్చు
సంవత్సరం పేరు గెలుపొందిన అభ్యర్థి పేరు పార్టీ ప్రత్యర్థి పేరు పార్టీ
2015 ఖమ్మం స్థానిక సంస్థ కోటా బాలసాని లక్ష్మీనారాయణ టీఆర్ఎస్ పువ్వాడ నాగేశ్వరరావు సి.పి.ఐ
2007 ఖమ్మం స్థానిక సంస్థ కోటా పువ్వాడ నాగేశ్వరరావు సి.పి.ఐ ఎన్. రాంబాబు కాంగ్రెస్
2004 ఖమ్మం నియోజకవర్గం తమ్మినేని వీరభద్రం సీపీఎం పార్టీ పువ్వాడ నాగేశ్వరరావు సి.పి.ఐ
1999 ఖమ్మం నియోజకవర్గం యూనిస్ సుల్తాన్ కాంగ్రెస్ పార్టీ పువ్వాడ నాగేశ్వరరావు సి.పి.ఐ
1994 ఖమ్మం నియోజకవర్గం పువ్వాడ నాగేశ్వరరావు సి.పి.ఐ జహీర్ అలీ మొహమ్మద్ కాంగ్రెస్ పార్టీ
1989 ఖమ్మం నియోజకవర్గం పువ్వాడ నాగేశ్వరరావు సి.పి.ఐ దుర్గప్రసాద్ రావు కాంగ్రెస్ పార్టీ
1981 ఖమ్మం ఎమ్మెల్యేల కోటా పువ్వాడ నాగేశ్వరరావు సి.పి.ఐ శీలం సిద్ధారెడ్డి కాంగ్రెస్
1978 సుజాత నగర్ బుగ్గారపు సీతారామయ్య కాంగ్రెస్ పార్టీ పువ్వాడ నాగేశ్వరరావు సి.పి.ఐ

మూలాలు

మార్చు
  1. "Puvvada Nageswara Rao". 2022. Archived from the original on 16 June 2022. Retrieved 16 June 2022.
  2. Mana Telangana (5 December 2015). "మూడోసారి శాసన మండలి బరిలోకి పువ్వాడ". Archived from the original on 22 మే 2022. Retrieved 16 June 2022.