పూజా దేవరియా ఒక భారతీయ డ్రామా, చలనచిత్ర నటి. ఆమె తమిళం, కన్నడ చిత్రాలలో తన పాత్రలతో ప్రసిద్ధి చెందింది. సెల్వరాఘవన్ రూపొందించిన మాయక్కం ఎన్న (2012) చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. ఆమె స్ట్రీ ఫ్యాక్టరీతో కలిసి థియేటర్లోనూ విస్తృతంగా పనిచేసింది.[2]

పూజా దేవరియా
జననంచెన్నై, తమిళనాడు[1]
వృత్తినటి
క్రియాశీలక సంవత్సరాలు2011 - ప్రస్తుతం

కెరీర్

మార్చు

సెల్వరాఘవన్ మాయక్కం ఎన్న (2011) చిత్రంలో ధనుష్ ముఠాలోని స్నేహితురాలు పద్మిని పాత్రను పోషించి పూజా తన నటనా రంగ ప్రవేశం చేసింది. ఆ తరువాత, ఆమె థియేటర్ గ్రూప్ స్ట్రే ఫ్యాక్టరీలో చేరింది. ఆ సంస్థతో కలిసి వేదిక ప్రదర్శనలు, ఆన్లైన్ వీడియోలపై పనిచేసింది.[3][4] ముఖ్యంగా, ఆమె డిసెంబరు 2012లో ది త్రీ మస్కటీర్స్ జోరో గా నటించింది.[5] 2013లో, నరేన్ వీస్ రాసిన మాయా ఫ్రమ్ మదురై నాటకం ద్వారా ఆమె దర్శకురాలిగా అరంగేట్రం చేసింది.[6]

2015లో, ఆమె కార్తీక్ సుబ్బరాజ్ ఇరివి, మణికందన్ కుత్రముం తందనయుం చిత్రాలతో సహా నాలుగు సినిమాల్లో చేసింది.[7] 2018లో సెన్నా హెగ్డే దర్శకత్వం వహించిన కాత్తెయండూ షురూవాగిడే చిత్రంతో ఆమె కన్నడలోకి అడుగుపెట్టింది.[8]

ఆమె దర్శకుడు భరత్ బాలాతో కలిసి నెట్‌ఫ్లిక్స్ సంకలనం నవరస ప్రదర్శన శిక్షకురాలిగా పనిచేసింది.[9][10][11] ఆమె లోకేష్ కనగరాజ్ చిత్రం 2022లో కమల్ హాసన్ నటించిన విక్రమ్ లో పనిచేసింది, ఇందులో ఆమె విజయ్​ సేతుపతికి పెర్ఫార్మెన్స్ కోచ్ గా అతని బాడీ లాంగ్వేజ్ కు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చింది.[12] విజయ్ సేతుపతితో ఆమె అనుబంధం చాలా కాలం ఉంది. శ్రీరామ్ రాఘవన్ చిత్రం మెర్రీ క్రిస్మస్, కిషోర్ పాండురంగ్ బేలేకర్ నిశ్శబ్ద చిత్రం గాంధీ టాక్స్ రెండింటికీ ఆమె అతని ప్రదర్శన శిక్షకురాలు.[13]

ఫిల్మోగ్రఫీ

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర గమనిక
2011 మాయక్కం ఎన్న పద్మిని
2015 మయాం
2016 ఆండవన్ కట్టలై ఆర్తి
ఇరవి మలార్ ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎడిసన్ అవార్డు గెలుచుకుంది
కుట్టరామే తందనై అను ఉత్తమ సహాయ నటిగా వికటన్ అవార్డు, ఉత్తమ సహాయ నటి గా నార్వే తమిళ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు గెలుచుకుంది
మో మో (మోహనవధాని)
2018 ఆంధ్ర మెస్ అరసీ
కాతేయండూ షురూవాగైడ్ తాన్యా కన్నడ సినిమా
2019 వెల్లై పూకల్ రామయ్యా
2019 అయోగ్యా సంథియా
2023 వల్లవనుక్కుం వల్లవన్ ఆండాల్

పెర్ఫార్మెన్స్ కోచ్ గా

మార్చు
సంవత్సరం సినిమా దర్శకుడు
2021 నవరస భరత్ బాల
2022 విక్రమ్ లోకేష్ కనగరాజ్
2022 డీఎస్పీ పొన్రామ్
2023 జవాన్ అట్లీ
2024 గాంధీ టాక్స్ కిషోర్ పాండురంగ్ బేలేకర్

పురస్కారాలు

మార్చు

సినిమాలు

సంవత్సరం అవార్డు వర్గం సినిమా ఫలితం
2016 బిహైండ్వుడ్స్ అవార్డులు ఉత్తమ నటి విమర్శకుల ఎంపిక ఇరవి గెలుపు[14]
2016 ఎడిసన్ అవార్డ్స్ ఉత్తమ సహాయ నటి ఇరవి గెలుపు[15]
2016 బిహైండ్వుడ్స్ అవార్డులు ఉత్తమ నటి విమర్శకుల ఎంపిక కుట్టరామే తందనై గెలుపు
2016 వికటన్ అవార్డులు ఉత్తమ సహాయ నటి కుట్టరామే తందనై గెలుపు
2016 నార్వే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఉత్తమ సహాయ నటి కుట్టరామే తందనై గెలుపు

మూలాలు

మార్చు
  1. "How Pooja Devariya's kathe began". Cinema Express. Archived from the original on 6 August 2020.
  2. "Pooja Balu, Stray Factory". The New Indian Express.
  3. "Busting the Madrasi myth". 5 November 2014 – via www.thehindu.com.
  4. "A short and sweet debut". 8 July 2013 – via www.thehindu.com.
  5. "A laugh riot". 18 December 2012 – via www.thehindu.com.
  6. "Five years of Stray Factory: Fast and furiously funny". 27 July 2015 – via www.thehindu.com.
  7. "Iraivi's first look will be released well before Diwali 2015". Behindwoods. 29 September 2015.
  8. "Senna Hegde finds his leading lady in Pooja Devariya". The Times of India. October 2017.
  9. "Ace your acting skills with actress Pooja Devariya". The Times of India. 13 October 2020.
  10. "Meet Pooja Devariya: The Woman Behind the Emotions of Netflix's Navarasa". 7 August 2021.
  11. "Nine emotions within minutes: How 'Navarasa' teaser was made". 28 July 2021.
  12. "Vijay Sethupathi works with performance trainer for 'Vikram'". The Times of India. 16 May 2022.
  13. "Vijay Sethupathi on being the busiest lead Tamil actor — even during a pandemic". 14 September 2021.
  14. "Pooja Devariya gets the Best Actress - Critics Choice in the BGM 2017". Behindwoods. 11 June 2017.
  15. "Edison Awards". edisonawards.in.