పూజా బెనర్జీ
పూజా బెనర్జీ (పూజా బోస్) బెంగాలీ, హిందీ సినిమా, టివి నటి.[6][7] స్టార్ ప్లస్‌లో వ్చిన తుజ్ సంగ్ ప్రీత్ లగై సజ్నా సీరియల్ లో బృందా పాత్రలో నటించి గుర్తింపు పొందింది. ఝలక్ దిఖ్లా జా (2014), కామెడీ నైట్స్ బచావో (2015), బిగ్ బాస్ బంగ్లా (2016) వంటి కార్యక్రమాలలో కూడా పాల్గొంది.[8] తెలుగులో వీడు తేడా అనే సినిమాలో నటించింది.
పూజా బెనర్జీ | |
---|---|
జననం | [1] | 1987 ఫిబ్రవరి 6
ఇతర పేర్లు | పూజా బోస్ |
వృత్తి | నటి, మోడల్ |
జీవిత భాగస్వామి | అర్నోయ్ చక్రవర్తి (2007-2013) కునాల్ వర్మ (వి. 2020)[2][3][4] |
పిల్లలు | 1[5] |
జననం
మార్చుపూజా 1987, ఫిబ్రవరి 6న పశ్చిమ బెంగాల్ లోని కలకత్తాలో జన్మించింది.
టెలివిజన్ రంగం
మార్చుకహానీ హమారే మహాభారత్ కీ అనే సీరియల్ తో తన నట జీవితాన్ని ప్రారంభించిన పూజా, తరువాత తుజ్ సాంగ్ ప్రీత్ లగాయ్ సజ్నాలో సాధారణ పంజాబీ అమ్మాయి బృందా పాత్రలో నటించింది.[9] పూజా ఝలక్ దిఖ్లా జా 7 కార్యక్రమంలో పాల్గొన్నది. కొరియోగ్రాఫర్ రజిత్ దేవ్, వైభవి మర్చంట్‌కి చీఫ్ కొరియోగ్రాఫర్ కూడా పనిచేసింది.[10]
2015 నుండి 2017 వరకు ప్రసారమైన కామెడీ నైట్స్ బచావో సీరియల్ లోనూ, జీటివిలో వచ్చిన ఖుబూల్ హై సీరియల్ లో ఆఫ్రీన్ పాత్రలోనూ,[11] అండ్ టీవీలో వచ్చిన రజియా సుల్తాన్ సీరియల్ లో యాస్మిన్ పాత్రలోనూ నటించింది. 2016లో, బిగ్ బాస్ బంగ్లా, కామెడీ నైట్స్ లైవ్ లలో పాల్గొన్నది.[12]
2017లో ఆశిష్ చౌదరి, సుమోనా చక్రవర్తి నటించిన దేవ్ సీరియల్ లో మహేక్ పాత్రలో నటించింది.[13] 2018లో సీజన్ 2తో కార్యక్రమానికి మళ్ళీ వచ్చింది. 2019లో, కిచెన్ ఛాంపియన్ 5, ఖత్రా ఖత్రా ఖత్రా కార్యక్రమంలో పాల్గొన్నది, తర్వాత విష్‌లో మక్దినా పాత్రలో నటించింది.[14] 2020లో, జగ్ జననీ మా వైష్ణో దేవి - కహానీ మాతా రాణి కీ సీరియల్ లో వైష్ణోదేవి పాత్రలో నటించింది.[15]
సినిమా రంగం
మార్చు2011లో తెలుగులో వచ్చిన వీడు తేడా అనే సినిమాలో సినిమారంగంలోకి ప్రవేశించింది.[16] హిరాన్ ఛటర్జీతో కలిసి మాచో ముస్తానా సినిమాలో,[17] దేవ్ అధికారి నటించిన రాజా చందా సినిమా ఛాలెంజ్ 2, మహాక్షయ్ చక్రవర్తి నటించిన సుజిత్ మోండల్ సినిమా రాకీ లలో నటించింది.
వ్యక్తిగత జీవితం
మార్చుపూజాకు 2007లో అర్నోయ్ చక్రవర్తితో వివాహం జరిగింది. 2013లో వారిద్దరు విడాకులు తీసుకున్నారు.[6] తనతో తుజ్ సాంగ్ ప్రీత్ లగాయ్ సజ్నా నటించిన సహనటుడు కునాల్ వర్మను 2020లో వివాహం చేసుకుంది.[18] 2020 అక్టోబరులో వారికి ఒక బాబు జన్మించగా, బాబుకు క్రిషివ్ అని పేరు పెట్టారు.[19]
నటించిన సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | భాష | గమనికలు |
---|---|---|---|---|
2011 | వీడు తేడా | మేఘన | తెలుగు | |
2012 | మాకో మస్తానా | దియా | బెంగాలీ | |
2012 | ఛాలెంజ్ 2 | పూజ | బెంగాలీ | |
2013 | రాజధాని ఎక్స్‌ప్రెస్ | సునీత | హిందీ | |
2013 | లవ్రియా | స్వీటీ | బెంగాలీ | |
2013 | రాకీ | నందిని | బెంగాలీ | |
2013 | ఓ! హెన్రీ | బ్రిష్టి | బెంగాలీ | |
2013 | ప్రోలోయ్ | స్పెషల్ డాన్సర్ | బెంగాలీ | |
2013 | రామయ్య వస్తావయ్యా | అతిధి పాత్ర | హిందీ | |
2014 | తీన్ పట్టి | మోహోర్ | బెంగాలీ | |
2016 | గ్రేట్ గ్రాండ్ మస్తీ | సప్నా అమర్ సక్సేనా | హిందీ | |
2018 | హొయిచోయి అన్‌లిమిటెడ్ | లోలా | బెంగాలీ | |
2018 | దీవానా హోలో సోమ | బెంగాలీ | ||
2018 | యే మాయా హనైమా | నేపాలీ | ||
2018 | భలోబాస భలోబాస 2 | బెంగాలీ | ||
2019 | ఛాలెంజ్ 3 | బెంగాలీ | ||
3 దేవ్ | హిందీ |
మూలాలు
మార్చు- ↑ "Puja Banerjee".
- ↑ "Kunal Verma shares details of his engagement with Puja Banerjee, says he was commitment phobic earlier". Times of India. 14 August 2017.
- ↑ Kunal Verma: After our break-up I realised that Puja Banerje was the one for me
- ↑ Actress Puja Banerjee gets engaged to beau Kunal Verma; see pics - India Today
- ↑ "Puja Banerjee's heartwarming note on embracing motherhood; recalls when she could not see her baby for three days post delivery". 14 October 2020.
- ↑ 6.0 6.1 "Post divorce, Puja Bose is now back to being Puja Chakraborty". Tellychakkar.com. 2014.
- ↑ "Puja Banerjee". Archived from the original on 8 June 2014.
- ↑ Puja Banerjee eliminated from Jhalak Dikhhla Jaa, retrieved 29 July 2014
- ↑ Pooja Banerjee has blind faith over Ekta Kapoor Archived 8 జూలై 2012 at Archive.today.
- ↑ "Puja Banerjee". Archived from the original on 8 June 2014. Retrieved 30 June 2014.
- ↑ Maheshwri, Neha (6 October 2015). "Mahadev's Parvati turns daayan in 'Qubool Hai'". The Times Of India. Retrieved 6 October 2015.
- ↑ "Actress Puja Banerjee And Kunal Verma Welcome Baby Boy". 9 October 2020.
- ↑ "Dev 2 actor Puja Banerjee: If it wasn't for Kunal, I wouldn't have been able to achieve so much in life". 2 July 2018.
Mahek is the most mysterious and mischievous character in the show and it's only going to turn darker this season,"
- ↑ "Naagin 4: Puja Banerjee To REPLACE Surbhi Jyoti As NEW Naagin In Ekta Kapoor's Show?". 30 September 2019.
- ↑ "Patiala Babes' Paridhi Sharma replaces Puja Banerjee in Jag Jaanani Maa Vaishnodevi; here's her first look". 1 July 2020.
- ↑ "Actor Nikhil tastes commercial success". The Times of India. 19 December 2011. Archived from the original on 7 October 2013.
- ↑ "Macho Mustafa' is now 'Macho Mastana'". The Times of India. 24 February 2012. Archived from the original on 27 April 2013.
- ↑ "Puja Banerjee-Kunal Verma Are Already MARRIED; TV Couple Kept Their Court Wedding As A Secret For 45 Days". 16 April 2020.
- ↑ "Puja Banerjee and Kunal Verma blessed with a baby boy". 10 October 2020.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో పూజా బెనర్జీ పేజీ
- ఇన్స్టాగ్రాం లో పూజా బెనర్జీ