పూసపాటి అశోక్ గజపతి రాజు

విజయనగరం నుండి 16వ లోక్ సభ సభ్యులు. తెలుగు దేశం పార్టీ. పౌరవిమాన శాఖామాత్యులు.

పూసపాటి అశోక్ గజపతి రాజు (జననం 1951 జూన్ 16) రాజకీయ నేత. ఈయన విజయనగరం ఎస్టేట్ కు ప్రస్తుత రాజు. విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు.

పూసపాటి అశోక్ గజపతి రాజు

లోక్‍సభ సభ్యుడు, కేంద్ర కేబినెట్ మంత్రి
పదవీ కాలం
2014 - ప్రస్తుత
ముందు బొత్స ఝాన్సీ లక్ష్మి
నియోజకవర్గం విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం

ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు
పదవీ కాలం
1978-1983 1983-1985
1985-1989 1989-1994
1994-1999 1999-2004
2009-2014
నియోజకవర్గం విజయనగరం శాసనసభా నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1951-06-16) 1951 జూన్ 16 (వయసు 73)
విజయనగరం, ఆంధ్ర ప్రదేశ్
రాజకీయ పార్టీ తెలుగు దేశం పార్టీ
జీవిత భాగస్వామి సునీత
సంతానం ఇద్దరు
పూర్వ విద్యార్థి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ఉస్మానియా విశ్వవిద్యాలయం
మతం హిందువు

రాజకీయ ప్రస్థానం

మార్చు

తొలిసారిగా జనతా పార్టీ తరఫున 1978లో పోటీ చేసారు. ఆపై 1983, 1985, 1989, 1994, 1999, 2009 లలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసారు. మొత్తం 36 యేళ్ళ రాజకీయ జీవితంలో 7 సార్లు ఎంఎల్ఏ గానూ, ఒక సారి ఎంపీ గానూ పదవీ బాధ్యతలు చేపట్టారు. పదవీ కాలంలో ఎన్నో మార్లు ఆంధ్ర ప్రదేశ్ క్యాబినెట్ లో మంత్రిగా పనిచేసారు.[1] 2014 లో విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి 16వ లోక్ సభకు ఎం.పీగా ఎన్నుకోబడ్డారు.[2] నరేంద్ర మోడి ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా పౌర విమానయాన శాఖ బాధ్యతలు చేపట్టారు. గతంలో ఎన్టీ రామారావు క్యాబినెట్ లో ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగానూ, చంద్రబాబునాయుడు హయాంలో ఫినాన్స్, లెజిస్లేటివ్ అఫెయిర్స్ ఇంకా రెవెన్యూ శాఖలలో మంత్రిగా పనిచేసారు. తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు.

వ్యక్తిగత జీవితం

మార్చు

పూసపాటి అశోక గజపతి రాజు పూసపాటి రాజవంశానికి చెందిన వారు. ఈ వంశం సూర్యవంశానికి చెందిన ఉదయపూర్ మహారాణా కుటుంబానికి చెందినది, త్రేతాయుగపు శ్రీరాముడు ఈ వంశం వాడే. వీరి తండ్రి పూసపాటి విజయరామ గజపతి రాజు కూడా "విజయనగరం రాజాసాహెబ్ వారు" (1924 మే 1-1995 నవంబరు 14). ఆయన భారత పార్లమెంట్ సభ్యులు.[3]

మూలాలు

మార్చు
  1. అసలుసిసలు విజయనగరం ‘రాజా’[permanent dead link]
  2. "విజయనగరం నియోజకవర్గం ఫలితాలు". Archived from the original on 2014-05-19. Retrieved 2014-05-26.
  3. "అశోక గజపతి రాజు జాలగూడు సమాచారం". Archived from the original on 2014-01-13. Retrieved 2014-05-26.