పి. వి. రమణ (వాలీబాల్ క్రీడాకారుడు)

వాలీబాల్ క్రీడాకారుడు
(పూసర్ల వెంకటరమణ నుండి దారిమార్పు చెందింది)

పూసర్ల వెంకట రమణ భారత వాలీబాల్ క్రీడాకారుడు. అతను భారతీయ రైల్వే సికింద్రాబాదులో స్పోర్టు మేనేజరుగా చేస్తున్నాడు. అతను భారత జాఈత వాలీబాల్ పురుషుల జట్టులో సభ్యుడు. రమణ వాలీబాల్‌లో 2000 సంవత్సరం అర్జున అవార్డు విజేత.[1] 1986 లో ఆసియా క్రీడల్లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న భారత జట్టు సభ్యుడు[2].

పి. వి. రమణ
పి.వి.రమణ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరుపూసర్ల వెంకటరమణ
జాతీయతభారతీయుడు
జననంనిర్మల్, నిర్మల్ జిల్లా, తెలంగాణ
నివాసప్రాంతంసికింద్రాబాదు, తెలంగాణ, భారతదేశం

అతని కుమార్తె పుసర్ల వెంకట సింధు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. ఆమె 2019లో బి.డబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ లో బంగారుపతకాన్ని సాధించింది.

రమణ సొంత ఊరు ఆదిలాబాద్‌లోని నిర్మల్[3]. అతని తండ్రి ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసేవాడు. తండ్రి ఉద్యోగ రీత్యా నిడదవోలులో కొంత కాలం ఉన్నాడు. రమణ ఐడీపీఎల్ బాలానగర్‌లో చదువుకొన్నాడు. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి టెలివిజన్ ఛానల్ అధిపతి రాధాకృష్ణకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రమణ తాను ఐదు సంవత్సరాల వయస్సులో తండ్రిని కోల్పోయాడని అందువల్ల హైదరాబాదులో పెరిగానని తెలిపాడు. అతను విజయవాడలో డిగ్రీ చేసినట్లు తెలియజేసాడు.[4] వారి పూర్వీకులు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినవారు.[5]

కుటుంబం

మార్చు

అతని భార్య విజయ కూడా జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారిణి. ఆమె భారతీయ రైల్వేలలో ఉద్యోగం చేస్తుంది. [3] వారి చిన్న కుమార్తె సింధు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. ఆమె 2016 ఒలంపిక్ క్రీడలలో రజత పతకాన్ని గెలుచుకుంది. ఆమె పెద్ద కుమార్తె దివ్య వృత్తిరీత్యా వైద్యురాలు.[6] ప్రవృత్తి రీత్యా జాతీయ స్థాయి నెట్‌బాల్[6] క్రీడాకారిణి.

మూలాలు

మార్చు
  • Vaidya, Jaideep. "Jack of all sports, master of volleyball: The story of PV Ramana". Scroll.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-06-12.
  1. Sudhir, T.S. (19 August 2016). "Rio Olympics 2016: PV Sindhu's success stems from efforts of Gopichand and her father". F. Sports. Retrieved 19 August 2016.
  2. [1]
  3. 3.0 3.1 "Who does PV Sindhu belong to? Telangana and Andhra Pradesh in bitter fight". India Today. 20 August 2016. Retrieved 28 December 2017.
  4. [2]
  5. "PV Sindhu's father offers prayers to their family deity in West Godavari". The New Indian Express. 19 August 2016. Archived from the original on 20 ఆగస్టు 2016. Retrieved 19 August 2016.
  6. 6.0 6.1 "Divine Coincidences : Why Did P V Sindhu Write So On That Visiting Card". Tirumalesa. 22 August 2016. Archived from the original on 29 డిసెంబరు 2017. Retrieved 28 December 2017.

బాహ్య లంకెలు

మార్చు