పి.వి. సింధు

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి
(పుసర్ల వెంకట సింధు నుండి దారిమార్పు చెందింది)

పూసర్ల వెంకట సింధు (జననం: 1995 జూలై 5) భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి.[1] 2016 లో జరిగిన రియో ఒలింపిక్ క్రీడల్లో రజత పతకం సాధించి ఒలింపిక్ పోటీల్లో రజత పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది.[2] టోక్యో 2020 ఒలింపిక్స్ క్రీడల్లో కాంస్య పతకం గెలుచుకుంది.

పి.వి. సింధు
2015 లో సింధు
వ్యక్తిగత సమాచారం
జన్మనామంపూసర్ల వెంకట సింధు
జననం (1995-07-05) 1995 జూలై 5 (వయసు 29)
హైదరాబాదు
ఎత్తు5 అడుగులు 10 అంగుళాలు (1.78 మీ.)
దేశం భారతదేశం
వాటంకుడిచేతి వాటం
మహిళ సింగిల్స్
అత్యున్నత స్థానం16 (18 జనవరి 2013)
ప్రస్తుత స్థానం16 (18 జనవరి 2013)
BWF profile

2012 సెప్టెంబరు 21 న అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య ప్రకటించిన స్థానాల్లో మొదటి 20 క్రీడాకారిణుల జాబితాలో చోటు దక్కించుకోవడంతో సింధుకు మొదటి సారిగా అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది.[3] 2013 ఆగస్టు 10 న చైనాలో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య నిర్వహించిన ప్రపంచ చాంపియన్ షిప్ లో పతకం సాధించి, ఆ పతకం గెలిచిన మొట్టమొదటి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది. 2015 మార్చి 30 న సింధుకు భారత ప్రభుత్వం పద్మశ్రీని ప్రధానం చేసింది.[4] 2016 ఆగస్టు 18 న రియో ఒలింపిక్స్ లో జరిగిన సెమీఫైనల్లో జపాన్కు చెందిన నోజోమీ ఒకుహరాను ఓడించి ఒలింపిక్ క్రీడల్లో బ్యాడ్మింటన్ విభాగంలో ఫైనల్ చేరిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. తరువాత జరిగిన ఫైనల్లో రజత పతకం సాధించి, ఒలింపిక్స్ లో రజతం సాధించిన మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణిగా, అత్యంత పిన్న వయస్కురాలైన భారతీయురాలిగా నిలిచింది.[5] 2012 ఒలింపిక్స్ లో కాంస్యపతకం సాధించిన సైనా నెహ్వాల్ తరువాత బ్యాడ్మింటన్ లో పతకం సాధించిన రెండో క్రీడాకారిణిగా సింధు నిలిచింది.[6]

2018లో 85 లక్షల యు.ఎస్. డాలర్ల ఆదాయంతో, 2019లో 55 లక్షల యు.ఎస్. డాలర్ల ఆదాయంతో, సింధు ఫోర్బ్స్ విడుదల చేసే అత్యధిక పారితోషికం తీసుకునే మహిళా అథ్లెట్ల జాబితాలోకెక్కింది.[7][8] 2020 జనవరిలో భారతదేశంలో మూడవ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మ భూషణ్‌ని ఆమె అందుకుంది.[9][10]

2022లో పీవీ సింధు ప్రతిష్ఠాత్మక స్విస్ ఓపెన్ టైటిల్‌ గెలుచుకున్నారు. దీంతో 2011, 2012లో సైనా నెహ్వాల్ ఈ టైటిల్ రెండుసార్లు గెలుచుకోగా రెండో భారతీయ క్రీడాకారిణిగా సింధు గుర్తింపుపొందారు.[11]

కుటుంబ వివరాలు

సింధు 1995 జూలై 5 న పి. వి. రమణ, పి. విజయ దంపతులకు హైదరాబాదులో జన్మించింది.[12] ఆ దంపతులిద్దరూ వాలీబాల్ క్రీడాకారులు. రమణ పూర్వీకులు పశ్చిమ గోదావరి జిల్లా జిల్లాకు చెందిన వారు. ఆయన ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో జన్మించాడు.[13] ఉద్యోగ రీత్యా గుంటూరుకు తరలి వెళ్ళాడు.[12] రమణకు రైల్వేలో ఉద్యోగం రావడంతో తన వాలీబాల్ కెరీర్ కోసం హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. తల్లి విజయ స్వస్థలం విజయవాడ .[12] 2000 లో రమణకు అర్జున పురస్కారం లభించింది.[14] ఆమె తల్లిదండ్రులిద్దరూ వాలీబాల్ ఆటగాళ్ళైనా సింధు మాత్రం పుల్లెల గోపీచంద్ స్ఫూర్తితో బ్యాడ్మింటన్ ఎంచుకుంది. అప్పటికి గోపీచంద్ ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ పోటీలలో గెలిచి వార్తలలో వ్యక్తిగా ఉన్నాడు.[15] సింధు ఎనిమిదేళ్ళ వయసు నుంచే బ్యాడ్మింటన్ ఆడటం ప్రారంభించింది.

సాధించిన విజయాలు

పోటీ 2010 2011 2012 2013
  కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్[16] రెండవ రౌండు
BWF ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌షిప్స్[16] మూడవ రౌండు
  చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్[16] అర్హత సెమీ ఫైనల్స్
  ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్[16] రెండవ రౌండు
  ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్[16] సెమీ ఫైనల్స్ మొదటి రౌండు క్వార్టర్ ఫైనల్స్
  జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్[16] రెండవ రౌండు
  డచ్ ఓపెన్[16] 2  రజతపతకం
  ఇండియా ఓపెన్ గ్రాండ్ పిక్స్[16] రెండవ రౌండు రెండవ రౌండు 2  రజతపతకం

2013 ప్రపంచ ఛాంపియన్‌షిప్

2013 లో తొలిసారి ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌లో ఆడిన ప్రపంచ 12వ ర్యాంకర్ పి.వి.సింధు, సంచలనం నమోదు చేసింది. తన కంటే మెరుగైన ర్యాంకులో ఉన్న చైనా క్రీడాకారిణిని ఓడించి కార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 2013 ఆగస్టు 8 న జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ యిహాన్‌ వాంగ్‌ను 55 నిమిషాల్లోనే 21-18, 23-21 స్కోరుతో ఓడించింది. కవోరి ఇమబెపు (జపాన్) తో 2013 ఆగస్టు 7 న జరిగిన రెండో రౌండ్‌లో సింధు 21-19, 19-21, 21-17తో విజయం సాధించింది. 71 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధుకు గట్టిపోటీనే లభించింది. నిర్ణాయక మూడో గేమ్‌లో సింధు ఒక దశలో 10-13తో వెనుకబడింది. ఈ దశలో ఒత్తిడికి లోను కాకుండా సంయమనంతో ఆడిన సింధు, వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 14-13తో ఆధిక్యంలోకి వచ్చింది. అనంతరం ఆ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ విజయాన్ని ఖాయం చేసుకుంది.

2016 రియో ఒలింపిక్స్

పతకాల కోసం భారత్ తల్లడిల్లుతున్న సమయంలో పి.వి.సింధు భారత్‌కు రెండో పతకాన్ని ఖాయం చేసింది. ఈ ఒలింపిక్స్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో గ్రూప్ ఎంలో కెనడాకు చెందిన మిషెల్లీ లీను 2-1 తేడాతో, హంగరీకి చెందిన లారా సరోసీని 2-0 తేడాతో ఓడించి 16వ రౌండులో చైనీస్ తాయ్ జూ యింగ్ పై 2-0 తో గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది.

క్వార్టర్ ఫైనల్‌లో చైనాకు చెందిన వాంగ్ ఇహాన్‌ను 2-0 తో ఓడించి సెమీ ఫైనల్‌కు చేరుకుంది. 2016, ఆగస్టు 18వ తేదీ జరిగిన సెమీ ఫైనల్స్‌లో జపాన్‌ క్రీడాకారిణి నొజోమి ఒకుహరాతో వీరోచితంగా పోరాడి 2-0 తో ఆమె పై విజయం సాధించి ఫైనల్స్‌కు చేరింది.[17]

2016 ఆగస్టు 19వ తేదీన జరిగిన ఫైనల్స్‌లో స్పెయిన్‌కు చెందిన కరోలినా మారిన్తో వీరోచితంగా పోరాడి 21-19, 12-21,15-21 పాయింట్లతో పరాజయం పాలయింది. ఈ ఒలింపిక్స్‌లో మహిళల సింగల్స్ బ్యాడ్‌మింటన్‌లో ద్వితీయ స్థానం పొంది ఈ క్రీడలలో భారత్‌కు తొలి, ఏకైక రజత పతకాన్ని సంపాదించిపెట్టింది.[17]

2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్

2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఆమె ఐదో స్థానంలో మొదలుపెట్టింది. వరుస రౌండ్లలో పై యు-పో, ఝాంగ్ బీవెన్‌లపై వరుస సెట్ల విజయాలతో ఆమె తన ఆటను ప్రారంభించింది. తాయ్ త్జు-యింగ్‌పై విజయం సాధించడంతో ఆమె అందరినీ ఆకట్టుకుంది. మొదటి రౌండ్ లో తగ్గినా 12–21, 23–21, 21–19తో తాయ్‌ను ఓడించి సెమీ-ఫైనల్‌కు చేరింది.[18] సెమీ-ఫైనల్లో, ఆమె చెన్ యుఫీని వరుస సెట్లలో ఓడించి, వరుసగా మూడవ ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లోకి ప్రవేశించింది.[19] నోజోమి ఒకుహారాతో జరిగిన ఫైనల్లో, ఆమె 21–7, 21–7తో గెలిచింది. ఈ ప్రక్రియలో, ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన తొలి భారతీయురాలు అయ్యారు.[20]

2021 టోక్యో ఒలింపిక్స్

పీవీ సింధు తొలి మ్యాచ్‌లో ఇజ్రాయెల్ షట్లర్‌‌ సెనియా పాలికర్‌తో తలపడి కేవలం 28 నిమిషాల్లో 21-7, 21-10తో వరుస సెట్లలో మ్యాచ్ గెలిచింది.[21] ఆమె తన రెండో మ్యాచ్‌లో హాంకాంగ్ ప్లేయర్ చియాంగ్ ఎంగన్‌తో తలపడి 21-9, 21-16తో వరుస సెట్లలో గెలుపొంది ప్రి క్వార్టర్స్‌కు చేరుకుంది.[22] సింధు ప్రిక్వార్టర్స్‌లో డెన్మార్క్‌కు చెందిన మియా బ్లిచ్‌ఫెల్డ్‌తో తలపడి 21-15, 21-13తో గెలిచి క్వార్టర్ ఫైనల్ కు చేరింది.

ఆమె క్వార్టర్‌ ఫైనల్‌లో జపాన్‌కు చెందిన యమగూచిపై 21-13, 22-20తో విజయం సాధించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది.[23] పీవీ సింధు సెమి ఫైనల్ లో చైనీస్‌ తైపీ షట్లర్ తైజుయింగ్‌తో తలపడి 18-21, 12-21తో ఓటమి పాలైంది. అనంతరం మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో చైనా క్రీడాకారిణి బింగ్‌ జియావో పై 21-13, 21-15 తేడాతో గెలిచి కాంస్య పతకం గెలిచింది.[24][25]

2021 ఇండోనేషియా మాస్టర్స్

2021లో ఇండోనేషియా మాస్టర్స్ - దీన్నే అధికారికంగా దైహట్సు ఇండోనేషియా మాస్టర్స్ 2021 (ఆంగ్లం: DAIHATSU Indonesia Masters 2021)అని అంటారు. ఇది ఒక బ్యాడ్మింటన్ టోర్నమెంట్. ఈ అంతర్జాతీయ టోర్నమెంట్ ఇండోనేషియాలోని బాలి ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో 16 నవంబరు నుండి 2021 నవంబరు 21 వరకు జరిగింది. టైటిల్ విజెత US$600,000 బహుమతిగా గెలుచుకుంటారు. ఈ సంవత్సరం టోర్నమెంట్ సూపర్ 500 నుండి సూపర్ 750గా అప్‌గ్రేడ్ చేయబడింది.[26]

2021 నవంబరు 18న బాలిలో జరిగిన ఇండోనేషియా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత ఏస్ షట్లర్ పివి సింధు స్పెయిన్‌కు చెందిన క్లారా అజుర్మెండిపై అద్భుత విజయాన్ని నమోదు చేసి క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది.[27] అయితే 2021 నవంబరు 21న జరిగిన సెమీఫైనల్‌లో జపాన్‌కు చెందిన టాప్ సీడ్ అకానె యమగుచి చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి పివి సింధు నిష్క్రమించింది.  ఏకపక్షంగా సాగిన ఈ పోరులో 13-21, 9-21 తేడాతో కేవలం 32 నిమిషాల్లోనే ఓటమిపాలైంది. తొలి సెట్‌లో కాస్త పోరాడినా ప్రయోజనం దక్కలేదు. రెండో సెట్‌లోనూ ఆరంభంలో అకానె యమగుచి మీద ఆధిక్యత ప్రదర్శించింది. ఆ తరువాత ఒక్కసారిగా పుంజుకున్న అకానె యమగుచి సూపర్‌ గేమ్‌ ఆడటంతో పివి సింధు ఓటమిని చవిచూసింది.[28] ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ ఛాంపియన్ గా దక్షిణ కొరియా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అన్ సే-యంగ్ కైవాసం చేసుకుంది.

2022 సింగపూర్‌ ఓపెన్‌ టైటిల్‌

ఇదే ఏడాది సయ్యద్‌ మోదీ ఇంటర్నేషనల్‌, స్విస్ ఓపెన్‌ బీడబ్ల్యూఎఫ్‌ సూపర్‌ 300 టైటిళ్లను గెలుచుకున్న పి.వి. సింధు తొలిసారి సింగపూర్‌ ఓపెన్‌ టైటిల్‌ను సొంతం చేసుకోవడంతో ప్రస్తుత సీజన్‌లో ఆమెకిది మూడో టైటిల్‌ అయింది. 2022 జూలై 17న సింగపూర్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్‌లో చైనాకు చెందిన వాంగ్‌ జీ యీపై 21-9, 11-21, 21-15 తేడాతో పి.వి. సింధు విజయం సాధించింది. ఇది తన కెరీర్‌లోనే తొలి సూపర్ 500 టైటిల్‌ అవడం విశేషం.[29]

వ్యక్తిగత విజయాలు

వరుస సంఖ్య సంవత్సరం టోర్నీ ఫైనల్లో ప్రత్యర్థి స్కోరు
1 2011 ఇండోనేషియా ఇంటర్నేషనల్   ఫ్రాంసిస్కా రట్నసరి 21-16, 21-11[30]
2 2013 మలేషియా మాస్టర్స్   గు జువాన్ 21–17, 17–21, 21–19
3 2013 మకావూ ఓపెన్   మిషెల్ లీ 21–15, 21–12
4 2014 మకావూ ఓపెన్   కిం హ్యో మిన్ 21–12, 21–17
5 2015 మకావూ ఓపెన్   మినట్సు మితానీ 21–9, 21-23, 21-14
6 2016 మలేషియా మాస్టర్స్   కిర్స్టీ గిల్మోర్ 21-15, 21-9
     గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్
     అంతర్జాతీయ పోటీ

రెండవస్థానంలో సాధించిన విజయాలు

వరుస సంఖ్య సంవత్సరం టోర్నమెంటు ఫైనల్లో ప్రత్యర్థి స్కోరు
1 2011 డచ్ ఓపెన్   యావో జీ 16–21, 17–21
2 2012 సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్   లిండావెని ఫానెట్రి 15-21, 21-18, 18-21
3 2014 సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్   సైనా నెహ్వాల్ 14-21, 17-21
4 2015 డెన్మార్క్ ఓపెన్   లీ షురూయ్ 19-21, 12-21
5 2016 దక్షిణ ఆసియా క్రీడలు   గద్దె రుత్విక శివాని 11–21, 20–22
6 2016 ఒలింపిక్స్   కరోలినా మారిన్ 21–19, 12–21, 15–21
     సూపర్ సీరీస్ ప్రీమియర్
     గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్
     గ్రాండ్ ప్రిక్స్

క్రీడాకారిణిగా సింధు పయనం

సింధు 14 ఏళ్ళ వయస్సులోనే అంతర్జాతీయ సర్క్యూట్‌లోకి ప్రవేశించింది. కొలంబోలో జరిగిన 2009 సబ్-జూనియర్ ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె కాంస్య పతక విజేత. 2010 ఇరాన్ ఫజ్ర్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ఛాలెంజ్‌లో ఆమె సింగిల్స్ విభాగంలో రజత పతకం సాధించింది.[31] 2011 జూన్లో ఆమె పి.సి. తులసిని ఓడించి మాల్దీవుల అంతర్జాతీయ ఛాలెంజును గెలుచుకుంది.[32] 2012 జూలై 7 న, ఆమె 18-21, 21–17, 22–20తో ఫైనల్లో జపనీస్ క్రీడాకారిణి నోజోమి ఒకుహారాను ఓడించి ఆసియా జూనియర్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది.[33] ఆసియా ఛాంపియన్‌షిప్‌లో లి జుయెరుయ్‌పై ఆమె దాదాపు విజయం సాధించింది, కానీ 21–11, 19–21, 8–21తో ఓడిపోయింది.[34] 2015 లో ఒత్తిడివల్ల ఫ్రాక్చర్ తో దాదాపు ఆరు నెలలు ఆటకు దూరమైంది, అయినా 2016 రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించగలిగింది.[35][36] సింధు 2016 చైనా ఓపెన్‌లో తన మొదటి సూపర్‌సిరీస్ టైటిల్‌ను గెలుచుకుంది, కొనసాగింపుగా 2017 లో మరో నాలుగు ఫైనళ్లతో, దక్షిణ కొరియా, భారతదేశంలో టైటిళ్లను సొంతంచేసుకుంది. దానికి తోడు, ఆమె 2018 కామన్వెల్త్ క్రీడలు, 2018 ఆసియా క్రీడలలో ఒక్కొక్క రజత పతకాన్ని, ఉబెర్ కప్‌లో రెండు కాంస్య పతకాలను గెలుచుకుంది. సింధును 2020 మార్చి 8 న బిబిసి సంవత్సరపు భారతీయ మహిళా క్రీడాకారిణిగా ఎంపిక చేశారు.[37] ఏప్రిల్‌లో, క్రీడలో శుభ్రమైన, న్యాయమైన ఆటను ప్రోత్సహించడానికి బి.డబ్యు,ఎఫ్ (BWF) కమిటీ ప్రచారానికి "ఐ యామ్ బాడ్మింటన్" రాయబారులలో ఒకరిగా ఆమె ఎన్నికయ్యారు.[38] 2021 మేలో, క్రీడల్లో తారుమార్లను నివారించే లక్ష్యంతో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రచారం "బిలీవ్ ఇన్ స్పోర్ట్"లో బ్యాడ్మింటన్ నుండి వచ్చిన ఇద్దరు రాయబారులలో ఒకరిగా ఆమె ఎన్నికయ్యారు.[39] హైదరాబాద్ హంటర్స్ జట్టుకు నాయకత్వం వహించింది.

*ఆగస్టు 19 2016 గణాంకాల ప్రకారం[40]
పోటీ 2016
ఒలింపిక్స్ 2  రజతపతకం
పోటీ 2014
కామన్ వెల్త్ క్రీడలు 3  కాంస్యపతకం
పోటీ 2011
కామన్ వెల్త్ యువ క్రీడలు 1  స్వర్ణపతకం

వ్యక్తిగత సింగిల్ ఫెర్ఫార్మెన్స్

టోర్మమెంటు 2009 2010 2011 2012 2013 2014 2015 2016 SR అత్యుత్తమం
అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య పోటీలు
ప్రపంచ జూనియర్ చాంపియన్ షిప్ పోటీలు 2R QF 3R హాజరు కాలేదు N/A 0/3 QF ('10)
ప్రపంచ చాంపియన్ షిప్ హాజరు కాలేదు NH B B QF NH 0/3 SF ('13, '14)
ఒలింపిక్స్ NH DNQ NH S F ('16)
BWF సూపర్ సిరీస్
  ఆల్ ఇంగ్లాండ్ సూపర్ సిరీస్ ప్రీమియర్ హాజరు కాలేదు 1R 2R 1R A 1R 0/4 2R ('13)
  ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ N/A 1R QF SF 1R A QF 0/5 SF ('13)
  మలేషియా సూపర్ సీరీస్ హాజరు కాలేదు Q1[41] 1R 2R A QF 0/4 QF ('16)
  సింగపూర్ ఓపెన్ సిరీస్ హాజరు కాలేదు 1R A QF A 2R 0/3 QF ('14)
  ఇండోనేషియా సూపర్ సిరీస్ ప్రీమియర్ హాజరు కాలేదు 2R A 1R 1R A 0/3 2R ('12)
  ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ N/A QF 1R 1R 0/3 QF ('14)
  జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ హాజరు కాలేదు 2R 2R A 1R 0/3 2R ('12, '13)
  కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ హాజరు కాలేదు Q2[42] 2R A 2R 0/3 2R ('13, '15)
  డెన్మార్క్ సూపర్ సిరీస్ ప్రీమియర్ హాజరు కాలేదు 1R QF F 0/3 F ('15)
  ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ హాజరు కాలేదు 2R 1R 1R 0/3 2R ('13)
  చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ హాజరు కాలేదు Q2[43] 1R హాజరు కాలేదు 2R 0/3 2R ('15)
  హాంగ్ కాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ హాజరు కాలేదు Q2[44] 1R 1R 2R 1R 0/5 2R ('14)
  చైనా మాస్టర్స్ సూపర్ సిరీస్ హాజరు కాలేదు SF A N/A 0/1 SF ('12)
BWF సూపర్ సిరీస్ మాస్టర్స్ ఫైనల్స్ క్వాలిఫై కాలేదు DNQ
BWF గ్రాండ్ ప్రిక్స్
  మలేషియా మాస్టర్స్ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ హాజరు కాలేదు SF W A SF W 2/4 W ('13, '16)
  సయ్యద్ మోడీ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ QF[45] SF[46] 2R[47] F NH F SF 2R 0/7 F ('12, '14)
  జర్మన్ ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ హాజరు కాలేదు 1R[48] హాజరు కాలేదు QF 0/2 QF ('16)
  స్విస్ ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ N/A A 1R 2R SF A QF 0/4 SF ('14)
  చైనా మాస్టర్స్ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ N/A హాజరు కాలేదు QF 0/1 QF ('16)
  చైనీస్ తైపీ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ హాజరు కాలేదు 2R 0/1 2R ('15)
  వియత్నాం ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ హాజరు కాలేదు QF[49] హాజరు కాలేదు 0/1 QF ('11)
  ఇండోనేషియన్ మాస్టర్స్ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ హాజరు కాలేదు QF 0/1 QF ('15)
  థాయ్ లాండ్ ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ హాజరు కాలేదు 2R హాజరు కాలేదు 0/1 2R ('12)
  డచ్ ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ హాజరు కాలేదు F[50] హాజరు కాలేదు 0/1 F ('12)
  మకావూ ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ హాజరు కాలేదు W W W 3/3 W ('13, '14, '15)
  ఇండియా ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ Q2[51] 2R[52] N/A 0/2 2R ('10)
సంవత్సరాంతపు ర్యాంకింగ్స్[53] 255 151 31 19 11 11 12

పురస్కారాలు

జాతీయ పురస్కారాలు

బయటి లంకెలు

మూలాలు

  1. Krishna Pokharel. "Indian Badminton Player P.V. Sindhu Makes History in Rio Olympics". The Wall Street Journal.
  2. "I'm on Cloud Nine, says Olympic silver-medalist PV Sindhu". The Times of India. 19 August 2016. Retrieved 19 August 2016.
  3. "Sindhu breaks into world top 20 ranking". The Hindu. Chennai, India. 21 September 2012. Retrieved 21 September 2012.
  4. PTI. "Advani, Bachchan, Dilip Kumar get Padma Vibhushan". The Hindu.
  5. "Rio 2016 | Silver is the colour; Sindhu's dream run ends in final". 2016-08-19. Retrieved 2016-08-19.
  6. "Rio Olympics 2016 Live Updates: PV Sindhu Goes Down Fighting; Wins Silver for India". 2016-08-19. Retrieved 2016-08-19.
  7. Badenhausen, Kurt. "The Highest-Paid Female Athletes 2018". Forbes (in ఇంగ్లీష్). Retrieved 23 August 2019.
  8. Badenhausen, Kurt. "The Highest-Paid Female Athletes 2019: Serena And Osaka Dominate". Forbes (in ఇంగ్లీష్). Retrieved 23 August 2019.
  9. "Mary Kom will be conferred with Padma Vibhushan, PV Sindhu to get Padma Bhushan". The Economic Times. 26 January 2020. Retrieved 26 January 2020.
  10. "MINISTRY OF HOME AFFAIRS" (PDF). padmaawards.gov.in. Retrieved 25 January 2020.
  11. "సింధు ఖాతాలో మరో ప్రతిష్ఠాత్మక టైటిల్". andhrajyothy. 2022-03-27. Archived from the original on 2022-03-27. Retrieved 2022-03-27.
  12. 12.0 12.1 12.2 "PV Sindhu's father offers prayers to their family deity in West Godavari". newindianexpress.com. Archived from the original on 20 ఆగస్టు 2016. Retrieved 20 August 2016.
  13. వి. వి. సుబ్రహ్మణ్యం, జె. ఆర్ శశిధరన్. "Andhra 'ammayi' or Telangana 'bidda'? Admirers on both sides stake claims". thehindu.com. ఎన్. రామ్. Retrieved 12 October 2016.
  14. "Boys and girls with golden dreams". Deccan Chronicle. 30 December 2009. Archived from the original on 14 December 2018. Retrieved 20 October 2010.
  15. V. V., Subrahmanyam (10 April 2008). "Aiming for the stars". The Hindu. Chennai, India. Archived from the original on 8 November 2012. Retrieved 20 October 2010.
  16. 16.0 16.1 16.2 16.3 16.4 16.5 16.6 16.7 "Tournaments of P.V.Sindhu". tournamentsoftware.com.
  17. 17.0 17.1 web, master. "badminton-womens-singles-gold-medal-match". Rio 2016. Archived from the original on 26 August 2016. Retrieved 19 August 2016.
  18. "BWF World Championships: PV Sindhu assured of 3rd straight medal after stunning Tai Tzu Ying". www.indiatoday.in. 23 August 2019. Retrieved 26 August 2019.
  19. Akshay Ramesh, ed. (24 August 2019). "PV Sindhu reaches 3rd successive World Championships final after outclassing Chen Yu Fei in Basel". www.indiatoday.in. Retrieved 26 August 2019.
  20. "PV Sindhu becomes first Indian to win BWF World Championships". Business Standard. 25 August 2019. Retrieved 30 August 2019.
  21. Namasthe Telangana (25 July 2021). "Tokyo Olympics: పీవీ సింధు శుభారంభం". Namasthe Telangana. Archived from the original on 25 July 2021. Retrieved 30 July 2021.
  22. TV9 Telugu (28 July 2021). "PV Sindhu: పతకాల వేటలో తెలుగు తేజం పీవీ సింధు .. ఒలంపిక్స్‌లో మరో విజయం.. - Tokyo Olympics 2020 :Indian shuttler pv Sindhu Storms Into Round of 16". Archived from the original on 30 July 2021. Retrieved 30 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  23. Sakshi (30 July 2021). "PV Sindhu: పతకానికి ఒక్కడుగు దూరంలో పీవీ సింధు". Archived from the original on 30 July 2021. Retrieved 30 July 2021.
  24. Sakshi (1 August 2021). "Tokyo Olympics: పీవీ సింధు కొత్త చరిత్ర". Archived from the original on 1 August 2021. Retrieved 1 August 2021.
  25. BBC News తెలుగు (1 August 2021). "పీవీ సింధు: వరసగా రెండు ఒలింపిక్ మెడల్స్ గెలిచిన తెలుగు తేజం". Archived from the original on 1 August 2021. Retrieved 1 August 2021.
  26. "Tournament Upgrade – Calendar 2021". bwfbadminton.com. Badminton World Federation. 11 August 2021. Retrieved 25 September 2021.
  27. Desk, India com Sports. "Indonesia Masters 2021 Results: PV Sindhu Reaches Quarterfinals, Beat Azurmendi, Lakshya Sen Out | PV Sindhu Olympics 2021 | PV Sindhu Next Match". www.india.com (in ఇంగ్లీష్). Retrieved 2021-11-21.
  28. Nov 20, PTI / Updated:; 2021; Ist, 19:17. "Sindhu, Srikanth exit Indonesia Masters with defeats in semifinals, Indian campaign ends | Badminton News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-11-21. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  29. "PV Sindhu : పీవీ సింధు ఖాతాలో తొలి సూపర్‌ 500 టైటిల్‌". web.archive.org. 2022-07-18. Archived from the original on 2022-07-18. Retrieved 2022-07-18.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  30. "VICTOR INDONESIA INTERNATIONAL CHALLENGE 2011: Matches". www.tournamentsoftware.com. Retrieved 18 October 2015.
  31. "SAI badminton coach returns with glory". The Tribune. 13 February 2010. Retrieved 20 October 2010.
  32. "15 Years Old PV Sindhu Triumphs at Maldives Open". www.sportskeeda.com. 11 June 2011. Retrieved 31 May 2020.
  33. "Sindhu wins Asia Youth Under-19 Badminton Ch'ship". www.firstpost.com. 7 July 2012. Retrieved 31 May 2020.
  34. Dev Sukumar, ed. (24 April 2015). "AHSAN/SETIAWAN SURVIVE CLIFFHANGER – DONG FENG CITROEN BAC 2015 DAY 4". bwfbadminton.com. Retrieved 31 May 2020.
  35. "We must get used to playing in empty stadiums, that will happen: Sindhu". Hindustan Times (in ఇంగ్లీష్). 3 August 2020. Retrieved 3 August 2020.
  36. Aug 2, Pratyush Raj | TNN | Updated; 2020; Ist, 22:51. "Reaching final also an achievement: PV Sindhu | Badminton News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 3 August 2020. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
  37. "PV Sindhu named BBC Indian Sportswoman of Year". www.bbc.com. 8 March 2020. Retrieved 8 March 2020.
  38. "BWF Names PV Sindhu as an Ambassador For Its 'I Am Badminton' Campaign". www.news18.com. 22 April 2020. Retrieved 31 May 2020.
  39. "PUSARLA V.SINDHU AND MICHELLE LI APPOINTED AMBASSADORS FOR IOC'S 'BELIEVE IN SPORT' CAMPAIGN". olympics.bwfbadminton.com. Badminton World Federation. 3 May 2021. Retrieved 3 May 2021.
  40. "PUSARLA V. Sindhu – Career overview". bwfbadminton.org. Badminton World Federation. Archived from the original on 14 August 2010. Retrieved 19 August 2016.
  41. "MAYBANK Malaysia Open Presented by PROTON: Draws: WS - Qualification". అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య. Retrieved 4 February 2016.
  42. "Victor Korea Open 2012: Draws: WS - Qualification". Badminton World Federation. Retrieved 4 February 2016.
  43. "Li Ning China Open 2011: Draws: WS - Qualification". Badminton World Federation. Retrieved 4 February 2016.
  44. "Yonex Sunrise Hong Kong Open 2011: Draws: WS - Qualification". Badminton World Federation. Retrieved 4 February 2016.
  45. "JAYPEE CUP SYED MODI MEMORIAL INDIA GRAND PRIX 2009: Draws: WS". Badminton World Federation. Retrieved 3 February 2016.
  46. "India Grand Prix 2010: Draws: WS". Badminton World Federation. Retrieved 3 February 2016.
  47. "Yonex - Sunrise Syed Modi Memorial India Open Grand Prix Gold: Draws: WS". Badminton World Federation. Retrieved 3 February 2016.
  48. "YONEX German Open GPG 2012: Draws: WS". Badminton World Federation. Retrieved 2 February 2016.
  49. "Yonex Sunrise Vietnam Grand Prix Open 2011: Draws: WS". Badminton World Federation. Retrieved 2 February 2016.
  50. "Yonex Dutch Open 2011: Draws: WS". Badminton World Federation. Retrieved 4 February 2016.
  51. "Yonex Sunrise India Open 2009: Draws: WS - Qualification". అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య. Retrieved 2 February 2016.
  52. "INDIA GRAND PRIX GOLD 2010: Draws: WS". Badminton World Federation. Retrieved 2 February 2016.
  53. "BWF World Rankings". Badminton World Federation. Retrieved 4 February 2016.
  54. http://www.news18.com/news/olympics/pv-sindhu-sakshi-malik-dipa-karmakar-and-jitu-rai-to-get-khel-ratna-1284250.html
  55. సాక్షి, ఎడ్యూకేషన్ (25 January 2020). "పద్మ పురస్కారాలు-2020". Archived from the original on 10 February 2020. Retrieved 10 February 2020.
  56. నమస్తే తెలంగాణ, జాతీయం (25 January 2020). "141 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం". Archived from the original on 10 February 2020. Retrieved 10 February 2020.
  57. హెచ్ఎంటీవి, ఆంధ్రప్రదేశ్ (26 January 2020). "పద్మ అవార్డు గ్రహీతల పూర్తి జాబితా". రాజ్. Archived from the original on 10 February 2020. Retrieved 10 February 2020.
  58. Sakshi (9 November 2021). "పద్మభూషణ్‌ అందుకున్న పీవీ సింధు". Archived from the original on 9 November 2021. Retrieved 9 November 2021.