పృథ్వీనాథ్ గౌడ్

(పృథ్వీనాథ్‌ గౌడ్ నుండి దారిమార్పు చెందింది)

గుండ్రాతి పృథ్వీనాథ్‌ గౌడ్ 2020 బ్యాచ్‌కు చెందిన ఐ.ఏ.ఎస్ \ ఐ.ఆర్.ఎస్ అధికారి. ఆయన సివిల్స్ 2020 ఫ‌లితాల్లో ఆల్ ఇండియా 541వ ర్యాంకు సాధించాడు.[1]

పృథ్వీనాథ్‌ గౌడ్
జననం
గుండ్రాతి పృథ్వీనాథ్‌ గౌడ్

వృత్తిడాక్టర్
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ఐ.ఏ.ఎస్ \ ఐ.ఆర్.ఎస్ ఆఫీసర్
తల్లిదండ్రులుశ్రీనివాస్ గౌడ్, వనజ
బంధువులుప్రవళిక (చెల్లెలు)

జననం, విద్యాభ్యాసం

మార్చు

జి.పృథ్వినాథ్ గౌడ్ తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లా, కొత్తకోట మండలం, కడుకుంట్ల గ్రామంలో శ్రీనివాస్‌గౌడ్, వనజ దంపతులకు జన్మించాడు. ఆయన పదవ తరగతి కొత్తకోటలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో పూర్తి చేసి ఉన్నత విద్యాభాస్యం కోసం హైదరాబాద్ వచ్చి ఉస్మానియా వైద్య కళాశాలలో 2019లో ఎంబీబీఎస్‌ పూర్తి చేశాడు.[2]

సివిల్స్

మార్చు

డా.జి.పృథ్వినాథ్ గౌడ్ ఉస్మానియా ఆస్పత్రిలో ఇంటర్న్ షిప్ చేస్తున్నప్పడు అక్కడి పేదలు పడుతున్న కష్టాలను చూసి సివిల్ సర్వీసెస్ లో చేరి వారికీ మెరుగైన సేవ చేయాలన్న ఉద్దేశంతో సివిల్స్ కు ప్రిపేర్ అయ్యాడు. ఆయన రెండో ప్రయత్నంలో సివిల్స్ లో 541 వ ర్యాంకు సాధించాడు.[3]

అభినందనలు

మార్చు

హైదరాబాద్ రవీంద్రభారతిలోని పైడి జయరాజ్‌ ప్రివ్యూ థియేటర్‌లో అక్టోబరు 2న అఖిల భారత గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ అభినందన సభలో ఆయనను ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్‌ అభినందించి, సన్మానించాడు.[4]ఆయనను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి హైదరాబాద్ లోని చైతన్యపురిలో వారి నివాసంలో కలిసి అభినందించి, సన్మానించాడు.[5]

మూలాలు

మార్చు
  1. Sakshi (25 September 2021). "సివిల్స్‌లో తెలుగువారి సత్తా". Archived from the original on 26 December 2021. Retrieved 26 December 2021.
  2. Namasthe Telangana (2 October 2021). "కలెక్టర్లను చూసి కలెక్టర్‌ అవ్వాలనుకున్నా". Archived from the original on 4 January 2022. Retrieved 4 January 2022.
  3. Eenadu (25 September 2021). "కష్టపడి చదివారు.. సివిల్స్‌లో మెరిశారు". Archived from the original on 26 December 2021. Retrieved 26 December 2021.
  4. Namasthe Telangana (2 October 2021). "గౌడ జాతి నుంచి మరెందరో ఐఏఎస్‌లు రావాలి". Archived from the original on 5 October 2021. Retrieved 5 October 2021.
  5. Namasthe Telangana (18 October 2021). "శ్రమిస్తే విజయం తథ్యం .. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి". Archived from the original on 26 December 2021. Retrieved 26 December 2021.

బయటి లింకులు

మార్చు