వి. శ్రీనివాస్ గౌడ్

భారతీయ రాజకీయ కార్యకర్త
(వి. శ్రీనివాస్‌ గౌడ్‌ నుండి దారిమార్పు చెందింది)

విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[4] తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మహబూబ్‌నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి 2014, 2018 లో ఎమ్మెల్యేగా గెలుపొందాడు. మాజీ ముఖ్యమంత్రి మంత్రివర్గంలో ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖలకు మంత్రిగా ఉన్నాడు.[5][6][7]

వి.శ్రీనివాస్ గౌడ్
వి. శ్రీనివాస్ గౌడ్


ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, పురావస్తు శాఖ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 ఫిబ్రవరి 19 - 2023 డిసెంబర్ 03
నియోజకవర్గం మహబూబ్‌నగర్

వ్యక్తిగత వివరాలు

జననం మార్చి 16, 1969 ,
రాచాల గ్రామం , అడ్డాకల్ మండలం, మహబూబ్​నగర్​ జిల్లా, తెలంగాణ
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు నారాయణ గౌడ్,[1] వి.శాంతమ్మ [2][3]
జీవిత భాగస్వామి శారద
సంతానం శ్రీహిత, శ్రీ హర్షిత
నివాసం మినిస్టర్స్ క్వార్టర్స్, హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
వృత్తి రాజకీయ నాయకుడు
మతం హిందూ
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా 2023, జూలై 11న హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరిగిన తెలంగాణ సాహిత్య దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న వి. శ్రీనివాస్ గౌడ్, మహమూద్ ఆలీ

జననం, విద్యాభాస్యం

మార్చు

వి. శ్రీనివాస్ గౌడ్ 1969 మార్చి 16వ తేదీన మహబూబ్​నగర్ జిల్లా, అడ్డాకల్ మండలం, రాచాల గ్రామంలో జన్మించాడు. ఆయన తండ్రి నారాయణ గౌడ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు, తల్లి వి.శాంతమ్మ గృహిణి.[8] ఆయనకు ఒక చెల్లెలు శ్రీదేవి, తమ్ముడు శ్రీకాంత్ ఉన్నారు.ఆయన మహబూబ్‌న‌గర్ 1985 నుండి 1988 వరకు ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ (బీఎస్సీ), అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రైటింగ్ ఫర్ మాస్ మీడియా (పి.జి.డి.డబ్ల్యూ.ఎం.ఎం) కోర్స్ పూర్తి చేశాడు.

వివాహం

మార్చు

శ్రీనివాస్ గౌడ్ కు 1991, మే 26వ తేదీన శారదతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కూతుర్లు శ్రీహిత, శ్రీ హర్షిత.[9][10]

వృత్తి జీవితం

మార్చు

అయన 1988 లో మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో శానిటరీ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగంలో చేరాడు. అతి తక్కువకాలంలో తన పనితనంతో ఉన్నతాధికారుల మన్నలను అందుకొని 1991 లో ఫుడ్ ఇన్స్పెక్టర్ గా పదోన్నతిని పొందాడు. అనంతరం వికారాబాద్, అల్వాల్, కూకట్ పల్లి, కాప్రా మున్సిపాల్టీలలో కమిషనర్ గా పదవి బాధ్యతలు నిర్వహించాడు. అనంతరం హైదరాబాద్ నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో జాయింట్ కమిషనర్ గా పనిచేశాడు.2004 నుంచి మొదలైన తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ సంఘాల తరఫున పోరాడాడు. ఉద్యోగుల సమస్యలపై పోరాటం కోసం 2006లో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ను ఏర్పాటు చేశాడు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాజకీయ జేఏసీకి కో - ఛైర్మన్ గా కూడా వ్యవహరించాడు.[11]

రాజకీయ జీవితం

మార్చు

తెలంగాణ ప్రజల చిరకాల వాంచైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో ఉద్యోగానికి రాజీనామా చేసి మార్చి 13న టీఆర్ఎస్ పార్టీలో చేరాడు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచాడు.[12][13] ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను పార్లమెంటరీ సెక్రటరీగా నియమించాడు. 2018లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నుండి మరోసారి పోటీచేసి గెలిచాడు. 2019 ఫిబ్రవరి 19న కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి కేసీఆర్ రెండవ మంత్రివర్గంలో ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రిగా ఉన్నాడు.[14][15][16][17]

ఆయన 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నుండి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి[18][19] 18738 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[20][21]

డాక్టరేట్

మార్చు

వి. శ్రీనివాస్‌ గౌడ్‌ ఉద్యోగ సంఘాల నేతగా ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినందుకు గాను ‘క్రిస్ట్‌ న్యూ టెస్టమెంట్‌ డీమ్డ్‌ యూనివర్సిటీ’ ఆయనకు గౌరవ డాక్టరేట్ ను 2018 జూలై 30 న ప్రదానం చేశారు.[22][23] ఆయనకు 2021 ఆగస్టు 29న 'ది అమెరికన్ యూనివర్సిటీ ఫర్ గ్లోబల్ పీస్' నుండి కరోనా సమయంలో ఆయన చేసిన సేవలకు గాను గౌరవ డాక్టరేట్ అందుకున్నాడు.[24] వి. శ్రీనివాస్‌ గౌడ్‌ 2021 సెప్టెంబరు 18న ఇండో ఇజ్రాయెల్ ఫ్రెండ్ షిప్ అసోసియేషన్ 28వ వారోత్సవాల్లో భాగంగా అమెరికాకు చెందిన డే స్ప్రింగ్ క్రిస్టియన్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నాడు.[25][26]

ఎక్సైజ్ శాఖ మంత్రిగా

మార్చు

వి.శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక ఆయన హయాంలో నీరా చట్టం వచ్చింది.[27][28][29][30][31] ఆయన మెదక్‌ పట్టణంలో 2021 ఆగస్టు 18న సర్దార్‌ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించి,[32][33] ఇందిరాగాంధీ అవుట్‌ డోర్‌ స్టేడియంలో జరుగుతున్న పనులను పరిశీలించాడు.[34] ఆయన 2021 సెప్టెంబరు 15న చీఫ్‌ సెక్రెటరీ సోమేశ్‌కుమార్‌తో నూతన ఎక్సైజ్‌ పాలసీ రూపకల్పనపై సమీక్షా సమావేశం నిర్వహించాడు.[35][36] వైన్ షాపుల్లో గౌడ కులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం కేటాయించాలని రాష్ట్ర క్యాబినెట్‌ నిర్ణయించడం పై హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నాడు.[37] శ్రీనివాస్ గౌడ్ హుజూరాబాద్‌ పట్టణంలో 2021 సెప్టెంబరు 22న సైదాపూర్‌ రోడ్‌లో సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ, కాకతీయ కాలువ వద్ద ఎకరం స్థలంలో కోటి రూపాయల నిధులతో గౌడ సంఘం భవనానికి భూమి పూజ నిర్వహించిన తరువాత హుజూరాబాద్‌ మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేసిన గౌడ కులస్తుల ఆశీర్వాద సభలో పాల్గొన్నాడు.[38] ఆయన 2021 సెప్టెంబరు 22న మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీశ్రీ నగర్‌ లో, లక్షెట్టిపేట పట్టణంలో నూతనంగా నిర్మిం చిన ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌ భవనాలను ప్రారంభించాడు.[39] శ్రీనివాస్ గౌడ్ 2021 సెప్టెంబరు 27న తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాల్లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా ఎక్సైజ్ శాఖకు సంబంధించి స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు సమాధానం ఇచ్చాడు.[40][41] ప్రజలకు స్వచ్ఛమైన, ప్రకృతి సిద్ధమైన నీరాను అందించడం కోసం ప్రభుత్వం 12.20 కోట్ల రూపాయలతో నిర్మించిన నీరా కేఫ్‌, ఫుడ్‌ కోర్టును రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ 2023 మే 03న ప్రారంభించారు.[42]

పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రిగా

మార్చు

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష్యురాలు కీ.శే. శ్రీమతి జె. ఈశ్వరి భాయ్ గారి 28వ వర్దంతి సభలో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక & సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు శ్రీ.వి.శ్రీనివాస్ గౌడ్[43][44][45][46] ఆయన హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రపంచ ఫోటో గ్రఫీ దినోత్సవ సందర్భంగా 2021 ఆగస్టు 19న తెలంగాణ రాష్ట్ర ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను ప్రారంభించాడు.[47] వి. శ్రీనివాస్‌ గౌడ్‌ 2021 సెప్టెంబరు 25న తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో అక్టోబరు 9న నిర్వహిస్తున్న లండన్ – చేనేత బతుకమ్మ – దసరా వేడుకల పోస్టర్‌ని ఆవిష్కరించాడు.[48] హైదరాబాద్ ప్లాజా హోటల్ లో 2021 సెప్టెంబరు 27న తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలోప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి విశేష సేవలందించిన స్టేక్ హోల్డర్లకు ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొని 2020, 2021 సంవత్సరాలకుగాను ఎక్సలెన్స్‌ అవార్డులను అందజేశాడు.[49][50] వి. శ్రీనివాస్‌ గౌడ్‌ 2021 సెప్టెంబరు 28న రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత, బాలీవుడ్‌ నటుడు పైడి జైరాజ్ జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించాడు.[51][52][53] శ్రీనివాస్ గౌడ్.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి 2021 సెప్టెంబరు 29న హైదరాబాద్ పీవీ మార్గ్ (నెక్లెస్ రోడ్) లో ప్రారంభించిన థ్రిల్ సిటీ థీమ్ పార్క్ ను సందర్శించాడు.[54]

వి. శ్రీనివాస్‌ గౌడ్‌ 2021 అక్టోబరు 4న శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా ప్ర‌పంచ వార‌సత్వ క‌ట్టడంగా రామ‌ప్ప దేవాల‌యం అభివృద్ధిపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పాడు.[55] ఆయన రవీంద్రభారతిలో తన ఛాంబర్ లో 2021 అక్టోబరు 4న తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన బతుకమ్మ పాటను ఆవిష్కరించాడు.[56] రవీంద్రభారతిలో 2022 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కవి సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యాడు.[57]

క్రీడా & యువజన సర్వీసుల శాఖ మంత్రిగా

మార్చు
  1. తెలంగాణ ప్రీమియర్‌ కబడ్డీ లీగ్‌ (టీపీకేఎల్‌) సీజన్‌-3 ట్రోఫీని క్రీడా శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌ గౌడ్‌ ఆవిష్కరించాడు[58][59]
  2. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్‌ చాంద్ బ్యాడ్మింటన్ అకాడమీని సందర్శించాడు[60][61]

మహబూబ్ నగర్ అభివృద్ధి కార్యక్రమాలు

మార్చు
  1. మహబూబ్ నగర్ పట్టణాన్ని మోడల్ ప్లాన్డ్ సిటీగా అభివృద్ధి చేస్తా.[62][63][64]
  2. బస్తీ దవాఖానాలను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్[65]

ఇతర కార్యక్రమాలు

మార్చు

వి. శ్రీనివాస్‌ గౌడ్‌ రవీంద్రభారతిలోని పైడి జయరాజ్‌ ప్రివ్యూ థియేటర్‌లో అక్టోబరు 2న సివిల్‌ సర్వీసెస్‌లో 541 ర్యాంకు సాధించిన డాక్టర్‌ పృథ్వీనాథ్‌ గౌడ్కు ఆత్మీయ అభినందన సభలో పాల్గొని ఆయనను అభినందించి, సన్మానించాడు.[66]

ప్రమాదం చేసి పరారవుతున్న డ్రైవర్‌ను ఛైజ్ చేసి పట్టుకున్న శ్రీనివాస్‌ గౌడ్‌[67] 2021 జూన్ లో ఢిల్లీ పర్యటనలో ఉన్న శ్రీనివాస్ గౌడ్ ఆంధ్రప్రదేశ్ జల దోపిడీ పై మీడియా సమావేశంలో పాల్గొన్న తెలంగాణ ప్రాంతానికి నష్టమొస్తే చూస్తూ ఊరుకోమని అన్నాడు.[68][69]

యోధ పుస్తకం

మార్చు

వి. శ్రీనివాస్ గౌడ్ ఉద్యమ ప్రస్థానం, ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర, ఉద్యమ ప్రధాన ఘట్టాలపై తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం, ఉద్యోగ జేఏసీ ఉద్యమ ప్రస్థానంపై ఉద్యమ ఘట్టాలతో కూడిన ‘యోధ’ పుస్తకాన్ని 2022 అక్టోబరు 21న మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించాడు.[70]

హత్య కుట్ర

మార్చు

శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్రపన్నిన 8 మందిని 2022 మార్చి 2లో అరెస్టు చేశారు. ఈ కుట్రతో సంబంధం ఉన్న 8 మంది నిందితులు రాఘవేంద్రరాజు, మధుసూదన్‌రాజు, మున్నూర్‌ రవి, అమరేందర్‌ రాజు, నాగరాజు, యాదయ్య, విశ్వనాథ్‌, తాపాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు.[71][72]

చిత్రమాలిక

మార్చు

మూలాలు

మార్చు
  1. HMTV (14 February 2021). "మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు పితృవియోగం". Archived from the original on 20 September 2021. Retrieved 20 September 2021.
  2. Mana Telangana (30 October 2021). "మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు మాతృవియోగం". Archived from the original on 30 October 2021. Retrieved 30 October 2021.
  3. Namasthe Telangana (30 October 2021). "కన్నీటి వీడ్కోలు". Archived from the original on 1 November 2021. Retrieved 1 November 2021.
  4. Eenadu (10 November 2023). "రాజకీయాల్లో కొలువుదీరారు". Archived from the original on 10 November 2023. Retrieved 10 November 2023.
  5. సాక్షి, క్రీడలు (23 Feb 2019). "ప్రతిభగల వారికే పెద్దపీట". Archived from the original on 30 March 2019. Retrieved 30 March 2019.
  6. సాక్షి, వీడియోలు (24 Feb 2019). "కేసీఆర్‌ ప్రధాని కావాలని మొక్కుకున్నా." Archived from the original on 30 March 2019. Retrieved 30 March 2019.
  7. ఆంధ్రప్రభ, మహబూబ్ నగర్ (6 April 2020). "ఉద్యమ దీప్తి..ఆయనలో అదే స్ఫూర్తి". Archived from the original on 6 April 2020. Retrieved 6 April 2020.
  8. Namasthe Telangana (9 May 2021). "ఎన్నో సుగుణాలను తల్లి నుంచే నేర్చుకుంటాం : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌". Namasthe Telangana. Archived from the original on 9 May 2021. Retrieved 9 May 2021.
  9. Sakshi (19 May 2019). "'సిరీక్ష' నా ప్రాణం...!". Archived from the original on 13 July 2021. Retrieved 13 July 2021.
  10. Sakshi (19 May 2022). "కుమార్తె వివాహం.. సీఎంకు పెళ్లి పత్రిక అందించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌". Archived from the original on 19 May 2022. Retrieved 19 May 2022.
  11. సాక్షి, తెలంగాణ (20 Feb 2019). "మున్సిపల్ కమిషనర్ నుంచి మంత్రి వరకు..." Archived from the original on 30 March 2019. Retrieved 30 March 2019.
  12. Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  13. Eenadu (13 November 2023). "తొలి ప్రయత్నం.. వరించిన విజయం". EENADU. Archived from the original on 13 November 2023. Retrieved 13 November 2023.
  14. బిబిసీ తెలుగు, తెలంగాణ (19 February 2019). "తెలంగాణ మంత్రివర్గ విస్తరణ: కేసీఆర్ కొత్త టీంలో ఎవరెవరు ఉన్నారంటే." Archived from the original on 24 July 2019. Retrieved 24 July 2019.
  15. టి న్యూస్, ప్రాంతీయ వార్తలు (19 February 2019). "కొత్త మంత్రులు, ప్రొఫైల్". Archived from the original on 24 July 2019. Retrieved 24 July 2019.
  16. ఆంధ్రజ్యోతి, తెలంగాణ (19 February 2019). "అట్టహాసంగా తెలంగాణ మంత్రుల ప్రమాణస్వీకారం". Archived from the original on 24 July 2019. Retrieved 24 July 2019.
  17. నమస్తే తెలంగాణ, ఎడిటోరియల్ (2 April 2020). "కేసీఆరే ఓ మెడిసిన్‌". ntnews. Archived from the original on 2 April 2020. Retrieved 2 April 2020.
  18. Namasthe Telangana (22 August 2023). "సమరానికి సై". Archived from the original on 13 November 2023. Retrieved 13 November 2023.
  19. Eenadu (14 November 2023). "ఎన్నికల బరిలో కోటీశ్వరులు". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
  20. BBC News తెలుగు (3 December 2023). "ఓటమి పాలైన మంత్రులు ఎవరు? ఎంత తేడాతో ఓడిపోయారు?". Archived from the original on 6 December 2023. Retrieved 6 December 2023.
  21. Eenadu (4 December 2023). "ఆరుగురు మంత్రుల పరాజయం". Archived from the original on 28 December 2023. Retrieved 28 December 2023.
  22. Sakshi (29 July 2018). "నేడు శ్రీనివాస్‌గౌడ్‌కు గౌరవ డాక్టరేట్‌". Archived from the original on 30 August 2021. Retrieved 30 August 2021.
  23. Sakshi (30 July 2018). "మార్గదర్శకంగా ఉండాలి". Archived from the original on 30 August 2021. Retrieved 30 August 2021.
  24. Eenadu (30 August 2021). "మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు అమెరికా వర్సిటీ గౌరవ డాక్టరేట్‌". Archived from the original on 30 August 2021. Retrieved 20 September 2021.
  25. ETV Bharat News (19 September 2021). "మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు గౌరవ డాక్టరేట్ ప్రదానం". Archived from the original on 20 September 2021. Retrieved 20 September 2021.
  26. Namasthe Telangana (18 September 2021). "మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు గౌరవ డాక్టరేట్". Archived from the original on 20 September 2021. Retrieved 20 September 2021.
  27. నమస్తే తెలంగాణ, తెలంగాణ న్యూస్ (27 July 2019). "తెలంగాణలో నీరా చట్టం". ntnews.com. Archived from the original on 30 October 2019. Retrieved 30 October 2019.
  28. నమస్తే తెలంగాణ, తెలంగాణ న్యూస్ (26 September 2019). "హైదరాబాద్‌లో నీరా స్టాల్". ntnews.com. Archived from the original on 30 October 2019. Retrieved 30 October 2019.
  29. నమస్తే తెలంగాణ, తెలంగాణ న్యూస్ (29 October 2019). "గౌడలకే నీరా స్టాళ్లు". ntnews.com. Archived from the original on 30 October 2019. Retrieved 30 October 2019.
  30. నమస్తే తెలంగాణ, యాదాద్రి న్యూస్ (29 October 2019). "కులవృత్తులకు జీవం". ntnews.com. Archived from the original on 30 October 2019. Retrieved 30 October 2019.
  31. Andhrajyothy (8 May 2021). "గీత కార్మికుల సంక్షేమం, అభివృద్దే లక్ష్యం: శ్రీనివాస్ గౌడ్". Archived from the original on 8 May 2021. Retrieved 8 May 2021.
  32. Namasthe Telangana (18 August 2021). "తెలంగాణ పౌరుషాన్ని చాటిన యోధుడు పాపన్న". Archived from the original on 19 August 2021. Retrieved 19 August 2021.
  33. Andrajyothy (18 August 2021). "సమైక్య పాలనలో తెలంగాణ చరిత్ర అణచివేత". Archived from the original on 19 August 2021. Retrieved 19 August 2021.
  34. Namasthe Telangana (18 August 2021). "నెలాఖరుకు స్టేడియం పనులు పూర్తి చేయాలి: మంత్రి శ్రీనివాస్‌గౌడ్". Archived from the original on 19 August 2021. Retrieved 19 August 2021.
  35. Namasthe Telangana (15 September 2021). "ఎక్సైజ్‌ కొత్త పాలసీపై మంత్రి సమీక్ష". Archived from the original on 21 September 2021. Retrieved 21 September 2021.
  36. TV9 Telugu (15 September 2021). "TS Excise Policy: రాష్ట్రంలో త్వరలో నూతన ఎక్సైజ్ పాలసీ.. కొత్తగా 100కుపైగా మద్యం దుకాణాలకు అనుమతి ఇచ్చే ఛాన్స్!". Archived from the original on 21 September 2021. Retrieved 21 September 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  37. Namasthe Telangana (17 September 2021). "గౌడలకు 15శాతం రిజర్వేషన్లు హర్షణీయం". Archived from the original on 21 September 2021. Retrieved 21 September 2021.
  38. Andrajyothy (22 September 2021). "కుల సంఘాలను గౌరవించే పార్టీ టీఆర్‌ఎస్‌". Archived from the original on 23 September 2021. Retrieved 23 September 2021.
  39. Andrajyothy (22 September 2021). "అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శం". Archived from the original on 23 September 2021. Retrieved 23 September 2021.
  40. HMTV (27 September 2021). "బార్ అండ్ రెస్టారెంట్లలోనూ రిజర్వేసన్లు". Archived from the original on 27 September 2021. Retrieved 27 September 2021.
  41. "గౌడన్నలకు మోపెడ్‌లు". 24 October 2022. Archived from the original on 24 October 2022. Retrieved 24 October 2022.
  42. Namasthe Telangana (4 May 2023). "గౌడల ఆత్మగౌరవానికి నీరాజనం.. బీమాతో గీత వృత్తిదారులకు భరోసా: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌". Archived from the original on 4 May 2023. Retrieved 4 May 2023.
  43. ఆంధ్రజ్యోతి, తెలంగాణ (25 February 2020). "'తెలంగాణ'కు స్ఫూర్తి ఈశ్వరీబాయి". www.andhrajyothy.com. Archived from the original on 25 February 2020. Retrieved 25 February 2020.
  44. నమస్తే తెలంగాణ, తెలంగాణ (25 February 2020). "భావితరాలకు స్ఫూర్తి ఈశ్వరీబాయి". www.ntnews.com. Archived from the original on 25 February 2020. Retrieved 25 February 2020.
  45. నమస్తే తెలంగాణ, తెలంగాణ (4 February 2020). "కళాకారులకు సంక్షేమ పథకాలు". www.ntnews.com. Archived from the original on 25 February 2020. Retrieved 25 February 2020.
  46. Namasthe Telangana (31 May 2021). "ఆ ముగ్గురు కళాకారులకు ప్రత్యేక పెన్షన్". Namasthe Telangana. Archived from the original on 1 June 2021. Retrieved 1 June 2021.
  47. Andrajyothy (19 August 2021). "ఘనంగా ప్రపంచ ఫోటో గ్రఫీ దినోత్సవం : మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరు". andhrajyothy. Archived from the original on 19 August 2021. Retrieved 19 August 2021.
  48. Namasthe Telangana (25 September 2021). "టాక్ లండ‌న్ చేనేత - బతుకమ్మ వేడుకల పోస్టర్ ఆవిష్కరణ". Archived from the original on 5 October 2021. Retrieved 5 October 2021.
  49. Eenadu (27 September 2021). "Ts News: రామోజీ గ్రూప్ సంస్థలకు రెండు ఎక్సలెన్సీ అవార్డులు". Archived from the original on 27 September 2021. Retrieved 27 September 2021.
  50. Namasthe Telangana (27 September 2021). "ఎక్సలెన్స్‌ అవార్డులు ప్రదానం చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్". Archived from the original on 27 September 2021. Retrieved 27 September 2021.
  51. Namasthe Telangana (28 September 2021). "కవులు, కళాకారులను ప్రోత్సహిస్తాం". Archived from the original on 29 September 2021. Retrieved 29 September 2021.
  52. Namasthe Telangana (28 September 2021). "పైడి జైరాజ్ దేశం గర్వించదగ్గ గొప్ప నటుడు : మంత్రి శ్రీనివాస్ గౌడ్". Archived from the original on 5 October 2021. Retrieved 5 October 2021.
  53. Mana Telangana (28 September 2021). "నటుడు పైడి జైరాజ్ దేశానికే గర్వకారణం : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌". Archived from the original on 5 October 2021. Retrieved 5 October 2021.
  54. Andrajyothy (29 September 2021). "పర్యాటకానికి చేయూతనిస్తాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్". Archived from the original on 29 September 2021. Retrieved 29 September 2021.
  55. Namasthe Telangana (4 October 2021). "రామప్ప వృద్ద టూరిజం అభివృద్ధి చేస్తున్నాం : మంత్రి శ్రీనివాస్ గౌడ్". Archived from the original on 4 October 2021. Retrieved 5 October 2021.
  56. Namasthe Telangana (4 October 2021). "ధూంధాంగా బతుకమ్మ వేడుకలు". Archived from the original on 5 October 2021. Retrieved 5 October 2021.
  57. Namasthe Telangana (3 June 2022). "రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కవి సమ్మేళనం". Archived from the original on 10 June 2022. Retrieved 10 June 2022.
  58. నమస్తే తెలంగాణ, తెలంగాణ (25 February 2020). "కబడ్డీకి ఆదరణ భేష్". www.ntnews.com. Archived from the original on 25 February 2020. Retrieved 25 February 2020.
  59. నమస్తే తెలంగాణ, తెలంగాణ (24 January 2020). "హైదరాబాద్‌లో జాతీయ టీటీ టోర్నీ". www.ntnews.com. Archived from the original on 25 February 2020. Retrieved 25 February 2020.
  60. Namasthe Telangana (25 May 2021). "తెలంగాణ ప్లేయర్లు సత్తాచాటాలి: మంత్రి శ్రీనివాస్ గౌడ్". Namasthe Telangana. Archived from the original on 26 May 2021. Retrieved 26 May 2021.
  61. NTV (25 May 2021). "క్రీడాకారులకు వాక్సినేషన్ చేపట్టాలి : మంత్రి శ్రీనివాస్ గౌడ్". NTV. Archived from the original on 26 May 2021. Retrieved 26 May 2021.
  62. Namasthe Telangana (5 May 2021). "పాలమూరును మోడల్‌ సిటీగా తీర్చిదిద్దుతాం". Archived from the original on 5 May 2021. Retrieved 5 May 2021.
  63. Namasthe Telangana (6 May 2021). "సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : మంత్రి శ్రీనివాస్ గౌడ్". Archived from the original on 6 May 2021. Retrieved 6 May 2021.
  64. Namasthe Telangana (4 May 2021). "అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి". Archived from the original on 6 May 2021. Retrieved 6 May 2021.
  65. Eenadu (25 May 2021). "పేదల కోసమే బస్తీ దవాఖానాలు : మంత్రి". EENADU. Archived from the original on 25 May 2021. Retrieved 25 May 2021.
  66. Namasthe Telangana (2 October 2021). "గౌడ జాతి నుంచి మరెందరో ఐఏఎస్‌లు రావాలి". Archived from the original on 5 October 2021. Retrieved 5 October 2021.
  67. Namasthe Telangana (24 May 2021). "ప్రమాదం చేసి పరారవుతున్న డ్రైవర్.. పట్టుకున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్". Namasthe Telangana. Archived from the original on 27 May 2021. Retrieved 27 May 2021.
  68. Andhrajyothy (26 June 2021). "వైఎస్ఆర్ నరరూప రాక్షసుడు". andhrajyothy. Archived from the original on 26 June 2021. Retrieved 26 June 2021.
  69. Andhra Jyothy (4 June 2022). "మంత్రి శ్రీనివాస్ గౌడ్ క్లాప్ తో ప్రారంభం" (in ఇంగ్లీష్). Archived from the original on 5 June 2022. Retrieved 5 June 2022.
  70. "పుస్తకంగా శ్రీనివాస్ గౌడ్ ఉద్యమ ప్రస్థానం". 22 October 2022. Archived from the original on 22 October 2022. Retrieved 22 October 2022.
  71. "మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం". 3 March 2022. Archived from the original on 25 October 2022. Retrieved 25 October 2022.
  72. "మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర.. రూ.15 కోట్లకు సుపారీ". 2 March 2022. Archived from the original on 25 October 2022. Retrieved 25 October 2022.

ఇతర లింకులు

మార్చు
 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

హెచ్ ఎం టి వి లో శ్రీనివాస్ గౌడ్ కు సంబందించిన వార్తలు, వీడియోలు