పెదపాటివారి గూడెం
పెదపాటివారి గూడెం, కృష్ణా జిల్లా, ముసునూరు మండలంకి చెందిన ఒక చిన్న గ్రామం.
పెదపాటివారి గూడెం | |
— రెవిన్యూ గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°48′22″N 80°58′36″E / 16.805979°N 80.976532°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | ముసునూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 505213 |
ఎస్.టి.డి కోడ్ |
ఇది గోపవరం గ్రామం దగ్గరలో, గోపవరం, వేల్పుచెర్ల మధ్యలో, రహదారికి ఒక కిలోమీటరు దూరంలో ఉంది.
వ్యవసాయం ఇక్కడ ముఖ్యమైన వృత్తి. వూరిలో కొంతభాగం సారవంతమైన 'పాటి నేల' (నల్లటి నేల) అయినందున బహుశా ఈ వూటికి ఈపేరు వచ్చి ఉండవచ్చును.
ఇక్కడ పాటినేలలో పుగాకు బాగా పండుతుంది. ఆ వూరి పుగాకు చాలా నాణ్యమైనదని ఆ వూరివారు చెప్పుకుంటారు. తక్కిన భాగం ఇసుక పొర ఉన్న ఎర్రనేల.ఇక్కడ కూరగాయలు, మామిడి, జీడిమామిడి, కొబ్బరి పండిస్తారు. కొద్దిపాటి వరి సాగు ఉంది.
నీటివనరులు
మార్చుఒక చిన్న చెరువు ఉంది కాని భూగర్భజలాలే ప్రధాన నీటివనరు. ఒక ప్రాథమిక పాఠశాల ఉంది.