పెదపాలెం (దుగ్గిరాల మండలం)

పెదపాలెం, గుంటూరు జిల్లా, దుగ్గిరాల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

పెదపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
అక్షాంశరేఖాంశాలు: 16°21′55″N 80°35′52″E / 16.365274°N 80.597706°E / 16.365274; 80.597706
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం దుగ్గిరాల
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ పాటిబండ్ల కృష్ణ ప్రసాదు
పిన్ కోడ్ 522305
ఎస్.టి.డి కోడ్ 08644

గ్రామ చరిత్ర

మార్చు

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[1]

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు

మార్చు

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

గ్రామంలో మౌలిక వసతులు

మార్చు

ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం

మార్చు

బ్యాంకు

మార్చు

యూనియన్ బ్యాంకు

త్రాగునీటి సౌకర్యం

మార్చు

ఈ గ్రామంలో ఎన్.టి.అర్. సుజల స్రవంతి పథకం క్రింద నిర్మించిన శుద్ధినీటి కేంద్రాన్ని, 2015,సెప్టెంబరు-24వ తేదీనాడు ప్రారంభించారు. కీ.శే.గోగినేని వెంకటకృష్ణారావు ఙాపకార్ధం, ఆయన భార్య శ్రీమతి దుర్గాంబ, కుమారుడు, ప్రవాసాంధ్రుడు శ్రీ వెంకటరామకృష్ణప్రసాదు, మూడున్నర లక్షల రూపాయల వితరణతో, ఈ కేంద్రాన్ని నిర్మించారు.

గ్రామ పంచాయతీ

మార్చు

2021, ఫిబ్రవరి లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ పాటిబండ్ల కృష్ణ ప్రసాదు , [సర్పంచి]గా ఎన్నికైనారు

ప్రధాన పంటలు

మార్చు

వరి, అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులు

మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

ప్రముఖులు

మార్చు
  • పుతుంబాక శ్రీరాములు స్వాతంత్ర్య సమర యోధుడు, పెదపాలెం సర్పంచిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన ఈమని సమితి అధ్యక్షునిగా పనిచేశారు. 1955 నుండి 1962 వరకూ ఎం.ఎల్.ఏ.గా ఉన్నారు. పెదపాలెం, శృంగారపురం, రేవేంద్రపాడు, తెనాలి వద్ద వంతెనలు, పెదపాలెంలో రహదారులు, పాఠశాల ఏర్పాటుచేసిన ఘనులు. ఉమ్మడి మదరాసు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రామస్వామి రెడ్డియారు లాంటి వారు పెదపాలెం వచ్చారంటే అది పుతుంబాక ఘనతే.
  • పాతూరి నాగభూషణం
  • వాసిరెడ్డి శ్రీకృష్ణ

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-18.