తెగారం (సాంఘీక నాటకం)

శివ సత్తుల జీవిత నేపథ్యంతో వచ్చిన సాంఘిక నాటిక.

తెగారం శివ సత్తుల జీవిత నేపథ్యంతో వచ్చిన సాంఘిక నాటిక. ఈ నాటికను రచయిత పెద్దింటి అశోక్ కుమార్ రచించగా జాబిల్లి కల్చరల్ సొసైటీ (నిజామాబాదు) నిర్వహణలో నటుడు దర్శకుడైన మల్లేశ్ బలష్టు దర్శకత్వం వహించాడు. ఈ నాటకం నంది నాటక పరిషత్తు - 2017లో ఉత్తమ నటి (జ్యోతిరాణి సాలూరి) విభాగంలో బహుమతిని అందుకుంది.

తెగారం
తెగారం నాటికలోని దృశ్యం
రచయితపెద్దింటి అశోక్ కుమార్
దర్శకుడుమల్లేశ్ బలష్టు
ఒరిజినల్ భాషతెలుగు
విషయంసాంఘిక నాటకం
నిర్వహణజాబిల్లి కల్చరల్ సొసైటీ (నిజామాబాదు)

కథ మార్చు

ఎల్లవ్వ ఒక శివసత్తి, కానీ తన కూతురు లలిత శివసత్తిగా మారడాన్ని వ్యతిరేకిస్తుంది. తల్లికి ఊర్లో జరిగే మన్నన చూసి లలిత దొరైన్ట్లో పూనకాలు ఊగుతుంది. విషయం తెలిసిన ఊరిపెద్దలు ఈ ఏడూ బోనాలు లలిత చేత జరపనిర్ణయిస్తారు. ఆమెను బలవంతంగా శివసత్తినిజేసి ఊరేగింపుగా వస్తుంటే ఆ మూఢాచారాన్ని ఆపడానికి ఎల్లవ్వ ఏం చేసింది అన్నదే ఈ నాటకం కథాంశం.[1]

 
తెగారం నాటకంలోని దృశ్యం (నంది నాటక పరిషత్తు 2017)
 
2017 నంది నాటక పరిషత్తులో తెగారం బృందానికి సత్కారం

నట సాంకేతిక వర్గం మార్చు

  • జ్యోతిరాణి సాలూరి
  • సునయన
  • వాణి
  • నిహారిక
  • ఇంద్ర
  • త్రైలోక్య
  • సి.హెచ్. నటరాజగోపాలమూర్తి
  • రమణామూర్తి
  • సత్యనారాయణ
  • వెంకటకృష్ణ
  • మధు గుర్రం
  • చేగొండి చంద్రశేఖర్
  • గిరిబాబు
  • జబర్దస్త్ లక్ష్మీ కిరణ్
  • యశ్వంత్
  • సతీష్
  • ఇందిర
  • అరుణ్ కుమార్
  • నాగరాజు (సంగీతం)
  • ఉమాశంకర్ (రంగాలంకరణ)
  • సుభాష్ (రంగాలంకరణ)
  • జయవర్థన్ (రంగోద్దీపనం)

ప్రదర్శనలు (కొన్ని) మార్చు

  1. అప్పాజోస్యుల-విష్ణుభొట్ల-కందాళం ఫౌండేషన్ - వెంకటేశ్వర విజ్ఞాన మందిరం, గుంటూరు - 2018 జనవరి 3
  2. నంది నాటక పరిషత్తు - 2017 - ఎన్.టి.ఆర్. సెంటెనరి మున్సిపల్ టౌన్ హాల్, నంద్యాల - 2018 ఏప్రిల్ 4
  3. పంతం పద్మనాభ కళా పరిషత్, 19వ రాష్ట్రస్థాయి నాటక పోటీలు, కాకినాడ - 2018 అక్టోబరు 28
  4. నటకులమ్ నాటక పరిషత్తు, ఘంటసాల సంగీత కళాశాల, విజయవాడ - 2018 డిసెంబరు 18[1]
  5. తెలంగాణ యువ నాటకోత్సవం - 4 - రవీంద్రభారతి, హైదరాబాదు - 2018 డిసెంబరు 30
  6. పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు - 2019 - రవీంద్రభారతి, హైదరాబాదు - 2019 మే 1[2]
  7. డి.ఎల్. కాంతారావు తపాల ఉద్యోగుల కళా పరిషత్, 13వ జాతీయస్థాయి నాటక పోటీలు, తెనాలి - 2019 జూన్ 10-16

బహుమతులు మార్చు

  1. ఉత్తమ నటి (జ్యోతిరాణి సాలూరి) - నంది నాటక పరిషత్తు - 2017[3]
  2. ఉత్తమ ద్వితీయ ప్రదర్శన, ఉత్తమ నాటక రచన (పెద్దింటి అశోక్ కుమార్), ఉత్తమ ఆహార్యము (డా. మల్లేశ్ బలాస్ట్), ఉత్తమ నటి (జ్యోతిరాణి సాలూరి), ఉత్తమ సహాయ నటి (సునయన), ఉత్తమ ప్రతినాయకుడు (రమణమూర్తి వంగల) - పంతం పద్మనాభ కళా పరిషత్, కాకినాడ.
  3. ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ దర్శకుడు (డా. మల్లేశ్ బలాస్ట్), ఉత్తమ నటి (జ్యోతిరాణి సాలూరి), ఉత్తమ ప్రతినాయకుడు (రమణమూర్తి వంగల), ఉత్తమ జ్యూరీ నటి (సునయన), ఉత్తమ రంగాలంకరణ (ఉమాశంకర్ సురభి) - పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు - 2019, ఏప్రిల్ 27 నుండి మే 3 వరకు, 2019[4]
  4. ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ దర్శకుడు (డా. మల్లేశ్ బలాస్ట్), ఉత్తమ నటి (జ్యోతిరాణి సాలూరి), ఉత్తమ ప్రతినాయకుడు (రమణమూర్తి వంగల), ఉత్తమ హాస్య నటుడు(చేగో), ఉత్తమ ఆహార్యం (డా. మల్లేశ్ బలాస్ట్), ఉత్తమ రంగాలంకరణ (ఉమాశంకర్ సురభి) - డి.ఎల్. కాంతారావు తపాల ఉద్యోగుల కళా పరిషత్, 13వ జాతీయస్థాయి నాటక పోటీలు, జూన్ 10 నుండి 16 వరకు, 2019[5]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 ప్రజాశక్తి (28 December 2018). "మూఢ‌త్వాన్ని ఎండ‌గ‌ట్టి‌న 'న‌ట‌కులం' నాట‌కాలు". Archived from the original on 26 December 2018. Retrieved 28 December 2018. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 28 డిసెంబరు 2018 suggested (help)
  2. ఆంధ్రజ్యోతి, సాహిత్య వార్తలు (2 May 2019). "నాటక పోటీలు ప్రారంభం". Archived from the original on 4 May 2019. Retrieved 4 May 2019.
  3. వెబ్ ఆర్కైవ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ జాలగూడు. "ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నంది బహుమతులు - 2017" (PDF). web.archive.org. Archived from the original on 7 May 2018. Retrieved 28 December 2018.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link) CS1 maint: multiple names: authors list (link)
  4. ఆంధ్రజ్యోతి, సాహిత్య వార్తలు (4 May 2019). "ముగిసిన 'పరుచూరి రఘుబాబు' నాటకోత్సవం". Archived from the original on 4 May 2019. Retrieved 4 May 2019.
  5. ఈనాడు, నిజామాబాదు (18 June 2019). "ఉత్తమ ప్రదర్శనగా 'తెగారం'". www.eenadu.net. Archived from the original on 17 September 2019. Retrieved 17 September 2019.