దొరసాని (2019 సినిమా)
దొరసాని 2019, జూలై 12న విడుదలైన తెలుగు చలనచిత్రం. మధుర ఎంటర్‌టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాలు సంయుక్త నిర్మాణంలో కేవీఆర్ మహేంద్ర[1] తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ తమ్ముడు అనంద్ దేవరకొండ, రాజశేఖర్ చిన్నకుమార్తె శివాత్మిక హీరో హీరోయిన్లుగా నటించగా, ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించాడు. తెలంగాణలో 80వ దశకంలో దొరల కాలంలో జరిగిన ఒక నిజజీవిత ప్రేమకథ ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది.[2]
దొరసాని | |
---|---|
![]() దొరసాని సినిమా పోస్టర్ | |
దర్శకత్వం | కేవీఆర్ మహేంద్ర |
నిర్మాత | ‘మధుర’ శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని |
నటవర్గం | ఆనంద్ దేవరకొండ, శివాత్మిక |
ఛాయాగ్రహణం | సన్నీ కూరపాటి |
కూర్పు | నవీన్ నూలి |
సంగీతం | ప్రశాంత్ ఆర్ విహారి |
నిర్మాణ సంస్థలు | మధుర ఎంటర్‌టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాస్ |
విడుదల తేదీలు | 2019 జూలై 12 |
నిడివి | 130 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథసవరించు
నక్సలైట్ శివన్న (కిషోర్) 30 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించి బయటికి వస్తాడు. రాగానే రాజు అనే తన స్నేహితుడి కోసం అతడి ఊరికి వెళ్తాడు. రాజు గురించి అక్కడి వాళ్లను అడిగి.. అతడి కథను గుర్తు చేసుకుంటాడు. రాజు (ఆనంద్ దేవరకొండ) తెలంగాణలోని ఓ పల్లెటూరిలో ఓ పేద కుటుంబానికి చెందిన కుర్రాడు. ఆ ఊరి దొర కూతురు చిన్న దొరసాని (శివాత్మిక)ని రాజు ఇష్టపడతాడు. దొరసాని కూడా రాజును ఇష్టపడుతుంది. విషయం తెలిసి ఆమె తండ్రి రాజును చంపించాలనుకుంటాడు. కొన్నేళ్ల పాటు అతన్ని చెరసాలలో బంధిస్తారు. చివరికి వారిద్దరూ ఒక్కటయ్యారా? అన్నదే కథ.[3]
నటవర్గంసవరించు
- ఆనంద్ దేవరకొండ
- శివాత్మిక
- కిషోర్ కుమార్
- వినయ్ వర్మ
- స్వర్ణ కిలారి
- బైరెడ్డి వంశీకృష్ణా రెడ్డి
- శరణ్య ప్రదీప్
- సురభి ప్రభావతి
- సన్నీ పల్లే
సాంకేతికవర్గంసవరించు
- దర్శకత్వం: కేవీఆర్ మహేంద్ర
- నిర్మాత: ‘మధుర’ శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని
- సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి
- పాటలు: గోరటి వెంకన్న, రామజోగయ్య శాస్త్రి, శ్రేష్ట
- ఛాయాగ్రహణం: సన్నీ కూరపాటి
- కూర్పు: నవీన్ నూలి
- నిర్మాణ సంస్థ: మధుర ఎంటర్‌టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాస్
పాటలుసవరించు
- నింగిలోన పాలపుంత నవ్వులొంపినే, నేలపైన పాలపిట్ట తొవ్వగాసినే.. (గానం: అనురాగ్ కులకర్ణి, రచన: గోరటి వెంకన్న)
- కప్పతల్లి.. కప్పతల్లి (గానం: అనురాగ్ కులకర్ణి, రచన: గోరటి వెంకన్న)
- కలలో కలవరమై వరమై (గానం: చిన్మయి శ్రీపాద, రచన: శ్రేష్ట)
ఇతర వివరాలుసవరించు
మూలాలుసవరించు
- ↑ ప్రజాశక్తి, మూవీ (11 July 2019). "నాపై శ్యామ్ బెనగల్ నమ్మకాన్ని పెంచారు : కేవీఆర్". Archived from the original on 12 July 2019. Retrieved 12 July 2019.
- ↑ BBC News తెలుగు (12 July 2019). "దొరసాని: తెలంగాణ దొరతనానికి బలైన పేదోడి ప్రేమకథ -సినిమా రివ్యూ". BBC News తెలుగు. Archived from the original on 31 మే 2021. Retrieved 31 May 2021.
- ↑ ఈనాడు, సినిమా (4 July 2019). "'దొరసాని' తొలి పాట విడుదల". Archived from the original on 12 July 2019. Retrieved 12 July 2019.
- ↑ సాక్షి, సినిమా (12 July 2019). "నాపై నాకు నమ్మకం పెరిగింది". Archived from the original on 12 July 2019. Retrieved 12 July 2019.
- ↑ ఆంధ్రభూమి, చిత్రభూమి (11 July 2019). "దొరసాని.. అలా వచ్చింది". Archived from the original on 12 July 2019. Retrieved 12 July 2019.