పెళ్ళి కాని పిల్లలు (1961 సినిమా)

(పెళ్లికాని పిల్లలు నుండి దారిమార్పు చెందింది)

స్టిల్ ఫొటోగ్రాఫర్‌గా రాణించిన పి.గంగాధరరావు నిర్మాతగామారి హైదరాబాద్ మూవీస్ పతాకంపై 1961లో నిర్మించిన సినిమా పెళ్ళి కాని పిల్లలు. వన్ థౌజండ్ బెడ్ రూమ్స్ -అనే ఇంగ్లీషు నవల ఆధారంగా 1960లో మరాఠీ భాషలో రూపొందిన అవగాచిసంసార్ సినిమా దీనికి మాతృక.

పెళ్ళి కాని పిల్లలు
(1961 తెలుగు సినిమా)
దర్శకత్వం సి.ఎస్.రావు
నిర్మాణం పి. గంగాధరరావు
తారాగణం జగ్గయ్య,
జమున,
కాంతారావు
సంగీతం మాస్టర్ వేణు
నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు,
పి.సుశీల
గీతరచన ఆరుద్ర
నిర్మాణ సంస్థ హైదరాబాద్ మూవీస్
భాష తెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

సంపన్నుడు, భూస్వామి గోపాలరావు (గుమ్మడి). అతని భార్య కాంతమ్మ (హేమలత). వారి దత్తపుత్రుడు వేణు (జగ్గయ్య), సొంత కుమారుడు శేఖర్ (కాంతారావు). వేణు (జగ్గయ్య) బుద్ధిమంతుడు. పట్నంలో బిఏ చదువుతుంటాడు. శేఖర్ చదువుమాని దురలవాట్లకు, వ్యసనాలకు బానిసై ధనం నాశనం చేస్తూ, తండ్రి పరువు తీస్తుంటాడు. ఆ బెంగతో జబ్బుపడిన గోపాలరావు మరణిస్తూ, తన ఆస్తినంతా దత్తపుత్రుడు వేణు పేరిట వ్రాస్తాడు. తన స్నేహితుడు కుటుంబరావు (రమణారెడ్డి) తీసుకున్న అప్పు తాలూకు నోటు అతనికి ఇచ్చివేయమని భార్యకు చెబుతాడు. ఆస్తి మొత్తం అన్న వేణు పేరవుందని మండిపడుతున్న శేఖర్‌కు ఆస్తిని అప్పగించేసి, వేణు పట్నం వెళ్లిపోతాడు. తన స్నేహితుడు హరి (పద్మనాభం) ఫొటో స్టూడియోలో పని చేస్తుంటాడు. దారిలో కలిసిన రాధ (జమున)ను ప్రేమిస్తాడు. కుటుంబరావు, సంతాన లక్ష్మి (సూర్యాకాంతం)ల 5వ కుమార్తె రాధ. ఆమెకు నలుగురు అక్కలు. పెద్దమ్మాయి రమాదేవి (సూర్యకళ), రెండో అమ్మాయి ఉమాసుందరి (పద్మిని ప్రియదర్శిని), సంగీత సరస్వతి అయిన 3వది వాణి (పార్వతి), క్రీడల్లో చాంపియన్ అయిన 4వది తార (కృష్ణవేణి). వారి కోర్కెలకు తగిన వరులను కుదర్చలేక కుటుంబరావు ఇబ్బంది పడుతుంటాడు. రాధను ప్రేమించిన వేణు, వారికి తగ్గ వరులను కుదురుస్తానని మాట ఇస్తాడు. కుటుంబరావు సలహా, సాయంతో చిన్న తమాషా నాటకం ఆడతాడు. మంచివారు, సమర్ధులైన తన స్నేహితులు శంకరం (రామకృష్ణ), బ్రహ్మం (హరనాథ్), గిరి (చలం), హరిలతో వారికి పెళ్లిళ్లు చేయించేస్తాడు. శేఖర్ అంతకుముందు సీత (రాజశ్రీ)ని మోసంతో పెళ్లాడి విడిచి వచ్చేస్తాడు. ఆమె అతనింటికి వచ్చినా ఛీదరిస్తాడు. రాధను చూసి మోజుపడి, ఆమె తండ్రిని అప్పుకోసం వత్తిడితెస్తాడు. రాధను బెదిరించి, తల్లిని, వేణును బంధించి పెళ్లికి సిద్ధపడతాడు. ముహూర్తం సమయానికి కాంతమ్మ, వేణు, సీతలతో వచ్చి అందరికీ నిజం వెల్లడించి శేఖర్‌ను నిందించటంతో, అతనిలో పరివర్తన వస్తుంది. వేణు, రాధలతోపాటు, నలుగురు జంటలకు వివాహం జరగుతుంది. శేఖర్, సీతను ఆదరించటంతో చిత్రం సుఖాంతమవుతుంది[1].

పాటలు

మార్చు
  1. అనగనగా ఒక చిన్నది ఆకాశంలో ఉన్నది అక్కల పెళ్ళి అయ్యేదాకా - ఘంటసాల రచన::ఆరుద్ర
  2. చల్లని గాలి చక్కని తోట పక్కన నీవుంటే పరవశమే కాదా - ఘంటసాల, పి.సుశీల రచన: ఆరుద్ర
  3. తెలియని హాయీ ఇది ఎందుకో పులకించెను నా మది - పి.సుశీల , రచన:ఆరుద్ర
  4. నాలోని మధురప్రేమ లోలోన దాచలేను నీముందు - ఘంటసాల, పి.సుశీల , రచన: ఆరుద్ర
  5. ప్రణయ వీధిలో ప్రశాంత నిశిలో వయ్యారి పిలిచింది ఒకసారి ఆగుమా - పి.సుశీల, రచన:ఆరుద్ర
  6. ప్రియతమా రాధికా రావే రయమున కలియవే ప్రేమాభిసారికా - ఘంటసాల, రచన: ఆరుద్ర.
  7. మరపురాని మరవలేని మధురగాన మంజరిని ( బిట్) - పి.సుశీల , రచన:ఆరుద్ర
  8. మొన్న నిన్ను చుశాను నిన్న మనసు కలిపాను నేటినుండి - ఘంటసాల, పి.సుశీల , రచన: ఆరుద్ర
  9. ఎవరివే నీ వేవరివే శివుని తలపై చెంగలించే, బెంగుళూరు లత, ఎల్.ఆర్.ఈశ్వరి , రచన: ఆరుద్ర .

మూలాలు

మార్చు
  1. "పెళ్ళికాని పిల్లలు - సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి ఫ్లాష్ బ్యాక్ @ 50 ఆంధ్రభూమి దినపత్రిక 13-10-2018". Archived from the original on 2018-10-14. Retrieved 2018-11-02.

బయటిలింకులు

మార్చు