సూర్యకళ పాతతరం చలన చిత్ర నటీమణులలో ఒకరు. రామిరెడ్డి, సుభద్రల దంపతులకు కాకినాడలో జన్మించారు. బాల్యం నుంచే భరతనాట్యంలో శిక్షణ పొందారు. సినీరంగంపై ఆసక్తితో చెన్నై చేరుకున్న సూర్యకళ ‘నా చెల్లెలు’ చిత్రంతో నటిగా రంగప్రవేశం చేశారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ తదితర భాషల్లోనూ నటిగా మంచి గుర్తింపు పొందారామె. ఏయన్నార్, అంజలీ దేవి నటించిన ‘సువర్ణ సుందరి’ చిత్రంలో ప్రతినాయకి ఛాయలున్న పాత్రలో నటించారు. ‘బాల నాగమ్మ’లో ముఖ్య పాత్ర పోషించి మంచిపేరు తెచ్చుకున్నారు. తమిళంలో శివాజీగణేశన్ నటించిన ‘అందనాళ్’ చిత్రంలో ప్రముఖ పాత్ర పోషించారు. సూర్యకళ మొత్తం 500 చిత్రాలకు పైగా నటించారు

ఎంజీఆర్ తో సూర్యకళ

సూర్యకళ తమిళ చిత్రం అన్బు ఎంగేతో తారాపథంలోకి వచ్చింది. కె.బాలాజీ, పండరీ బాయి, దేవిక, ఎస్.ఎస్.రాజేంద్రన్ నటించిన ఈ సినిమాలో సూర్యకళపై చిత్రించిన మిన్నల్ పూచ్చి జాకెట్ అన్న పాట ప్రసిద్ధి చెందింది. అయితే సూర్యకళ సినీరంగంలో అగ్రస్థాయికి చేరుకోలేక పోయింది. ఆ తరువాత కనుమరుగై చిన్నాచితకా వేషాలు వేసింది.[1]

మరణం మార్చు

ప్రస్తుతం ఈవిడ చెన్నై నుంగంబాక్కంలోని వల్లువర్‌కోట్టం కాలనీలో నివసిస్తున్నారు. ఆమె భర్త సెల్వరాజ్ పదేళ్ల క్రితమే మరణించారు. వీరికి పద్మశ్రీ అనే కూతురు ఉన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న కె.సూర్యకళ (72) 2014, జూన్ 30 సోమవారం రాత్రి పది గంటల ప్రాంతంలో కన్నుమూశారు. [2]

చిత్ర సమాహారం మార్చు

తెలుగు చిత్రాలు మార్చు

తమిళ చిత్రాలు మార్చు

కన్నడ చిత్రాలు మార్చు

లింకులు మార్చు

మూలాలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=సూర్యకళ&oldid=2951709" నుండి వెలికితీశారు