వాసాల నరసయ్య
వాసాల నరసయ్య బాలసాహితీకారుడు. బాలసాహిత్యంలో విశేష కృషి చేసిన అతనికి 2017 కేంద్ర సాహిత్య అకాడమీ వారు బాల సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేశారు.[1][2]
వాసా నరసయ్య | |
---|---|
జననం | వాసాల నరసయ్య 1942 కరీంనగర్ జిల్లా, మెట్ పల్లి మండలం, చవులమద్ది గ్రామం |
నివాస ప్రాంతం | కరీంనగర్ జిల్లా, మెట్ పల్లి మండలం, చవులమద్ది గ్రామం |
ఇతర పేర్లు | వాసాల నరసయ్య |
వృత్తి | పోస్టల్ సూపరింటెండెంట్ |
ప్రసిద్ధి | బాల సాహితీకారుడు, ప్రముఖ రచయిత |
Notes బాలసాహిత్య పురస్కార్ అవార్డు గ్రహీత |
జీవిత విశేషాలు
మార్చుఅతను 1942లో కరీంనగర్ జిల్లా లోని మెట్‌పల్లి మండలం చవులమద్ది గ్రామంలో జన్మించాడు. పోస్టల్ సూపరింటెండెంట్ గా ఉద్యోగభాద్యతలను నిర్వర్తిస్తూ 2002లోపదవీవిరమణ చేశాడు. తన 12వ యేట నుండి సాహితీ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. అతను పౌరాణిక నాటకాలు, కవిత్వం అంశాలపై రచనలను ఎక్కువగా చేసాడు. అయినప్పటికీ అతను బాలసాహిత్యంపై మక్కువ కలిగి బాలలకోసం అనేక రచనలను తెలుగు భాషలో చేసాడు. 1997 నుండి బాలసాహితీ రంగంలో విశేష కృషి చేసాడు.[3] ఆరు దశాబ్దాలుగా బాలసాహిత్యంలో నిరంతర సాహితీ సేవ అందించిన అతను మొత్తం 36 పుస్తకాలు ప్రచురించాడు. ఇందులో 28 పుస్తకాలకు పైగా బాల సాహిత్య రచనలే. బుజ్జాయి, బొమ్మరిల్లు, చందమామ, బాలమిత్ర, బాలభారతం, బాలబాట, మొలక తదితర బాలల మాసపత్రికలు, సంకలనాల్లో నర్సయ్య కథలు, బాలల కథలు, పొడుపు కథలు, కవితలు, గేయాలు, గ్రంథ సమీక్షలు, వ్యాసాలు,అనువాదాలు ప్రచురితమయ్యాయి[1]. అతను చిన్నపిల్లల మానసిక వికాసానికి అనుగుణంగా నీతి కథలు, పురాణాలకు సంబంధించి అనేక కథలు రాశాడు. దాదాపు 40 సంపుటాలను ఆయన వెలువరించగా వాటిలో కొన్ని ఇతర భాషల్లోకి అనువాదమయ్యాయి.[4]
పురస్కారాలు
మార్చుఅతనికి అంతకు ముందు అనేక పురస్కారాలను పొందాడు. వాటిలో రాష్ట్ర బాల సాహిత్య పురస్కారాన్ని 2009లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంనుండి అందుకున్నాడు.