పైడి రాకేశ్ రెడ్డి
పైడి రాకేశ్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు. ఆయన 2023 శాసనసభ ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2]
పైడి రాకేశ్ రెడ్డి | |||
పదవీ కాలం 3 డిసెంబర్ 2023 – ప్రస్తుతం | |||
ముందు | ఎ. జీవన్‌రెడ్డి | ||
---|---|---|---|
నియోజకవర్గం | ఆర్మూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1967 అంకాపూర్, ఆర్మూర్ మండలం, నిజామాబాద్ జిల్లా, తెలంగాణ | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు | గంగారెడ్డి | ||
జీవిత భాగస్వామి | రేవతి రెడ్డి | ||
సంతానం | సుచరిత, రేయాన్ష్ రెడ్డి, రేహ రెడ్డి | ||
నివాసం | ఆర్.ఆర్, ఎస్టేట్, అంకాపూర్, ఆర్మూర్[1] |
వ్యక్తిగత జీవితం
మార్చుపైడి రాకేశ్ రెడ్డి 1987 ఆగస్టులో యూఏఈ ఫుజిరాలో సిద్దిపేట తాపీ మేస్త్రీ కింద భవన నిర్మాణ కూలీగా తన జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత డ్రైవర్‌గా పని చేశాడు.[3] అయన ఆ తరువాత 1994లో భారతదేశానికి తిరిగి వచ్చి హాంకాంగ్ నుండి యూరప్, గల్ఫ్, ఉత్తర అమెరికాకు ఎర్ర చందనం ఎగుమతి, రియల్ ఎస్టేట్, హాస్పిటల్స్ లాంటి ఇతర వ్యాపార రంగాల వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. రాకేశ్ రెడ్డి అయన పేరు మీదే రాకేశ్ రెడ్డి ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థను స్థాపించి అనేక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.[4]
రాజకీయ జీవితం
మార్చుపైడి రాకేశ్ రెడ్డి 2023 జూన్ 1న తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ ఛుగ్ సమక్షంలో బీజేపీ పార్టీలో చేరి[5], 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ప్రొద్దుటూరి వినయ్ రెడ్డిపై 29669 ఓట్ల మెజారిటీతో గెలిచి[6] తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టాడు.[7][8]
తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాలలో బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం కార్యక్రమాన్ని బహిష్కరించారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్‌గా చేయడం, ఆయన సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడానికి బీజేపీ నిరాకరించి, డిసెంబర్ 14న గడ్డం ప్రసాద్ కుమార్ శాసనసభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై అనంతరం ఆయన శాసనసభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశాడుశాసనసభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశాడు.[9]
పైడి రాకేశ్ రెడ్డిని 2024 జనవరి 08న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి బీజేపీ పార్టీ నియమించింది.[10] ఆయనను ఫిబ్రవరి 14న బీజేపీ శాసనసభ ట్రెజరర్‌గా నియమించింది.[11]
మూలాలు
మార్చు- ↑ "Rakesh Reddy Paidi 2023 Election Affidavit" (PDF). 2023. Archived from the original (PDF) on 16 December 2023. Retrieved 16 December 2023.
- ↑ BBC News తెలుగు (5 December 2023). "తెలంగాణ రిజల్ట్స్ 2023: మీ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు?". Archived from the original on 5 December 2023. Retrieved 5 December 2023.
- ↑ Andhrajyothy (7 December 2023). "ఎడారి జీవితం నుండి అసెంబ్లీ వరకు". Archived from the original on 15 January 2024. Retrieved 15 January 2024.
- ↑ Telangana Today (6 December 2023). "From NRI in Gulf to MLA in Telangana: The journey of Paidi Rakesh Reddy". Archived from the original on 15 January 2024. Retrieved 15 January 2024.
- ↑ 10TV Telugu (1 June 2023). "బీజేపీలో చేరిన ప్రముఖ పారిశ్రామిక వేత్త పైడి రాకేశ్ రెడ్డి" (in Telugu). Archived from the original on 15 January 2024. Retrieved 15 January 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ Hindustantimes Telugu (4 December 2023). "నిజామాబాద్‌లో కమల వికాసం - 3 స్థానాలు కైవసం". Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
- ↑ Andhrajyothy (4 December 2023). "TS Elections Winners: విజేతల వివరాలు ఇలా." Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
- ↑ NTV Telugu (14 December 2023). "ఎట్టకేలకు బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం." Archived from the original on 14 December 2023. Retrieved 14 December 2023.
- ↑ Andhrajyothy (9 January 2024). "17 లోక్‌సభ స్థానాలకు బీజేపీ ఇన్‌చార్జిలు". Archived from the original on 9 January 2024. Retrieved 9 January 2024.
- ↑ Andhrajyothy (14 February 2024). "బీజేపీఎల్పీ నేతగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి". Archived from the original on 14 February 2024. Retrieved 14 February 2024.