పొటాషియం ఆర్సనైట్

(పొటాషియం ఆర్సనైటు నుండి దారిమార్పు చెందింది)

పొటాషియం ఆర్సనైట్ అనునది ఒక రసాయన సమ్మేళనం. ఇది ఒక అకర్బన రసాయన సమ్మేళనం. ఇది పొటాషియం మెటా ఆర్సనైట్ (KAsO2), పొటాషియం ఆర్థో ఆర్సనైట్ (K3AsO3) అను రెండు రెండు రూపాలలో లభిస్తుంది. ఈ సమ్మెలళ పదార్థము ఆర్సనైట్ అయానులు AsO33− లేదా AsO2 కలిగి యుండును. ఈసమ్మేళనలో ఎల్లప్పుడూ ఆర్సెనిక్ +3 ఆక్సీకరణ స్థాయిలోనూ, పొటాషియం +1 ఆక్సీకరణ స్థాయిలో ఉండును.[2] ఆర్సెనిక్‌ను కలిగిన ఇతర సమ్మేళన పదార్థాల వలె పొటాషియం ఆర్సేనైట్ కుడా విషకారకం. మానవుల పై ఆర్సెనిక్‌ను కలిగిన ఇతర సమ్మేళన పదార్థాల వలె పొటాషియం ఆర్సేనైట్ కుడా విషకారకం. మానవుల పై కాన్సర్‌ ప్రేరక ప్రభావాన్ని చూపుతుంది.[3][4] పొటాషియం ఆర్సేనైట్ ను ఇప్పటికి ఎలుక జాతికి చెందిన జంతువులను చంపుటకు విషంగా ఉపయోగిస్తున్నారు.[5]

పొటాషియం ఆర్సనైట్
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [13464-35-2]
పబ్ కెమ్ 61616
SMILES [O-][As]=O.[K+]
ధర్మములు
AsKO2
మోలార్ ద్రవ్యరాశి 146.019 g/mol
స్వరూపం white hygroscopic powder
సాంద్రత 8.76 g/cm3
ద్రవీభవన స్థానం 300 °C (572 °F; 573 K)
slightly soluble
ప్రమాదాలు
Lethal dose or concentration (LD, LC):
14 mg/kg (oral, rat)[1]
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

అణు నిర్మాణ సౌష్టవం

మార్చు
 
పొటాషియం ఆర్సనైట్ అణువు

పొటాషియం మెటా ఆర్సనైట్ (KAsO2) అణువులో లో రెండు ఆక్సిజన్ పరమాణువులు ఉండి, అందులో ఒకటి ఆర్సెనిక్ పరమాణుతో ద్విబందాన్ని ఏర్పరచుకొని ఉండును. పొటాషియం ఆర్థో ఆర్సనైట్లో మూడు ఆక్సిజన్ పరమాణువులు ఉండి, అవి ఆర్సనిక్ తో ఏక బంధాన్ని కలిగి ఉండును.పొటాషియం ఆర్సనైట్ సమ్మేళనం యొక్క ఈ రెండు భిన్న రూపాలలో ఆర్సనిక్ +3 ఆక్సీకరణ స్థాయిలోఆర్సనైట్ గా ఏర్పడి ఉండును. అందువలన ఈ సమ్మేళనం యొక్క రెండు సౌష్టవ రూపాలను ఒకే పేరుతో పొటాషియం ఆర్సనైట్ అని పిలవడం జరుగుచున్నదిref name=":0" />. పొటాషియం ఆర్సనైట్ యొక్క రెండు రూపాల ధర్మాలు, లక్షణాలు ఒకే విధమైనవి .

లక్షణాలు

మార్చు

అకర్బన సమ్మేళన మైన పొటాషియం ఆర్సనైట్ వాసనలేని, తెల్లని ఘనపదార్థం. ఇది నీటిలో సులభంగా అధిక ప్రమాణంలో కరుగుతుంది. ఆల్కహాల్ (సారాయి)లలో తక్కువ మొత్తంలో కరుగుతుంది. ద్రవ పొటాషియం ఆర్సనైట్ స్వల్ప ప్రమాణంలో హైడ్రోక్సైడ్ ఉండును, అందుచే ఇది బలహీనమైన క్షార గుణాలను ప్రదర్శించును.[6] పొటాషియం ఆర్సనైట్ ను మండిం చిన దహనం చెందదు. కాని వేడి చేసినప్పుడు వియోగం చెంది ఆర్సైన్ (arsine), ఆర్సనిక్ ఆక్సైడ్ (arsenic oxides), పొటాషియం ఆక్సైడ్ వంటి విష వాయువులను వెలువరించును. పొటాషియం ఆర్సనైట్ ఆమ్లాలతో రసాయన చర్య జరపడం వలన విషకారక ఆర్సైన్ వాయువును ఏర్పరచును.[5]

పొటాషియం ఆర్సనైట్ యొక్క రసాయనిక సంకేతం AsKO2. ఫార్ములా అణు (మోలార్) భారం146.019 గ్రాము/మోల్. పొటాషియం ఆర్సనైట్ యొక్క సాంద్రత 8.76 గ్రామాలు/సెం.మీ3. ద్రవీభవన స్థానం 360 C (572 °F; 573 K), ఈ ఉష్ణోగ్రతవద్ద వియోగం చెందుతుంది.

తయారు చెయ్యడం

మార్చు

సాధారణంగా ఫౌలర్ ద్రావణం అని పిలవబడు సజల పొటాషియం ఆర్సనైట్ ను నీటి సమక్షములో ఆర్సెనిక్ ట్రై ఆక్సైడ్ ను పొటాషియం హైడ్రోక్సైడ్ తో రసాయనిక చర్యకు గురికావిం చడం ద్వారా ఉత్పత్తి చెయ్యుదురు.[7][8]

As2O3 (aq) + 2 KOH (aq) → 2 KAsO2 (aq) + H2O

ఉపయోగాలు

మార్చు

18 శతాబ్ది కాలంనాటి ఇంగ్లీసు వైద్యుడు (physician) థామస్ ఫౌలర్ రక్తహినత (anemia), కీళ్ళవాతం (rheumatism), సోరియాసిస్ (psoriasis), గజ్జి ( eczema), చర్మపు నొప్పి (dermatitis), ఆస్తమా ( asthma), కలరా (cholera), సిఫిలిస్ (syphilis) వంటి జబ్బుల నివారణలో పొటాషియం ఆర్సనైట్ ద్రావణం (ఫౌలర్ ద్రావణం)ను ఉపయోగించాడు. ల్యుకేమియా వ్యాధి చికిత్సలో మొదటిసారిగా 1865 లో కెమో తెరఫీ కారకంగా వాడారు. అయితే దీని వాడకం వలన కలిగిన చికిత్స ప్రభావం తాత్కాలిక మైనది. చెదలు నాశక మందులలో వాడటం వలన కలపను ఎక్కువ కాలం నిల్వ ఉంచుటకు కారకంగా ఉపయోగిస్తున్నారు. అలాగే కీటక నాశక, కొన్ని కుంతక జాతుల ప్రాణినాశక మందులలో (rodenticides), చెదలు నాశక మందులలో, గుల్మనాశని (Herbicides).వాడెదరు.

మూలాలు

మార్చు
  1. http://chem.sis.nlm.nih.gov/chemidplus/rn/10124-50-2
  2. Lide, D. R. (1993). CRC Handbook Chemistry & Physics 74th Edition. ISBN 0-8493-0474-1.
  3. DM, J. (1993). "The History of the use of Arsenicals in Man". Journal of the Royal Society of Medicine. 86 (5).
  4. Lander J.J.; Stanley R.J.; Sumner H.W.; Boswell D.C.; Aach R.D. (1975). "Angiosarcoma of the Liver associated with Fowler's Solution (Potassium Arsenite)". Gastroenterology. 68 (6): 1582–1586. PMID 1169181.
  5. 5.0 5.1 Potassium Arsenite. http://nj.gov/health/eoh/rtkweb/documents/fs/1557.pdf
  6. U.S. Dept. of Health and Human Services, Public Health Service (October 2, 2014). "Arsenic and Inorganic Arsenic Compounds" (PDF). Report on Carcinogens, Thirteenth Edition.
  7. Caspari, Charles (1901). A Treatise on Pharmacy for Students and Pharmacists (2nd ed.). Philadelphia: Lea Brothers and Co.
  8. Tinwell, H.; Stephens, S. C.; Ashby, J. (1991). "Arsenite as the probable active species in the human carcinogenicity of arsenic: mouse micronucleus assays on Na and K arsenite, orpiment, and Fowler's solution" (PDF). Environmental Health Perspectives. 95: 205–210. doi:10.2307/3431125. PMC 1568403. PMID 1821373.