పొత్తూరి విజయలక్ష్మి

పొత్తూరి విజయలక్ష్మి ప్రముఖ కథా రచయిత్రి. ఈవిడ హాస్య కథలకు, నవలలకూ ప్రసిద్ధురాలు.

పొత్తూరి విజయలక్ష్మి
జననం (1953-07-18) 1953 జూలై 18 (వయస్సు 67)
వృత్తిరచయిత్రి
జీవిత భాగస్వాములుపీ.వీ. శివరావు
పిల్లలు
  • శిరీష
  • ప్రవీణ్ కుమార్
తల్లిదండ్రులు
  • వల్లూరి వెంకటకృష్ణమూర్తి (తండ్రి)
  • వల్లూరి సత్యవాణి (తల్లి)

బాల్యంసవరించు

ఈమె జూలై 18, 1953న గుంటూరు జిల్లా యాజలి గ్రామంలో జన్మించారు. వల్లూరి సత్యవాణి, వల్లూరి వెంకటకృష్ణమూర్తి ఈమె తల్లిదండ్రులు.

కుటుంబంసవరించు

పీ.వీ. శివరావు తో ఈమె వివాహం 1970లో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు శిరీష, ప్రవీణ్ కుమార్.

రచనసవరించు

ఈమె 1982లో రాయటం మొదలు పెట్టారు. మొదటి నవల ప్రేమలేఖ. ఇది శ్రీవారికి ప్రేమలేఖ అనే సినిమాగా తీయబడింది. ఈమె మొత్తం మీద 150 కథలు, 14 నవలలు, 3 సినిమాలు, 2 టీవీ సీరియల్స్ రూపొందించారు. ఈమె రచనలు రేడియోలో నాటికలుగా ప్రసారమయ్యాయి. ఈమె రాసిన హాస్య కథలు "పొత్తూరి విజయలక్ష్మి హాస్యకథలు, మా ఇంటి రామాయణం, చంద్ర హారం, అందమె ఆనందం అనే హాస్యకథా సంపుటాలుగా వెలువడ్డాయి.

గుర్తింపుసవరించు

ఈమె ఈ కింది పురస్కారాలుఅందుకున్నారు :

బయటి లంకెలుసవరించు