పొలిశెట్టి లింగయ్య
పొలిశెట్టి లింగయ్య (1970 - మే 15, 2012) రచయిత, గాయకుడు, పల్లె సుద్దులు ఒడిసిపట్టి వాటిని ప్రపంచానికి పరిచయం చేసిన అక్షరకెరటం[ఆధారం చూపాలి].
జననం - విద్యాభ్యాసం
మార్చుపొలిశెట్టి నారాయణ, లింగమ్మ దంపతులకు నల్గొండ జిల్లా, వేములపల్లి మండలం, సల్కునూరు గ్రామంలో 1970 లో జన్మించాడు. 8వ తరగతి చదువు మధ్యలోనే ఆపుచేశాడు.
పేదరికంలో పుట్టడం వల్ల చుట్టు ఉన్న సమాజంలో రుగ్మతలపై అవగాహన పెంచుకున్నాడు. పాటను ఆయుధంగా మలుచుకొని వాటిని రూపుమాపాలని ప్రయత్రించాడు. ప్రజానాట్యమండలిలో చేరి ప్రజా పాటలు ఆలకిస్తూ పల్లె సుద్దులను సృష్టించి పల్లె సుద్దుల బ్రహ్మగా పేరు తెచ్చుకొని ప్రజల పాటలు పేరుతో పుస్తకాన్ని వెలువరించాడు.
రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత ‘‘రాజీవ్‌కు జోహర్లు’’ పేరుతో పాటలు రాసి, ఆ పాటల క్యాసెట్‌ను 14 భాషల్లో విడుదలచేశాడు. అది దేశవ్యాప్త గుర్తింపు తెచ్చింది.
పాటలు
మార్చుజానపదాల్లో మరదలు పిల్లా బాలమ్మ బాగున్నవా - ఈ బావ నీకు యాదున్నడా అంటూ బావ మరదళ్ల మధ్య ఆటపట్టించే పాటలు, లవ్‌ర్యాప్, గజ్జెల గంగోళి, కోటమైసమ్మ, దండు మైసమ్మ పాటలు గీత ఆడియో రికార్డింగ్ ద్వారా సారంగపాణి, వరంగల్ శంకర్నచే పాడించారు. సారా ఉద్యమంలో భాగంగా మరో దండోరా పేరుతో అబ్బబ్బ సారాయి పోతే పోయిందిరో అంటు ఉర్రూతలూగించాడు. పోలీసు అమరవీరులను స్మరిస్తూ రూపొందించిన శ్రద్ధాంజలి ఆల్బమ్ ఉన్నతాధికారుల ప్రశంశలు పొందింది. తెలంగాణ పౌరుషాన్ని చాటుతూ వీర తెలంగాణ, పోరు తెలంగాణ, వచ్చెర తెలంగాణ లాంటి పాటలు కట్టాడు.
సినిమా పాటలు
మార్చు- ఆ నవ్వులేమాయేనే స్వర్ణక్క - స్వర్ణక్క
- అత్తరు సాయబు మంచోడమ్మ - ఆల్ రౌండర్
- గింత కూరుంటెయ్యమ్మో, గింత బువ్వుంటేయమ్మో - పిట్టలదొర
- అణా, బేడా, చారాణా, ఆఠాణా రేటు కాదు - శ్రీదేవి నర్సింగ్ హోం
- అమ్మను మించి దైవమున్నడా ఆత్మను మించి అర్థమున్నదా - 20వ శతాబ్దం