పోచంపల్లి పురపాలకసంఘం

పోచంపల్లి పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] పోచంపల్లి పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం భువనగిరి లోకసభ నియోజకవర్గంలోని, భువనగిరి శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]

పోచంపల్లి పురపాలకసంఘం
—  పురపాలకసంఘం  —
పోచంపల్లి పురపాలకసంఘం is located in తెలంగాణ
పోచంపల్లి పురపాలకసంఘం
పోచంపల్లి పురపాలకసంఘం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°20′29″N 78°48′15″E / 17.3413528°N 78.8042828°E / 17.3413528; 78.8042828
రాష్ట్రం తెలంగాణ
జిల్లా యాదాద్రి భువనగిరి
మండలం పోచంపల్లి
ప్రభుత్వం
 - చైర్‌పర్సన్‌ చిట్టిపోలు విజయలక్ష్మి
 - వైస్ చైర్‌పర్సన్‌ బాత్క లింగస్వామి
జనాభా (2011)
 - మొత్తం 17,079
 - పురుషుల సంఖ్య 8,688
 - స్త్రీల సంఖ్య 8,391
 - గృహాల సంఖ్య 4,536
పిన్ కోడ్ - 508284
ఎస్.టి.డి కోడ్ - 08685
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్

చరిత్రసవరించు

మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న పోచంపల్లి, తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా ఏర్పడింది.[3]

భౌగోళికంసవరించు

పోచంపల్లి 59.92 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. జిల్లా కేంద్రం భువనగిరి నుండి 29 కిలోమీటర్ల దూరంలో, రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది.[4]

జనాభా గణాంకాలుసవరించు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 17079 మంది కాగా, అందులో 8688 మంది పురుషులు, 8391 మంది మహిళలు ఉన్నారు. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 1 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[5]

పౌర పరిపాలనసవరించు

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి దీనిని 13 ఎన్నికల వార్డులుగా విభజించారు. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో చిట్టిపోలు విజయలక్ష్మి చైర్‌పర్సన్‌గా, బాత్క లింగస్వామి వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.ఎన్నికైనారు.[6][7] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.[8]

వార్డు కౌన్సిలర్లుసవరించు

  1. దారెడ్డి మంజుల
  2. కొంగరి కృష్ణ
  3. సుర్కంటి జ్యోతి రంగారెడ్డి
  4. పెద్దల చక్రపాణి
  5. బాతుక లింగస్వామి
  6. కర్నాటి రవీందర్
  7. గుండు మధు
  8. సామల మల్లారెడ్డి
  9. భోగ భానుమతి విష్ణు
  10. మోటె రజితరాజు
  11. కుడికాల అఖిల బలరాం
  12. దేవరాయ కుమార్
  13. చిట్టిపోలు విజయలక్ష్మీ

మూలాలుసవరించు

  1. "Pochampally Municipality". pochampallymunicipality.telangana.gov.in. Retrieved 8 March 2021.
  2. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 8 March 2021.
  3. నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 8 March 2021.
  4. "Pochampally Municipality". pochampallymunicipality.telangana.gov.in. Retrieved 8 March 2021.
  5. "Basic Information of Municipality, Pochampally Municipality". pochampallymunicipality.telangana.gov.in. Retrieved 8 March 2021.
  6. నమస్తే తెలంగాణ, తెలంగాణ (27 January 2020). "ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల జాబితా." ntnews. Archived from the original on 3 March 2021. Retrieved 8 March 2021.
  7. సాక్షి, తెలంగాణ (27 January 2020). "తెలంగాణ: మున్సిపల్‌ చైర్మన్లు వీరే". Sakshi. Archived from the original on 27 January 2020. Retrieved 8 March 2021.
  8. skannegari. "Pochampally Municipality - Telangana NavaNirmana Sena". tgnns.com. Archived from the original on 11 ఏప్రిల్ 2021. Retrieved 11 April 2021.

వెలుపలి లంకెలుసవరించు