పోడు వ్యవసాయం

ఆదివాసులు అడవిని కొట్టేసి జొన్నలు, సజ్జలు లాంటి చిరు ధాన్యాలూ, యితర కూరగాయలూ పండిస్తారు. ఇవే వారి ప్రధాన జీవనాధారం. నాగలిని ఏమాత్రం ఉపయోగించకుండా కేవలం వొక చిన్న గొడ్డలి సహాయంతో అడవిని కొట్టి సాగుచేసే ఈ పద్ధతిని ఆంధ్రప్రదేశ్ లో పోడు అంటారు. అదే మధ్య ప్రదేశ్‌లో నయితే "బేవార్" (Bewar) లేదా " పెండా" (Penda) అనీ, ఈశాన్య భారతంలో "ఝం" (jhum) అనీ అంటారు.

Sorghum.jpg
జొన్నలు


కాని వీటన్నింటి మధ్యా కొద్దిపాటి వ్యత్యాసాలున్నాయి. నాగా ,నిషి లేదా కొండ మరియ తెగల ఆదివాసులు వొక పార (Hoe) సహాయంతో కొండ ప్రాంతాలను చదును చేసి సాగు చేస్తుంటారు. అదే సమయంలో గోదావరీ ప్రాంతంలోని కొండ రెడ్లు మాత్రం అడవిని కొట్టేసి, చదును చేసి, చిన్న కర్ర సహాయంతో రంధ్రాలు చేసి జొన్నలు, సజ్జలు లాంటి చిరు ధాన్యాలను చల్లుతారు. మొత్తం ఆసియాఖండంలోనే యింత మోటు (Crude) పద్ధతుల్లో సాగు చేసే తెగ మరొకటి ఉండదు.


  • ఆంగ్ల మూలం : Tribes of India : The Struggle for Survival, Cristoph Von Furer-Haimendorf, అనువాదం : అనంత్. - మనుగడ కోసం పోరాటం