పౌరాణిక నాటకాలు

పౌరాణిక నాటకాలు పురాణ కథ లలోని పాత్రలను రంగస్థలం మీద నటుల ద్వారా ప్రదర్శించే నాటకాలను పౌరాణిక నాటకాలు అంటారు. ఆకాలంలో సమాజంలో నైతిక విలువలు మానవ సంబంధాలపై అవగాహన కలిగించేందుకు పౌరాణిక నాటకాలు దోహదపడేవి.[1]


ఆంధ్రప్రదేశ్ సచివాలయ సాంస్కృతిక సంఘం వారు ప్రదర్శించిన శ్రీకృష్ణరాయబారం పౌరాణిక నాటకంలోని ఒక దృశ్యం

పూర్వకాలంలో కథాంశాలను పౌరాణిక ఇతిహాసాల నుంచి తీసుకొని హరికథ లు, బుర్రకథ లన ద్వారా అభినయాన్ని అందించే ప్రక్రియ పౌరాణిక నాటకాలకు ఆధారం. ధర్మవరం కృష్ణమాచార్యులు ధార్వాడా నాటక విధానాలను స్ఫూర్తిగా తీసుకొని చిత్రనళీయం అనే పౌరాణిక నాటకాన్ని రచించి ప్రదర్శించాడు. 1895లో సురభి గ్రామంలో సంపన్న కుటుంబానికి చెందిన రామిరెడ్డి, చెన్నారెడ్డి వివాహంలో వినోద కార్యక్రమాల్లో భాగంగా వనారస గోవిందరావు కీచకవధ అను నాటకాన్ని ప్రదర్శించారు.[2]

చిలకమర్తి లక్ష్మీనరసింహం పార్వతీపరిణయం, భాష నాటకాలను సంస్కృతం నుండి అనువదించాడు. కీచకవధ, ద్రౌపది పరిణయం, గయోపాఖ్యానం రచించారు. వేదం వెంకటరాయశాస్త్రి ప్రతాపరుద్రీయం, బొబ్బిలియుద్ధం; కందుకూరి వీరేశలింగం హరిశ్చంద్ర; పానుగంటి వారి పాదుకాపట్టాభిషేకం, రాధాకృష్ణ, విజయరాఘవం, విప్రనారాయణ, కంఠాభరణం; తిరుపతి వేంకటకవులు రాసిన 5 నాటకాలలో పాండవోద్యోగ విజయాలు, కురుక్షేత్రం; బలిజేపల్లి లక్ష్మీకాంతం సత్యహరిశ్చంద్ర, ధర్మవరం గోపాలాచార్యులు భక్తరామదాసు; ముత్తరాజు సుబ్బారావు శ్రీకృష్ణ తులాభారం; ఆవటవల్లి హనుమంతరావు మహాకవి కాళిదాసు, తాండ్ర సుబ్రహ్మణ్యం శ్రీ రామాంజనేయ యుద్ధం వంటి పౌరాణిక నాటకాలు జనరంజకాలుగా నేటికి పల్లెటూళ్లలోను ప్రదర్శించబడుతున్నాయి.[3] [4] [5]

మూలాలు

మార్చు
  1. నవ తెలంగాణ. "పౌరాణిక నాటకాలు నీతి బోధనలు". Archived from the original on 15 ఏప్రిల్ 2021. Retrieved 31 July 2017.
  2. పౌరాణిక నాటకాలు, కరీంనగర్ జిల్లా నాటకరంగం-ఒక పరిశీలన, కోటగిరి జయవీర్, పుట. 54.
  3. ప్రజాశక్తి. "రంజింప చేస్తున్న పౌరాణిక నాటకాలు". Retrieved 31 July 2017.[permanent dead link]
  4. సాక్షి. "నటప్రావీణ్యానికి ప్రతీకలు.. పౌరాణిక నాటకాలు". Retrieved 31 July 2017.
  5. నమస్తే తెలంగాణ. "అలరించిన పౌరాణిక నాటకాలు". Retrieved 31 July 2017.[permanent dead link]