ప్రగతి భవన్, హైదరాబాదు

ప్రగతి భవన్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక కార్యాలయం, నివాసం. ఇది హైదరాబాదులోని పంజాగుట్టలో ఉంది.[1] భారతదేశంలో పేరొందిన వాస్తుశిల్పి హఫీజ్ కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో ఈ భవనం రూపొందించబడింది.[2]

ప్రగతి భవన్
Pragathi Bhavan, Hyderabad.jpg
ప్రగతి భవన్
సాధారణ సమాచారం
నిర్మాణ శైలినియోక్లాసికల్, పల్లాడియన్
చిరునామాగ్రీన్ లాండ్స్ రోడ్డు, పంజాగుట్ట
హైదరాబాదు 500 082
తెలంగాణ, భారతదేశం
ప్రస్తుత వినియోగదారులుకల్వకుంట్ల చంద్రశేఖరరావు
తెలంగాణ ముఖ్యమంత్రి
నిర్మాణ ప్రారంభంమార్చి 2016
పూర్తి చేయబడినది23 నవంబరు 2016; 6 సంవత్సరాల క్రితం (2016-11-23)
వ్యయం38 కోట్ల రూపాయలు
(US$5.4 మిలియన్)
క్లయింట్తెలంగాణ ప్రభుత్వం
సాంకేతిక విషయములు
పరిమాణం9 ఎకరాలు (3.6 హెక్టార్లు)
నేల వైశాల్యం100,000 sq ft (9,300 మీ2)
రూపకల్పన, నిర్మాణం
వాస్తు శిల్పిహఫీజ్ కాంట్రాక్టర్
ఇంజనీరుషాపూర్జీ పల్లోంజి

చరిత్రసవరించు

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకు విధుల నిర్వాహణకోసం ఈ నూతన భవనం నిర్మించబడింది. అంతకుముందు ఈ ప్రదేశంలో పదిమంది ఐఏఏస్ అధికారులు, ఇరవైనాలుగు ఇతర అధికారుల క్వార్టర్స్ ను తొలగించి నూతన భవనాన్ని నిర్మించి, దానికి ప్రగతి భవన్ అనే పేరు పెట్టారు. 2016, నవంబరు 23న ఉదయం గం. 5.22 ని.లకు చినజీయర్ స్వామి సమక్షంలో సాంప్రదాయ ఆచారాలు నిర్వహించి కెసీఆర్ ప్రగతి భవన్ లోకి గృహప్రవేశం చేశాడు.

నిర్మాణంసవరించు

నియోక్లాసికల్ & పల్లాడియన్ శైలిలో భారతీయ వాస్తుశిల్పి హఫీజ్ కాంట్రాక్టర్ రూపొందించిన ఈ భవనం బ్రిటీషు రెసిడెన్సీ, ఫలక్‌నుమా ప్యాలెస్ వంటి చారిత్రాత్మక భవంతుల నిర్మాణాన్ని పోలివుంటుంది. దీని నిర్మాణాన్ని వాస్తుశిల్పి సుద్దాల సుధాకర్ తేజ పర్యవేక్షించాడు.[3][4]

2016, మార్చిలో ప్రగతి భవన్ నిర్మాణం ప్రారంభించబడి 38కోట్ల రూపాయలతో ముంబైకి చెందిన షాపూర్జీ పల్లోంజి అనే నిర్మాణ సంస్థ నేతృత్వంలో రాత్రి పగలు 200మంది కార్మికులు పనిచేయగా తొమ్మిది నెలల్లో 2016, నవంబరులో పూర్తయింది. ఈ భవన్ ముందుభాగంలో పెద్దపెద్ద స్తంభాలతో పొడవైన వరండా ఉంది. ఆ వరండా దాటి లోపలికి వెళ్ళకా లోపలిభాగంలో విశాలమైన గదులు ఉన్నాయి.

భవన సముదాయంసవరించు

9 ఎకరాల (3.64 హెక్టార్ల) భూభాగంలో తూర్పుముఖంగా 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ప్రగతి భవన్ సముదాయం నిర్మించబడింది. ఈ నూతన భవనంలోకి నార్త్ ఈస్ట్ మూలలో ప్రధాన ద్వారం ఉంది. ఇందులో మూడు భవనాలు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సదుపాయాలతో అమర్చబడి ఉన్నాయి. ఈ భవనాలకు సమీపంలో మైసమ్మ ఆలయం ఉంది. దశాబ్దాల కాలంనాటి ఆలయం కూడా ఒక కొత్త స్థానంలో పునర్నిర్మించబడింది.[5] ఇందులో ముఖ్యమంత్రి నివాసం, ముఖ్యమంత్రి కార్యాలయం, జనహిత (సమావేశ మందిరం), మాజీ ముఖ్యమంత్రి నివాసం, క్యాంప్ కార్యాలయాలుగా విభజించబడ్డాయి.[6][7]

ఇతర వివరాలుసవరించు

మూలాలుసవరించు

  1. "India outrage at minister's $7.3m house with bullet-proof bathroom". BBC News. 25 November 2016. Retrieved 5 June 2019.
  2. Sudhir, Uma (1 November 2016). "Vastu Or Waste? Telangana To Explain KCR's New Hyderabad Office In Court". NDTV. Retrieved 5 June 2019.
  3. KCR to move to his new official residence in Begumpet tomorrow | Business Standard News
  4. "Telangana CM Moves Into Bullet-Proof Residence Twice The Size Of A Football Field". Archived from the original on 2019-06-05. Retrieved 2019-06-05.
  5. Birthday wishes pour in for KCR
  6. Telangana Chief Minister KCR Moves Into New 9-Acre House, Complete With Bulletproof Windows
  7. KCR moves to new home where even the toilet is bulletproof