తెలంగాణ ముఖ్యమంత్రుల జాబితా
భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రిని గవర్నరు నియమిస్తారు. రాజ్యాంగం ప్రకారం గవర్నరు రాష్ట్ర పరిపాలకుడు అయినప్పటికి అతనికి ఎటువంటి పరిపాలనాధికారాలు ఉండవు. శాసనసభ ఎన్నికలు ఫలితాలను బట్టి సరిపడా సంఖ్యాబలం ఉన్న పార్టీ లేదా కూటమిని గవర్నరు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారు.అతను ముఖ్యమంత్రిని నియమిస్తారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో మంత్రి మండలి రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. ముఖ్యమంత్రి పదవి కాలం ఐదు సంవత్సరాలు. ఈ పదవిని నిర్వహించడానికి ఎటువంటి సంఖ్యా పరిమితి లేదు. ఒక వ్యక్తి ఈ పదవిని ఎన్ని సార్లైనా చేపట్టవచ్చు.
తెలంగాణ ముఖ్యమంత్రి
Telaṅgāṇa Mukhyamantri | |
---|---|
ముఖ్యమంత్రి కార్యాలయం (తెలంగాణ ప్రభుత్వం) | |
విధం |
|
స్థితి | ప్రభుత్వాధినేత |
Abbreviation | సి.ఎం. |
సభ్యుడు | |
అధికారిక నివాసం | ప్రజా భవన్, హైదరాబాద్ |
స్థానం | రాష్ట్ర సచివాలయం |
నియామకం | తెలంగాణ గవర్నరు |
కాలవ్యవధి | ముఖ్యమంత్రి పదవీకాలం ఐదు సంవత్సరాలు, ఎటువంటి కాల పరిమితిలకు లోబడి ఉండదు.[1] |
ప్రారంభ హోల్డర్ | కె. చంద్రశేఖరరావు |
నిర్మాణం | 2 జూన్ 2014 |
ఉప | తెలంగాణ ఉప ముఖ్యమంత్రి |
వెబ్‌సైటు | Official website |
2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో గెలుపొందిన కె.చంద్రశేఖరరావు 2014 జూన్ 2న రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ రాష్ట్రానికి ప్రారంభపు ముఖ్యమంత్రిగా పనిచేసాడు.[2]
హైదరాబాదు రాష్ట్రం
మార్చు1948లో హైదరాబాదు సంస్థానంపై భారత ప్రభుత్వం జరిపిన పోలీసు చర్య తరువాత, సంస్థానం భారతదేశంలో విలీనమై, ఈ సంస్థానం మొత్తం హైదరాబాదు రాష్ట్రంగా ఏర్పడింది. 1956లో భాషా ప్రయుక్తంగా జరిగిన రాష్ట్రాల పునర్విభజనలో భాగంగా, 1956 నవంబర్ 1 న హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను (ప్రస్తుత తెలంగాణా), ఆంధ్ర రాష్ట్రంతో కలిపి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అవతరించింది..
సంఖ్య | పేరు | చిత్రం | ఆరంభం | అంతం | వ్యవధి |
---|---|---|---|---|---|
2 | ఎం కె వెల్లోడి | 1950 జనవరి 26 | 1952 మార్చి 6 | ||
3 | బూర్గుల రామకృష్ణారావు | 1952 మార్చి 6 | 1956 అక్టోబరు 31 |
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
మార్చుతెలంగాణ రాష్ట్రం అధికారికంగా 2014 జూన్ 2న న ఏర్పాటైంది. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికలలో భారత రాష్ట్ర సమితి పార్టీ మెజారిటీ సాధించింది.[3] హైదరాబాద్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండింటికీ 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉండాలని విభజన చట్టంలో పొందుపర్చారు. తరువాత హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి రాజధానిగా మారుతుంది. ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని ఎంపిక చేయబడింది.[4] ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఎంచుకుని, 2016లో సచివాలయాన్ని, 2017లో శాసనసభను మార్చారు.[5][6]
1956 నుండి 2014 వరకు తెలంగాణా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగంగా ఉంది. ఈ రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రుల జాబితాకై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు చూడండి.
తెలంగాణ ముఖ్యమంత్రులు జాబితా
మార్చు# | చిత్తరువు | ముఖ్యమంత్రి (జననం) నియోజకవర్గం |
పదవీకాలం[7] | ఎన్నిక (కాలం) |
పార్టీ | ప్రభుత్వం | నియమించిన వారు (గవర్నరు) | |||
---|---|---|---|---|---|---|---|---|---|---|
పదవీకాలం ప్రారంభం | పదవీకాలం ముగింపు | కాల వ్యవధి | ||||||||
1 | కల్వకుంట్ల చంద్రశేఖరరావు (జ: 1954) గజ్వేల్ శాసనసభ్యుడు |
2014 జూన్ 2 | 2018 డిసెంబరు 12 | 9 సంవత్సరాలు, 187 రోజులు | 2014 (తెలంగాణ 1వ శాసనసభ|1వ) |
భారత్ రాష్ట్ర సమితి | కెసిఆర్ I | ఈ.ఎస్.ఎల్.నరసింహన్ | ||
2018 డిసెంబరు 13 | 6 2023 డిసెంబరు 6 | 2018 (2వ) |
కెసిఆర్ II | |||||||
2 | రేవంత్ రెడ్డి (జ: 1969) కొడంగల్ శాసనసభ్యుడు |
2023 డిసెంబరు 7 | పదవిలోఉన్న వ్యక్తి | 267 రోజులు | 2023 (3వ) |
భారత జాతీయ కాంగ్రెస్ | ఎ.ఆర్.రెడ్డి | తమిళిసై సౌందరరాజన్ |
ఇవీ చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Durga Das Basu. Introduction to the Constitution of India. 1960. 20th Edition, 2011 Reprint. pp. 241, 245. LexisNexis Butterworths Wadhwa Nagpur. ISBN 978-81-8038-559-9. Note: although the text talks about Indian state governments in general, it applies for the specific case of Andhra Pradesh as well.
- ↑ Shankar, Kunal (26 June 2015). "A mixed bag". Frontline (magazine). Archived from the original on 2 February 2020. Retrieved 2 February 2020.
- ↑ Amarnath K Menon (1 June 2014). "Telangana is born, KCR to take oath as its first CM". THE INDIA TODAY GROUP. Hyderabad. Archived from the original on 11 November 2014. Retrieved 14 July 2014.
- ↑ Amid chaos and slogans, Rajya Sabha clears Telangana bill Archived 6 మార్చి 2014 at the Wayback Machine – NDTV, 20 February 2014
- ↑ "Andhra Pradesh Secretariat starts functioning from interim government complex at Amaravati". 3 October 2016. Archived from the original on 2 August 2017. Retrieved 23 June 2017.
- ↑ "Chief Minister Chandrababu Naidu inaugurates new Andhra Pradesh Assembly". Archived from the original on 19 June 2017. Retrieved 23 June 2017.
- ↑ The ordinal number of the term being served by the person specified in the row in the corresponding period