పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి''' ([[ఆగష్టు 1]], [[1900]] - [[ఆగస్టు 11]], [[1962]]) ప్రముఖ రచయిత, సాహితీకారుడు.
 
==జీవిత విశేషాలు==
ఈయన విశాఖపట్టణం జిల్లా [[చోడవరం]] లో వారి మాతామహులు రాంభట్ల జగన్నాథ శాస్త్రి ఇంట్లో [[1900]], [[ఆగష్టు 1]] న జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు వేంకట రత్నము, అన్నప్ప పంతులు. పెదమామ గారగు కొత్తూరు అప్పల నరసయ్య పంతులు ( పార్వతీపురము లో ప్రముఖ న్యాయవాది ) ఆదర్శ పాలన వీరినెంతో ప్రభావితులను చేసింది. వీరి స్వస్థలము [[ఒడిషా]] లోని [[బరంపురం]]( గంజాము జిల్లా ).
 
==విద్యాభ్యాసము==
మిడిల్ స్కూల్ - చోడవరము, విశాఖపట్నము ( సి. బి. యమ్ పైస్కూలు).
 
==రచయితగా==
[[మహాభారతము]] యెడల ప్రీతి మెండు. పురాణములు పిన్నవయసున చదివేవాడు. పద్యరచన యందప్పటినుండియు ఆసక్తి జనించెను. మహాత్మా గాంధీ సహాయ నిరాకరణోద్యమమున పాల్గొని 1923 లో కారాగార బద్ధులయిరి. జాతీయగీతములు పాడి, ఉద్యమ ప్రచారము చేసెను . వడ్డాది సీతారామాంజనేయకవి ఇతని సహచరుడు, సతీర్థ్యుడు. పురాణం సూర్యనారాయణ తీర్థుల ఇతని ఆరాథ్య గురువులు.
 
==రచనలు==
"దండాలు దండాలు భరతమాత " అను సుపరిచిత ప్రబోధ గీతము ఈయన వ్రాసినదే . వడ్డాది కవితో స్వరాజ్య గీతామృతము, ఆత్మ శిక్ష అను కంద శతకము ( 1923 ) లను రచియించెను. వాటిని ప్రభుత్వమువారు నిషేధించిరి . స్వతంత్రముగా ' భక్తకల్పద్రుమము ' అను దైవభక్తి ప్రబోధ శతకము ' , " కుమారా " అను మకుటముగల కందశతకము పిల్లలకు నీతి బోధకముగ 1945 లో రచించెను .
 
==ఉద్యోగము==
జయపుర సంస్థానము ( ఒడిషా ) శ్రీ విక్రమదేవవర్మ మహారాజు పాలనలో 1925 నుండి 1960 వరకు అమీనుగను , మేనేజరుగను పనిచేసిరి పనిచేశారు.

== మరణం ==
నిరాడంబర జీవనము , భగవంతునియెడ సర్వ సమర్పణ భావనతో ధర్మాచరణ చేసి [[1962]], [[ఆగస్టు 11]] వ తేది శుభకృత్ శ్రావణ శుక్ల ఏకాదశి దినమున ( స్థిరవారము ) కటకములో పెద్దకుమారుని ఏకాంతములో పరమపదించిరిపరమపదించారు .
 
==సూచికలు==