బడ్జెట్ పద్మనాభం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ( → ( (2) using AWB
పంక్తి 21:
}}
 
'''బడ్జెట్ పద్మనాభం''' 2001లో విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. [[ఎస్. వి. కృష్ణారెడ్డి]] దర్శకత్వం<ref name="ఆల్‌రౌండర్‌...">{{cite news|last1=నవతెలంగాణ|title=ఆల్‌రౌండర్‌...|url=http://m.navatelangana.com/NavaChitram/BirthdaySpecial/Read-313129|accessdate=6 July 2017}}</ref> వహించిన ఈ చిత్రంలో [[జగపతిబాబు]],<ref name="హ్యాపీ బర్త్ డే జగపతి బాబు">{{cite news|last1=నమస్తే తెలంగాణ|title=హ్యాపీ బర్త్ డే జగపతి బాబు|url=https://www.ntnews.com/cinema-news-telugu/happy-birthday-jagapathi-babu-1-1-523934.html|accessdate=6 July 2017}}</ref> [[రమ్యకృష్ణ]] నాయికానాయకులుగా నటించగా, [[ఎస్. వి. కృష్ణారెడ్డి]] సంగీతం అందించారు. ఈ చిత్రానికి, 2000 సంవత్సరం తమిళంలో వచ్చిన బడ్జెట్ పద్మనాభన్ అనే చిత్రం మాతృక.
 
== చిత్రకథ ==
బడ్జెట్‌ పద్మనాభం (జగపతి బాబు) ఒక ఉద్యోగి. పెళ్ళి అంటే ఖర్చు కాబట్టి పెళ్ళి చేసుకోడు. ఏదీ చేయాలన్నా రెండు, మూడు సార్లు ఆలోచిస్తాడు. రమ్యకృష్ణకు పద్మనాభం అంటే ఇష్టం. ఇద్దరం కలిస్తే ఇద్దరి సంపాదన తోడు అవుతుంది కదాని రమ్య సలహా పాటించి ఆమెను పెళ్ళి చేసుకుంటాడు. కానీ పెళ్ళి అయిన నెలకే రమ్యకృష్ణ గర్భవతి అవుతుంది. ముగ్గురు పిల్లలు (ట్రిపులెట్స్‌) పుడుతారు. ఇంకా ఖర్చు పెరుగుతుంది. బడ్జెట్‌ పద్మనాభం బడ్జెట్‌ ఖర్చుకు కూడా ఓ రీజన్‌ ఉంటుంది. ఫ్లాష్‌ బ్యాక్‌ లోబ్యాక్‌లో ..... జగపతి బాబు చాలా చిన్నప్పుడు అంటే 8 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు వాళ్ళ నాన్న అప్పు చేసి ఇల్లు కడుతాడు. కానీ ఇల్లు కట్టాక హార్ట్‌ ఎటాక్‌ వచ్చి చనిపోతాడు. దాంతో అప్పు ఇచ్చిన తనికెళ్ళ భరణి వీళ్ళను ఇంట్లో నుంచి తరిమికొడతాడు. 20 ఏళ్ళలో అప్పు తీర్చితే ఇల్లు మళ్ళీ జగపతిబాబుకు ఇవ్వాలని కోర్టు తీర్పు ఇస్తుంది. ఎలాగైనా ఆ ఇల్లు సొంతం చేసుకునేందుకే డబ్బు పొదుపు చేస్తుంటాడు. చివరికి ఇల్లు వశం చేసుకుంటాడా లేదా అన్నదే క్లైమాక్స్‌.
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/బడ్జెట్_పద్మనాభం" నుండి వెలికితీశారు