బడ్జెట్ పద్మనాభం

2001 సినిమా

బడ్జెట్ పద్మనాభం 2001లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వం[1] వహించిన ఈ చిత్రంలో జగపతిబాబు,[2] రమ్యకృష్ణ నాయికానాయకులుగా నటించగా, ఎస్. వి. కృష్ణారెడ్డి సంగీతం అందించారు. ఈ చిత్రానికి, 2000 సంవత్సరం తమిళంలో వచ్చిన బడ్జెట్ పద్మనాభన్ అనే చిత్రం మాతృక.

బడ్జెట్ పద్మనాభం
దర్శకత్వంఎస్. వి. కృష్ణారెడ్డి
రచనదివాకర్ బాబు (మాటలు)
స్క్రీన్ ప్లేఎస్. వి. కృష్ణారెడ్డి
కథజి. అరుణాచలం
నిర్మాతగ్రంధి నారాయణరావు (బాబ్జి)
తారాగణంజగపతిబాబు, రమ్యకృష్ణ
ఛాయాగ్రహణంశరత్
కూర్పునందమూరి హరి
సంగీతంఎస్. వి. కృష్ణారెడ్డి
నిర్మాణ
సంస్థ
శ్రీ ధనలక్ష్మీ ఫిలింస్
విడుదల తేదీ
2001 మార్చి 9 (2001-03-09)
సినిమా నిడివి
151 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

చిత్రకథ మార్చు

బడ్జెట్‌ పద్మనాభం (జగపతి బాబు) ఒక ఉద్యోగి. పెళ్ళి అంటే ఖర్చు కాబట్టి పెళ్ళి చేసుకోడు. ఏదీ చేయాలన్నా రెండు, మూడు సార్లు ఆలోచిస్తాడు. రమ్యకృష్ణకు పద్మనాభం అంటే ఇష్టం. ఇద్దరం కలిస్తే ఇద్దరి సంపాదన తోడు అవుతుంది కదాని రమ్య సలహా పాటించి ఆమెను పెళ్ళి చేసుకుంటాడు. కానీ పెళ్ళి అయిన నెలకే రమ్యకృష్ణ గర్భవతి అవుతుంది. ముగ్గురు పిల్లలు (ట్రిపులెట్స్‌) పుడుతారు. ఇంకా ఖర్చు పెరుగుతుంది. బడ్జెట్‌ పద్మనాభం బడ్జెట్‌ ఖర్చుకు కూడా ఓ రీజన్‌ ఉంటుంది. ఫ్లాష్‌ బ్యాక్‌లో ..... జగపతి బాబు చాలా చిన్నప్పుడు అంటే 8 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు వాళ్ళ నాన్న అప్పు చేసి ఇల్లు కడుతాడు. కానీ ఇల్లు కట్టాక హార్ట్‌ ఎటాక్‌ వచ్చి చనిపోతాడు. దాంతో అప్పు ఇచ్చిన తనికెళ్ళ భరణి వీళ్ళను ఇంట్లో నుంచి తరిమికొడతాడు. 20 ఏళ్ళలో అప్పు తీర్చితే ఇల్లు మళ్ళీ జగపతిబాబుకు ఇవ్వాలని కోర్టు తీర్పు ఇస్తుంది. ఎలాగైనా ఆ ఇల్లు సొంతం చేసుకునేందుకే డబ్బు పొదుపు చేస్తుంటాడు. చివరికి ఇల్లు వశం చేసుకుంటాడా లేదా అన్నదే క్లైమాక్స్‌.

నటవర్గం మార్చు

పాటలు మార్చు

ఈ చిత్రంలోని పాటలన్నీంటిని చంద్రబోస్ రచించగా ఎస్వీ కృష్ణారెడ్డి సంగీతం అందించారు. పాటలు సుప్రీమ్ మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి.

సం.పాటగాయకులుపాట నిడివి
1."మోనాలిసా మోనాలిసా"రవివర్మ, ఉషా5:10
2."బావ బావ"ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఉన్నికృష్ణన్5:12
3."పడకింట్లో ఈ క్షణం"పంకజ్ ఉదాస్, నిత్య సంతోషిణి5:09
4."సొమ్ముతా ఆదా చెయ్యరా"ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం4:09
5."ఎవరేమి అనుకున్న"ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం4:56
Total length:24:36

మూలాలు మార్చు

  1. నవతెలంగాణ. "ఆల్‌రౌండర్‌..." Retrieved 6 July 2017.
  2. నమస్తే తెలంగాణ. "హ్యాపీ బర్త్ డే జగపతి బాబు". Retrieved 6 July 2017.[permanent dead link]
  3. తెలుగు ఎ6 న్యూస్. "లేడీ విలన్ అంటే ఈ నటి మాత్రమే గుర్తొస్తుంది". telugu.a6news.com. Retrieved 6 July 2017.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)

ఇతర లంకెలు మార్చు