శుభలేఖ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పరిచయం + తారాగణం + పాత్రల పేర్లు
ట్యాగు: 2017 source edit
పంక్తి 26:
|imdb_id = 0246258 |
}}
'''శుభలేఖ''' 1982 లో [[కె.విశ్వనాథ్|కె. విశ్వనాథ్]] దర్శకత్వంలో విడుదలైన సాంఘిక చిత్రం. ఇందులో [[చిరంజీవి]], [[సుమలత]] ముఖ్యపాత్రలు పోషించారు.
 
==కథ==
[[ఫైలు:chiruclassic.jpg|leftright|thumb|100px|శాస్త్రీయ నృత్య భంగిమలో]]
 
బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన నరసింహ మూర్తి ([[చిరంజీవి]]) డిగ్రీలో తప్పటంతో ఒక స్టార్ హోటల్లో వెయిటర్ గా పనిచేస్తూ ఉంటాడు. అంకెల ఆదిశేషయ్య ([[కైకాల సత్యనారాయణ]]) నడుపుతున్న కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న సుజాత ([[సుమలత]]) అతనికి పరిచయం అవుతుంది. ఆదిశేషయ్య తన కుమారుడు మోహన్ ([[గిరీశ్]])తో సహా పెళ్ళిచూపులకి సుజాత ఇంటికి వస్తారు. ఆదిశేషయ్య అడిగిన వరకట్నం సుజాత కుటుంబం స్తోమతకి మించగా, సుజాత అతనితో వాదనకి దిగుతుంది. తమతోనే ఉంటే తమ కుమార్తె వివాహం చెయ్యలేమని, సంఘంలో తలెత్తుకు తిరగలేమని భయపడిన తల్లిదండ్రులు ఆమెను ఇంటినుండి పంపించేస్తారు. ఆదిశేషయ్య కూడా తనని పనిలోంచి తీసేయగా నిరాశ్రయురాలైన తనకి తన ఇంటిలోనే చోటిస్తాడు మూర్తి. అయితే సంఘం వారిద్దరికీ అక్రమ సంబంధం అంటగడుతుంది. ఒక సన్మాన సభలో ఆదిశేషయ్య నిజస్వరూపాన్ని బయటపెట్టి మూర్తి అతనిని అవమానించగా, రౌడీలతో అతనిని కొట్టించి, అతని ఉద్యోగం కూడా తీయించేస్తాడు ఆదిశేషయ్య. సుజాతతో బాటు [[హైదరాబాదు]] చేరి, తనకి పరిచయం ఉన్న [[హైదరాబాదు ఆల్విన్|ఆల్విన్]] లో ఉన్నతోద్యోగి అయిన రావు ([[అరుణ్]]) తో మాటాడి సుజాతకి ఉద్యోగం ఇప్పిస్తాడు మూర్తి. సుజాత చెల్లెలు లక్ష్మి ([[తులసి]]) ని మోహన్ తమ్ముడు మురళి ([[శుభలేఖ సుధాకర్]]) ప్రేమిస్తాడు. లక్ష్మితో పెళ్ళి జరిపించకపోతే ఆత్మహత్య చేస్కొంటానన్న మురళి బెదిరింపుకు భయపడి, తక్కువ కట్నంతోనే మురళి, తులసి ల పెళ్ళికి ఏర్పాట్లు చేస్తాడు ఆదిశేషయ్య.
 
మూర్తి, సుజాతల పెళ్ళికి మురళి, లక్ష్మిలు ఏం చేశారు, అన్నది చిత్రానికి ముగింపముగింపు.
 
== తారాగణం ==
* నరసింహ మూర్తిగా [[చిరంజీవి]]
* అంకెల ఆదిశేషయ్య గా [[కైకాల సత్యనారాయణ]]
* సుజాతగా [[సుమలత]]
* లక్ష్మిగా [[తులసి (నటి)|తులసి]]
* మురళిగా [[సూరావఝుల సుధాకర్|శుభలేఖ సుధాకర్]]
* [[జె. వి. రమణమూర్తి]]
* [[అల్లు రామలింగయ్య]]
* [[రాళ్ళపల్లి (నటుడు)|రాళ్ళపల్లి]]
* [[నిర్మలమ్మ]]
* [[పొట్టి ప్రసాద్]]
 
==విశేషాలు==
[[ఫైలు:chirukathak.jpg|leftright|thumb|100px|కథకళి వేషధారణలో]]
 
* [[కె.విశ్వనాథ్]] దర్శకత్వంలో చిరుకి ఇది మొదటి చిత్రం.
* [[సుధాకర్]], [[శుభలేఖ సుధాకర్]] అయ్యింది ఈ చిత్రంతోనే.
* ఈ చిత్రంలో చిరు పని చేసే స్టార్ హోటల్, [[వైజాగ్]]లో [[రామోజీ రావు]]కి చెందిన [[డాల్ఫిన్ హోటల్]]
* 'ఆల్విన్' ఫ్రిజ్ ల వాణిజ్య ప్రకటనకి మాడల్ గా చిరంజీవి ఒక పాటలో అన్ని భారతీయ సంప్రదాయ నాట్యాల నృత్యకారుడిగా కనిపిస్తారు.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/శుభలేఖ_(సినిమా)" నుండి వెలికితీశారు