హైదర్ అలీ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
చి మాతృభాష ఉచ్ఛారణ చాలు
పంక్తి 21:
| Religion = [[ఇస్లాం]]
}}
హైదర్ ఆలీ ([[ఉర్దూ]]: سلطان حيدر علی خان, [[కన్నడ]]: ಹೈದರಾಲಿ, Haidarālī, [[హిందీ]]:. हैदर अली, )హైదర్ ఆలీ, సి 1720-1782 డిసెంబరు 7, ఇస్లామిక్ కేలండర్ ప్రకారం 2 [[ముహర్రం]] 1197) దక్షిణాదిన ఉన్న [[మైసూర్ రాజ్యం]] యొక్క వాస్తవ పాలకుడు. అతడి అసలు పేరు హైదర్ నాయక్. [[సైనికుడు|సైనిక]] విజయాలతో ప్రత్యేకతను చాటుకొని ఆనాటి మైసూరు పాలకుల దృష్టిని ఆకర్షించగలిగాడు. రెండవ కృష్ణరాజ వొడయారుకు దళవాయి (సర్వ సైన్యాధిపతి) గా ఎదగడం ద్వారా ఆయన రాజు, [[మైసూరు]] ప్రభుత్వంపై పెత్తన్నాన్ని సాధించి క్రమక్రమంగా అన్ని రకాల అధికారాలపై అదుపు సాధించాడు. అతను తన రాజ్యం యొక్క సరిహద్దులను [[మరాఠా సామ్రాజ్యం]] మరియు [[నిజాం]] [[హైదరాబాదు జిల్లా|హైదరాబాదు]] వద్ద వరకు విస్తరించాడు. హైదర్ ఆలీ బ్రిటిషు ఈస్టిండియా కంపెనీ సైనిక విస్తరణనను సమర్థవంతంగా అడ్డుకున్న కొద్దిపాటి స్థానిక పాలకులలో ఒకడు. రెండు ఆంగ్ల-మైసూరు యుద్ధాలలో ఆయన బ్రిటిషు స్థావరమైన [[మద్రాసు]]కు అతి సమీపానికి రాగలిగాడు. అతను సుల్తాన్ హైదర్ ఆలీ ఖాన్, హైదర్ ఆలీ సాహిబ్ లాంటి అనేక గౌరవబిరుదాలను అందుకున్నాడు.
 
హైదర్ ఆలీ పాలన తన పొరుగువారితో తరుచుగా జరిగే యుధ్ధాలతోను మరియు తన రాజ్యం లోపల జరిగే తిరుగుబాటులతోను కూడిఉంది. ఇది ఆ కాలంలో అసాధారణమైన విషయమేమీ కాదు. నిజానికి అప్పుడు భారత ఉపఖండంలో ఎక్కువభాగం సంక్షోభంలో ఉంది. [[మరాఠా సామ్రాజ్యం|మరాఠా సమాఖ్య]] [[మొఘల్ సామ్రాజ్యం|మొఘల్ సామ్రాజాని]]కి చెందిన అధికారులతో పోరాడుతున్నది. అతను ఒక మంచి తెలివి గల నేత. తను పాలన చేపట్టినప్పుటి కంటే పెద్ద రాజ్యాన్ని తన కుమారుడు టిప్పు సుల్తానుకు వదిలివెళ్ళాడు. అతను తన సైన్యాన్ని [[ఐరోపా]] సైన్యపు పధ్ధతులలో వ్యవస్థీకరించాడు. [[రాకెట్]] ఆర్టిలరీని సైనికంగా వినియోగించడాన్ని అభివృధ్ధిచేసాడు, అతను ఇద్దరు భార్యలు, మరియు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
"https://te.wikipedia.org/wiki/హైదర్_అలీ" నుండి వెలికితీశారు