తెలంగాణ సారస్వత పరిషత్తు: కూర్పుల మధ్య తేడాలు

లింకులు ఇచ్చాను
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
<big>'''ఆంధ్ర సారస్వత పరిషత్తు'''</big> హైదరాబాదులోని ప్రముఖ సాహిత్య సంస్థలలో ఒకటి. ఇది మొదట ''నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్తు'' పేరుతో [[1943]], [[మే 26]]న [[లోకనంది శంకర నారాయణరావుశంకరనారాయణరావు]] అధ్యక్షతన ప్రారంభమైంది. 1949లో దీనిని ''ఆంధ్ర సారస్వత పరిషత్తుగాపరిషత్తు''గా పేరు మార్చారు. 2015 ఆగస్టులో ఈ సంస్థ పేరును ''తెలంగాణ సారస్వత పరిషత్తుగాపరిషత్తు''గా మార్చారు.
 
== చరిత్ర ==
[[దస్త్రం:Andhra saraswata parishad.jpeg|thumb|200px|ఆంధ్ర సారస్వత పరిషత్తు]]
ఆంధ్రమహాసభ పదవ సమావేశాలు హైదరాబాదు‌లో జరుగుతున్నపుడు లోకనంది శంకరనారాయణరావు అధ్యక్షతన [[బూర్గుల రంగనాథరావు]], [[భాస్కరభట్ల కృష్ణారావు]] ప్రభృతులు 1943 మే 26న రెడ్డి హాస్టల్లోని గ్రంథాలయంలో సమావేశమై, ఆంధ్ర భాషా సంస్కృతుల ప్రచారానికై "నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్"ను ఏర్పాటుచేశారు<ref>[http://www.suryaa.com/lifestyle/article.asp?category=0&contentId=221223|. సూర్య దినపత్రికలో ఆంధ్రసారస్వతపరిషత్తు పై వ్యాసం]</ref>. దాని ప్రథమ మహాసభ 5 రోజుల తర్వాత (అనగా జూన్1న) జరిగింది. ఆ తర్వాత నుండి [[సురవరం ప్రతాపరెడ్డి]], [[మాడపాటి హనుమంతరావు]], [[కాళోజీ నారాయణరావు]], [[పి.వి.నరసింహారావు]], [[బూర్గుల రామకృష్ణారావు]], [[బెజవాడ గోపాలరెడ్డి]], [[మర్రి చెన్నారెడ్డి]], [[అడవి బాపిరాజు]] వంటి మహామహులెందరో ఈ సంస్థ ద్వారా తెలుగు భాషా సంస్కృతుల ప్రచారాన్ని విశాలాంధ్ర అంతటా విస్తరించి విశాలాంధ్రోద్యమాన్ని వేగతరం చేశారు. [[దేవులపల్లి రామానుజరావు]] ఈ సంస్థ అభివృద్ధికి 5 దశాబ్దాల కాలం తను మరణించేవరకు కృషి చేశాడు.
 
ఈ పరిషత్తు తన కార్యకలాపాలతో తెలంగాణా ప్రజల్లో సంచలనాత్మక అస్థిత్వ చైతన్యాన్ని కలిగిస్తే ఉలిక్కిపడిన నిజాం, ముస్లిం/ఉర్దూ దురహంకారులు, గుండాలు పరిషత్తు సమావేశాలకు ఎన్నో ఆటంకాలు కలిగించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక నిజాం రజాకార్ల (ముస్లిం దురహంకార స్వచ్ఛంద సైనికుల) అణచివేత చర్యలు తీవ్రతరం కావడంతో 16 నెలలు అజ్ఞాతవాసం చేసిన పరిషత్ పోలీస్‌చర్య అనంతరం నిజాం రాష్ట్రం భారతదేశంలో కలవడంతో నూతనోత్సాహంతో తన 5వ సమావేశాన్ని [[తూప్రాన్]]లో జరుపుకొంది. ఆంధ్ర సారస్వత పరిషత్ తన శాఖలను తెలంగాణాతో పాటు ఆంధ్ర, రాయలసీమలకు, బీదర్, గుల్బర్గా, బెంగుళూరు, రాయచూర్ మొదలైన కర్ణాటక ప్రాంతాలకు, సేలం, హోసూర్, కె.జి.కండ్రిగ, మద్రాస్ మొదలైన తమిళ ప్రాంతాలకు, బొంబాయి, పూనా, షోలాపూర్, నాందేడ్, దేగ్లూర్ మొదలైన మహారాష్ట్ర ప్రాంతాలకు, మారిషస్ దేశానికి కూడా విస్తరించింది. అలా 1973 నాటికి ఆంధ్ర సారస్వత పరిషత్ శాఖల సంఖ్య 375కి చేరింది.
Line 8 ⟶ 9:
ఈ కృషిలో మధ్యతరగతి మేధావులదే కాదు, నస్పూరు (ఆదిలాబాద్ జిల్లా), వనపర్తి వంటి సంస్థానాధీశుల పాత్రా ఉంది.
 
హైదరాబాదు లోని బొగ్గులకుంట ప్రాంతంలో కొంత స్థలాన్ని ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకుంది. లీజు కాలం ముగియడంతో ప్రభుత్వం ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకొనే పరిస్థితి వచ్చింది. దానితో పాతికలక్షలు పెట్టి ఆ స్థలాన్ని కొనుగోలు చేసింది. ఈ డబ్బులో ఎక్కువ మొత్తం రెడ్డి లాబ్స్ అధినేత [[కళ్ళం అంజిరెడ్డి|అంజిరెడ్డి]] విరాళంగా ఇచ్చాడు. [[సి.నారాయణ రెడ్డి]] తన ఎం.పి. నిధుల నుండి పాతిక లక్షలతో ఈ సంస్థ ప్రాంగణంలో పండిత శిక్షణ కళాశాలకు భవనాన్ని నిర్మించాడు. ఈ సంస్థ 1973లో రజతోత్సవాలను, 1994లో స్వర్ణోత్సవాలను, 2004లో వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకుంది.
 
==ఆశయాలు==
Line 14 ⟶ 15:
 
==కార్యక్రమాలు==
హైదరాబాదు, ఇతర తెలంగాణా జిల్లాల్లో [[సంక్రాంతి]], [[ఉగాది]] మొదలగు పండుగల సమావేశాలు, ఆంధ్ర మహాకవుల జయంత్యుత్సవాలు, కవిసమ్మేళనాలు, ప్రబోధ సప్తాహములు నిర్వహించడం, ఖండవల్లి బాలేందు శేఖరం గారి ''ఆంధ్రుల చరిత్ర'' ([[1944]]) వంటి గ్రంథాలను ప్రచురించడం, తెలుగు భాషా సాహిత్యాల్లో మెట్రిక్ స్థాయిలో ప్రవేశ పరీక్షలు జరిపి (1944 జూలై నుండి) హైదరాబాదు ప్రభుత్వానికి తెలుగు ఉపాధ్యాయులను పంపడం మొదలైన కార్యక్రమాలను చేపట్టింది. గ్రంథ ప్రచురణ, గ్రంథాలయ నిర్వహణ, తెలుగులో బోధన, పరీక్షల నిర్వహణ, సాహిత్య కార్యక్రమాల నిర్వహణ మొదలైన కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టింది పరిషత్. పండిత, ప్రజా, బాల సారస్వతాలు అనే మూడు విభాగాల్లో సుమారు రెండువందల పుస్తకాలను ప్రచురించి అతితక్కువ ధరలకు విక్రయించింది. తెలుగునాట మొట్టమొదటిసారిగా జానపద వాజ్ఞ్మయాన్ని ప్రచురించింది పరిషత్తే. పరిషత్ ప్రచురించిన [[సురవరం ప్రతాపరెడ్డి]] "[[ఆంధ్రుల సాంఘిక చరిత్]]ర"కు [[1955]]లో వచ్చిన [[కేంద్ర సాహిత్య అకాడమీ]] అవార్డే తెలుగులో మొదటిది. రామాయణ, భారత, భాగవతాది ప్రఖ్యాత గ్రంథాలెన్నింటిపైనో వ్యాఖ్యానాలు, హాస్య విమర్శలను పరిషత్ ప్రచురించింది. ఎన్నో ప్రఖ్యాత గ్రంథాలను సేకరించి గ్రంథాలయాన్ని నిర్వహించింది. 1952లో హైదరాబాదు‌లో నిర్వహించిన అఖిల భారత గ్రంథాలయ మహాసభలకు ఆహ్వాన సంఘ కార్యదర్శిగా పనిచేసింది. లక్ష్మణరాయ పరిశోధక మండలికి, తెలంగాణా రచయితల సంఘ స్థాపనకు, అఖిల భారత తెలుగు రచయితల సమావేశాలకు, యువభారతి సాహిత్య కార్యక్రమాలకు, తెలుగు లిపి సంస్కార కార్యక్రమాలకు, సారస్వత వేదికకు కేంద్రంగా పనిచేసింది.
 
[[1950]] నుండే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సహాయం పొందినా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో హిందీ భాషలో విద్యాబోధనను వ్యతిరేకించి మెట్రిక్యులేషన్, ఇంటర్, డిగ్రీ స్థాయి వరకు మాతృభాషలో విద్యాబోధన జరిగేటట్లు ప్రభుత్వ వ్యవహారాలూ తెలుగులో జరిగేటట్లు ప్రభుత్వంతో పోరాడి విజయం సాధించింది. 1945 అక్టోబరు నుండి ప్రాథమిక, మాధ్యమిక పరీక్షలను నిర్వహించింది. 1951 మార్చి నుంచి ఉన్నత స్థాయిలో విశారద పూర్వభాగం, 1953 మే నుండి విశారద ఉత్తరభాగం పరీక్షలను నిర్వహించి విశారదను ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాచ్య భాషా ప్రవేశ పరీక్ష (ఓరియంటల్ లాంగ్వేజ్ ఎంట్రన్స్) తో సమానంగా గుర్తించేటట్లు చూసింది. ఈ పరీక్షలను సంవత్సరానికి రెండు సార్లు దాని శాఖలన్నింటిలోనూ నిర్వహించినట్లే, 1964 దసరా (అక్టోబరు 22) నుండి తెలుగు పండిత శిక్షణ కళాశాలను 1962లో ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ప్రారంభించిన భవనంలో నిర్వహించింది. డి.ఓ.యల్., బి.ఓ.యల్, ఎం.ఓ.యల్ కోర్సులను 1965 సంక్రాంతి (జనవరి15) నుండి సాయంకాలం కళాశాలలో, ఆగస్టు 27 నుండి డే కళాశాలలో నిర్వహించింది.