కపిలవాయి లింగమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

telugu velugu reference
ట్యాగు: 2017 source edit
పంక్తి 17:
}}
 
'''[[కపిలవాయి లింగమూర్తి]]''' ([[మార్చి 31]], [[1928]]-[[నవంబర్ 6]], [[2018]]) [[పాలమూరు జిల్లా]]కు చెందిన ప్రముఖ కవి, రచయిత, సాహితీ పరిశోధకుడు.<ref name="teluguvelugu">{{Cite web|url=http://ramojifoundation.org/flipbook/201812/magazine.html#/36|title=మనకాలపు మెకంజీ|date=December 2018|accessdate=7 January 2019|website=Ramoji Foundation|last=రమేష్ బాబు|first=హెచ్}}</ref> జానపద సాహిత్యం, పాలమూరు జిల్లా లోని దేవాలయాలపై విస్తృత పరిశోధనలు చేశాడు. 70 కి పైగా పుస్తకాలు రచించాడు. ఈయనకు ''కవి కేసరి'' అనే బిరుదు ఉంది. తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేటు అందుకున్న తొలివ్యక్తి కపిలవాయి లింగమూర్తి.<ref>{{Cite web|url=http://www.andhrajyothy.com/artical?SID=660806|title=కపిలవాయి లింగమూర్తి ఇకలేరు|date=2018-11-07|website=andhrajyothy.com|publisher=ఆంధ్రజ్యోతి}}</ref>
 
==జీవిత సంగ్రహం==
పంక్తి 58:
 
== సన్మానాలు ==
కపిలవాయి లింగమూర్తికి సాహిత్య రంగంలో చేసిన విశేషకృషికి గుర్తింపుగా రాష్ట్ర స్థాయిలో అనేక సందర్భాలలో సన్మానాలు జరిగాయి. [[1983]]లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి [[నందమూరి తారక రామారావు]] వీరిని సన్మానించారు. తరువాత [[నారా చంద్రబాబు నాయుడు]], [[వై.యస్. రాజశేఖరరెడ్డి]]లు ముఖ్యమంత్రులుగా ఉన్నకాలంలోనూ వారిచే సన్మానాలు పొందారు. [[తెలంగాణ రాష్ట్ర సమితి]] దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షులు, ఇప్పటి [[తెలంగాణ]] రాష్ట్ర ముఖ్యమంత్రి [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు]] వీరిని సన్మానించారు. నలుగురు ముఖ్యంత్రులచే సన్మానింపబడిన ఏకైక తెలుగు కవి, పరిశోధకులు కపిలవాయి లింగమూర్తి. ఇంకా [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము|తెలుగు విశ్వవిద్యాలయ]] ప్రతిభాపురస్కారం, [[బూర్గుల రామకృష్ణారావు]] ప్రతిభా పురస్కారం, బ్రౌన్ సాహిత్య పురస్కారం, నోరి నరసింహశాస్త్రి పురస్కారం, కందుకూరి రుద్రకవి పురస్కారం, పులికంటి సాహితీ పురస్కారం, బి.ఎన్.శాస్త్రి స్మారక పురస్కారం మొదలైన ఎన్నో సత్కారాలను పొందాడు.
 
== కపిలవాయిపై డాక్యుమెంటరీ ==