విజయవాడ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 276:
* విజయవాడలో అనేక సినిమా ధియేటర్లు ఉన్నాయి. అధునాతన షాపింగ్ మాల్స్ లో అంతర్జాతీయ ఉత్పత్తులు. జ్యూవెలరీ దుకాణాలకు ఇక్కడ మహాత్మా గాంధీ రోడ్డు (బందరు రోడ్డు) ప్రసిద్ధమైనది.
=== మత విశ్వాసాలు, ప్రార్థనా స్థలాలు ===
 
<nowiki/>{{main|కనకదుర్గ గుడి}}
{{main| మరకత రాజరాజేశ్వరీ దేవాలయం }}విజయవాడ నగరంలో ప్రాచీన కాలం నుంచి బౌద్ధం, జైనం, తర్వాత శైవం వృద్ధిచెందాయి. విజయనగర సామ్రాజ్య పరిపాలన అనంతరం 16వ శతాబ్దం నాటికి కొంతమేరకు వైష్ణవాలయాలు కూడా ఉండేవి. రామ, రాఘవ, కృష్ణ ఆలయాలు, వాటి మాన్యాలు కూడా శాసనాల్లో కనిపిస్తాయి. ఏ సంక్షోభం కారణంగా ఆ వైష్ణవాలయాలు రూపుమాశాయన్న చరిత్ర కూడా లేకుండా అవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. వైశ్యులు వైష్ణవాన్ని పుచ్చుకుని, దాని అభివృద్ధికి దానధర్మాలు చేయడం ప్రారంభించడంతో నగరంలో 19వ శతాబ్ది నుంచి తిరిగి వైష్ణవాలయాలు ఏర్పడడం కనిపిస్తుంది.{{Sfn|లంక వెంకటరమణ|2014|p=29}} విజయవాడ జనాభాలో చెప్పుకోదగ్గ స్థాయిలో ముస్లింలు ఉన్నారు. దాదాపు 15 శాతం అని 2000 నాటి ఒక అంచనా. 19వ శతాబ్దిలో విజయవాడ వన్ టౌన్లో సంఖ్యాధిక్యతే కాక సాంస్కృతిక ఆధిపత్యం కూడా ముస్లింలదే. షియా ముస్లింలకు సంబంధించిన పంజాలు, సూఫీలకు సంబంధించిన దర్గాలు విజయవాడ వ్యాప్తంగా పలు ప్రదేశాల్లో కనిపిస్తాయి. ఆనాడు విజయవాడలో కీలకమైన ప్రాంతాల్లో ఆస్తుల్లో ఎక్కవ భాగం వీరివి. మొదట్లో బంగారు, వెండి దుకాణాలన్నీ వీరి చేతిలోనే ఉండేవి. కాలక్రమేణా ఆస్తులు చేతులు మారి, ముస్లింలు ప్రస్తుతం పాత ఇనుము, టైర్లు తిరిగి అమ్మకం, టైలరింగ్ వంటి వ్యాపారాల్లో ఎక్కువగా స్థిరపడ్డారు. ఇంకా పెద్ద సంఖ్యలోనే ఉన్నా విజయవాడ ముస్లింలు ఒకప్పటి సిరిసంపదలు వారిచేతిలో లేదని లంక వెంకటరమణ వ్యాఖ్యానించాడు. వీరు ఎక్కువ సంఖ్యలో నివసిస్తున్న [[విజయవాడ పశ్చిమ శాసనసభ నియోజకవర్గం|విజయవాడ పశ్చిమ శాసన సభ నియోజక వర్గం]]<nowiki/>లో రాజకీయంగానూ ప్రభావం చూపుతున్నారు.{{Sfn|జాన్సన్ చోరగుడి|2000|p=31}}{{Sfn|లంక వెంకటరమణ|2014|p=66}} సిక్ఖులూ నగరంలో నివసిస్తున్నారు. ఆటోనగర్ సమీపంలో ఒక కాలనీకి గురునానక్ కాలనీ అని పేరుపెట్టుకున్నారు. 2000 ప్రాంతంలో ఖల్సా 300 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నగరంలో వైభవోపేతంగా ఉత్సవాలు నిర్వహించారు.{{Sfn|జాన్సన్ చోరగుడి|2000|p=32}}
 
==== కనక దుర్గ అమ్మ వారి దేవాలయం ====
<nowiki/>{{main|కనకదుర్గ గుడి}}
[[File:Kanaka Durga Temple.jpg|thumbnail|right|200px|విజయవాడ – [[కనకదుర్గ గుడి|కనక దుర్గ అమ్మ వారి దేవాలయం]]]]
కనకదుర్గ అలయం, దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్ధానం కృష్ణావది ఒడ్డువే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉంది. ఇక్కడ దుర్గా దేవి స్వయంభువుగా (తనకు తానుగా) వెలసిందని క్షేత్ర పురాణంలో చెప్పబడింది. ఆది శంకరాచార్యులవారు తమ పర్యటనలలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేసారని ప్రతీతి. ప్రతి సంవత్సరం కెన్ని లక్షలమంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొంటారు.రాక్షసుల బాధ భరించ లేక ఇంద్రకీలుడనే మహర్షి దుర్గాదేవిని గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపైనే నివాసముండి రాక్షసులను సంహరించమవి ప్రార్థించగా, ఆ తల్లి అక్కడ ఇంద్రకీలాద్రి (ఇంద్రకీలుడి కొండ) పై కొలువుతీరింది. అర్జునుడు ఈ కొండ పై శివుని గురించి తపస్సు చేసాడని కూడా ప్రతీతి.
==== మరకత రాజరాజేశ్వరీ దేవాలయం - పటమట ====
{{main| మరకత రాజరాజేశ్వరీ దేవాలయం }}
[[దస్త్రం:MarakataRajarajeswari.jpg|కుడి|thumb|200px|మరకత రాజరాజేశ్వరి]]
ఆధునిక యుగంలో అపురూపమైన [http://dattapeetham.com/india/tours/2003/vijayawada_devi_temple/temple_picts/temple_picts.html శిల్పకళ] తో తయారైన గొప్ప దేవస్ధానం. అమ్మవారి మూర్తి అపురూపమైన మరకత శిలతో (పచ్చ) చెక్కబడింది. అంతేకాక, ఆలయవు గోడలన్నీ రాతితో చెక్కబడి [[శ్రీచక్రం]] లోని వివిధ చక్రాలు, వాటిలోని దేవతలను అద్భుతంగా దర్శింపజేస్తూ ఉంటాయి. ఆలయ శిఖరం సుమేరు శ్రీచక్ర అకారంలో ఉంటుంది. అమ్మ వారి ముందు కూర్మం (తాబేలు) పై మాణిక్యం (కెంపు) తో చేసిన శ్రీచక్రం అలరారుతూ ఉంటుంది. 2002 లో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ చే ఈ గుడి కుంభాభిషేకం మరియు ప్రతిష్ఠ జరుపబడింది.
"https://te.wikipedia.org/wiki/విజయవాడ" నుండి వెలికితీశారు