వేణుమాధవ్: కూర్పుల మధ్య తేడాలు

6 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 36:
 
==బాల్యం==
వేణుమాధవ్ 1969, సెప్టెంబరు 28న [[సూర్యాపేట జిల్లా]] [[కోదాడ]]లో జన్మించాడు. ఆయన తండ్రి ప్రభాకర్‌, తల్లి సావిత్రి.<ref name="ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూత">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=తాజావార్తలు |title=ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూత |url=https://www.andhrajyothy.com/artical?SID=913682 |accessdate=25 September 2019 |work=www.andhrajyothy.com |date=25 September 2019 |archiveurl=httphttps://web.archive.org/web/20190925082035/https://www.andhrajyothy.com/artical?SID=913682 |archivedate=25 Septemberసెప్టెంబర్ 2019 |language=te |url-status=live }}</ref> నాన్న [[టెలిఫోన్]] డిపార్ట్‌మెంట్ లో లైన్‌ ఇన్‌స్పెక్టర్. అమ్మ ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్. చదువంతా [[కోదాడ]]లోనే సాగింది. ఒకటో తరగతి నుంచి డిగ్రీ దాకా మొత్తం తెలుగు మీడియం లోనే చదివాడు. [[ఇంగ్లీషు]] పెద్దగా రాదని ఆయనే చెప్పుకుంటుంటాడు. ఐదో తరగతి దాకా ఊళ్ళోనే ఉన్న ప్రాథమిక పాఠశాలలో చదివాడు. తరువాత ఆరో తరగతి కోసం [[జిల్లా పరిషత్]] పాఠశాలలో చేరాడు. వేణుమాధవ్‌కు చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌ అంటే ఇష్టం. ఏ చిన్న సందర్భం వచ్చిన డ్యాన్స్‌ చేసి అందరినీ అలరించేవాడు. నాలుగో తరగతి నుంచే [[మిమిక్రీ]] చెయ్యడం ప్రారంభించాడు. చదువుకునే రోజుల్లోనే ఉపాధ్యాయుల్ని అనుకరించి అందరినీ తెగ నవ్వించేవాడు. [[అమితాబ్ బచ్చన్]], [[ఎన్టీఆర్]] పాటలకు డ్యాన్సులేయడం, వారిని అనుకరించి మాట్లాడటం మొదలైనవన్నీ చేసేవాడు.
 
ఈయనకు [[వెంట్రిలాక్విజం]] మీద బాగా ఆసక్తిగా ఉండేది. అదే ఆసక్తితో [[బాంబే]] (ప్రస్తుతం [[ముంబై]]) నుంచి ప్రత్యేకంగా రూపొందించిన ఒక బొమ్మ తెచ్చుకున్నాడు. కోదాడలో వెంట్రిలాక్విజాన్ని మొదటిసారి ప్రజలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఆయన చదివే కళాశాల ప్రిన్సిపల్ ని కలిస్తే వార్షికోత్సవానికి వేణు ప్రదర్శన ఏర్పాటు చేశాడు. ఆ కార్యక్రమానికి ఆ ప్రాంతపు అప్పటి శాసన సభ్యులు చందర్ రావు వచ్చి ఆ ప్రదర్శనను తిలకించడం జరిగింది. ఆయన ఎంతో ముచ్చటపడి [[భువనగిరి]]లో ఆయన పార్టీ మీటింగ్ లో కూడా అలాంటి ప్రదర్శన ఇవ్వమన్నాడు. ఆ మీటింగ్ కి వచ్చిన రాష్ట్ర మాజీ హోం శాఖా మంత్రియైన కీ.శే [[ఎలిమినేటి మాధవ రెడ్డి]] కూడా వేణుమాధవ్ ను [[నల్గొండ]] పార్టీ మీటింగ్ లో కూడా ప్రదర్శన ఇవ్వమన్నాడు. నల్గొండ ప్రదర్శన [[చంద్రబాబు నాయుడు]] చూసి, మహానాడులో ప్రదర్శన ఇవ్వమన్నాడు. మహానాడు ప్రదర్శనలో [[తెలుగుదేశం పార్టీ]] చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పాడు. సభ అయిపోయిన తరువాత ఎన్టీఆర్ వేణు దగ్గరికి వచ్చి ”మీ సేవలు మాకెంతో అవసరం బ్రదర్” అని చెప్పి [[చంద్రబాబు నాయుడు]] వైపు తిరిగి ”వీరిని మనతో పాటే ఉంచండి” అని అన్నాడు. అలా తెలుగుదేశం వ్యవస్థాపకులు ఎన్టీఆర్ పరిచయమైంది.<ref>{{cite news |last1=సాక్షి |first1=ఫ్యామిలీ |title=నేను మౌలాలి మెగాస్టార్‌ని! |url=https://www.sakshi.com/news/family/exclusive-interview-with-venu-madhav-72764 |accessdate=25 September 2019 |work=Sakshi |publisher=డి.జి. భవాని |date=25 September 2019 |archiveurl=httphttps://web.archive.org/web/20190925083904/https://www.sakshi.com/news/family/exclusive-interview-with-venu-madhav-72764 |archivedate=25 Septemberసెప్టెంబర్ 2019 |language=te |url-status=live }}</ref>
 
ఆ పరిచయంతో వేణుకు [[హిమాయత్‌నగర్]] లోని [[తెలుగుదేశం పార్టీ]] కార్యాలయంలో టెలిఫోన్ ఆపరేటర్ గా ఉద్యోగం ఇచ్చారు. ఆర్థిక తోడ్పాటు లేకపోవడంతో వేణు హిమాయత్‌నగర్‌లోని టీడీపీ ఆఫీసులో చేరాడు. అయినా తనకు అబ్బిన మిమిక్రీ విద్యను వదిలిపెట్టకుండా పలు ప్రదర్శనలు ఇచ్చాడు. ఆఫీసుకు వఛ్ఛే పది కాల్స్ లో తొమ్మిది కాల్స్ వేణుకు వచ్చే వ్యక్తిగత కాల్స్‌గా ఉండేవి. దీంతో క్రమంగా అన్నగారి కార్యక్రమాలకు అందకుండా పోయేవాడు. దాంతో వాళ్ళు ఇలాకాదని, అసెంబ్లీలోని టీడీఎల్పీ ఆఫీసులో లైబ్రరీ అసిస్టెంటుగా చేర్చారు. తరువాత ఎన్టీఆర్ ఇంట్లో అసిస్టెంట్ గా కూడా కొద్దిరోజులు పనిచేశాడు. బొమ్మతో మిమిక్రీ చేస్తాడు కాబట్టి ఎన్టీయార్ ఆయన్ని ”బొమ్మగారూ!” అని ఆప్యాయంగా పిలిచేవారు.<ref name="సినీ నటుడు వేణు మాధవ్ కన్నుమూత">{{cite news |last1=బిబిసీ తెలుగు |first1=వార్తలు |title=సినీ నటుడు వేణు మాధవ్ కన్నుమూత |url=https://www.bbc.com/telugu/india-49821762 |accessdate=25 September 2019 |date=25 September 2019 |archiveurl=httphttps://web.archive.org/web/20190925083408/https://www.bbc.com/telugu/india-49821762 |archivedate=25 Septemberసెప్టెంబర్ 2019 |work= |url-status=live }}</ref>
 
==సినీ ప్రస్థానం==
అసెంబ్లీలో లైబ్రరీ అసిస్టెంటుగా పనిచేసేటప్పుడు ఖాళీ సమయాల్లో ఎదురుగా ఉన్న [[రవీంద్ర భారతి]]కి వెళ్ళడం అలవాటైంది. ఒకసారి ఆకృతి సంస్థ వాళ్ళు మాటల రచయిత [[దివాకర్ బాబు]]కు సన్మానం చేస్తుంటే చూడ్డానికి వెళ్ళి, అందులో వేదికపైన ఒక చిన్న ప్రదర్శన ఇచ్చాడు. రవీంద్రభారతిలో వేణుమాధవ్ చేసిన కామెడీ స్కిట్ అతడి జీవితాన్నే మార్చేసింది. వేణుమాధవ్ ఆ కార్యక్రమంలో 'గుల గుల గులాబ్ జామ్' అంటూ చెప్పిన డైలాగ్ ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డిలకు చాలా బాగా నచ్చి, సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆయన మొదటి సినిమా [[ఎస్వీ కృష్ణారెడ్డి]] దర్శకత్వంలో కృష్ణ కథానాయకుడిగా వచ్చిన సంప్రదాయం అనే సినిమా. అప్పటివరకు మిమిక్రీ ప్రోగ్రాంకు రూ. 1000 మాత్రమే తీసుకునే వేణుమాధవ్‌కు ఆ సినిమా కోసం రూ. 70వేలు పారితోషికంగా ఇచ్చారు. నటుడిగా వేణుమాధవ్ తొలి రెమ్యునరేషన్ అదే. ఆ సినిమా పూర్తయిన మూడు రోజులకే ‘శ్రీకారం’లో అవకాశం వచ్చింది. అలా వరుస అవకాశాలతో బిజీ అయిపోయాడు. అలా స్వశక్తితో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తెలుగుతెరపై తిరుగులేని జైత్రయాత్రను కొనసాగించాడు. <ref>మే 17, 2009 ఈనాడు ఆదివారం సంచిక</ref> [[తొలిప్రేమ]] సినిమాలో అమ్మాయిలపైన వేణుమాధవ్ చెప్పిన డైలాగు ఆయన్ను ప్రేక్షకులకు చేరువ చేసింది. దిల్ సినిమాతో మంచి పేరు వచ్చింది. 2006 లక్ష్మి సినిమాతో ఉత్తమ హాస్యనటుడిగా [[నంది అవార్డు]]ను అందుకున్నాడు. [[హంగామా (సినిమా)|హంగామా]] సినిమాతో హీరోగా మారిన వేణుమాధవ్, [[ప్రేమాభిషేకం (2008 సినిమా)|ప్రేమాభిషేకం]] సినిమాను నిర్మించాడు.<ref name="‘నల్లబాలు.. నల్లతాచు లెక్క.. నాకి చంపేస్తా...’">{{cite news |last1=సాక్షి |first1=సినిమా |title=‘నల్లబాలు.. నల్లతాచు లెక్క.. నాకి చంపేస్తా...’ |url=https://www.sakshi.com/news/movies/comedian-venu-madhav-interview-170843 |accessdate=25 September 2019 |work=Sakshi |date=25 September 2019 |language=te}}</ref> ఇంకా అతనికి పేరు తెచ్చిన సినిమాలు [[తొలిప్రేమ]], [[సై]], [[ఛత్రపతి]], మొదలైనవి. చివరిసారిగా [[రుద్రమదేవి (సినిమా)|రుద్రమదేవి]], డాక్టర్ పరమానందయ్య స్టూడెంట్స్ గ్యాంగ్ (2016) సినిమాలలో నటించాడు. ‘[[తమ్ముడు (సినిమా)|తమ్ముడు]]’, ‘[[ప్రియమైన నీకు]]’, ‘[[స్టూడెంట్ నెం.1]]’, ‘[[ఆది (సినిమా)|ఆది]]’, ‘[[నువ్వే నువ్వే]]’, ‘[[దిల్]]’, ‘[[సింహాద్రి (సినిమా)|సింహాద్రి]]’, ‘[[వెంకీ]]’, ‘[[ఆర్య (సినిమా)|ఆర్య]]’, ‘[[సాంబ (సినిమా)|సాంబ]]’, ‘గౌరి’, ‘[[గుడుంబా శంకర్]]’, ‘[[సై]]’, ‘[[ఛత్రపతి (సినిమా)|ఛత్రపతి]]’, ‘[[బన్నీ]]’, ‘[[లక్ష్మి (2006 సినిమా)|లక్ష్మి]]’, ‘[[జై చిరంజీవ]]’, ‘[[శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్.]]’, ‘[[కృష్ణ (2008 సినిమా)|కృష్ణ]]’, ‘[[యోగి (2007 సినిమా)|యోగి]]’ వంటి చిత్రాలు ఆయన్ను కమెడియన్‌గా మరోస్థాయికి తీసుకెళ్లాయి. ‘[[హంగామా (సినిమా)|హంగామా]]’, ‘[[భూకైలాస్-ఎకరం 50 కోట్లు|భూకైలాష్]]’, ‘[[ప్రేమాభిషేకం (2008 సినిమా)|ప్రేమాభిషేకం]]’ చిత్రాల్లో వేణు హీరోగా నటించాడు.<ref name="నేను మౌలాలి మెగాస్టార్‌ని!">{{cite news |last1=సాక్షి |first1=ఫ్యామిలీ |title=నేను మౌలాలి మెగాస్టార్‌ని! |url=https://www.sakshi.com/news/family/exclusive-interview-with-venu-madhav-72764 |accessdate=25 September 2019 |work=Sakshi |date=25 September 2019 |archiveurl=httphttps://web.archive.org/web/20190925083904/https://www.sakshi.com/news/family/exclusive-interview-with-venu-madhav-72764 |archivedate=25 Septemberసెప్టెంబర్ 2019 |language=te |url-status=live }}</ref>
 
ఇండస్ట్రీలో వేణుమాధవ్ కి [[చిరంజీవి]], [[నందమూరి బాలకృష్ణ|బాలకృష్ణ]] అంటే ఎంతో గౌరవం. చిరు 150వ సినిమా, బాలయ్య 100వ సినిమా సక్సెస్ అందుకోవాలని వేణుమాధవ్ గుండు కూడా కొట్టించుకున్నాడు. వేణుమాధవ్ తన పుట్టినరోజుకి కేక్ కట్ చేయడం లాంటి ఫార్మాలిటీస్ ని పాటించడు. పరిశ్రమకొచ్చినప్పట్నుంచీ తన పుట్టిన రోజును అనాథ శరణాలయంలోనే జరుపుకున్నాడు. వారికి ఉపయోగపడే ఏదొక పని చేయడం తనకు చెప్పలేని సంతృప్తి అని వేణుమాధవ్ చెప్పేవాడు. చిరంజీవితో కలిసి '[[జై చిరంజీవ]]' సినిమాలో నటిస్తున్న సమయంలో వేణుమాధవ్ పుట్టినరోజు రావడంతో ఆ ఒక్కసారి మాత్రం చిరంజీవి కోసం రూల్ బ్రేక్ చేసి కేక్ కట్ చేశాడు. అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డిల చలవతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఉన్నత స్థాయికి చేరుకున్న వేణుమాధవ్ తన ఇళ్ళకు ''అచ్చొచ్చిన కృష్ణ నిలయం'' అని పేరు పెట్టుకున్నాడు.
పంక్తి 81:
 
==మరణం ==
కాలేయ సంబంధవ్యాధితో బాధపడుతున్న వేణుమాధవ్ [[సికింద్రాబాదు]]లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ [[2019]], [[సెప్టెంబరు 25]] మధ్యాహ్నం గం. 12.21 ని.లకు మరణించాడు.<ref name="వేణుమాధవ్‌ కన్నుమూత">{{cite news |last1=ఈనాడు |first1=తాజావార్తలు |title=వేణుమాధవ్‌ కన్నుమూత |url=https://www.eenadu.net/newsdetails/6/2019/09/25/119016362/venumadhav-no-more |accessdate=25 September 2019 |work=www.eenadu.net |date=25 September 2019 |archiveurl=httphttps://web.archive.org/web/20190925075651/https://www.eenadu.net/newsdetails/6/2019/09/25/119016362/venumadhav-no-more |archivedate=25 Septemberసెప్టెంబర్ 2019 |language=en |url-status=live }}</ref><ref name="నవ్వు చిన్నబోయింది">{{cite news |last1=సాక్షి |first1=సినిమా |title=నవ్వు చిన్నబోయింది |url=https://www.sakshi.com/news/movies/telugu-film-comedian-venu-madhav-passes-away-1227345 |accessdate=25 September 2019 |work=Sakshi |date=25 September 2019 |archiveurl=httphttps://web.archive.org/web/20190925084844/https://www.sakshi.com/news/movies/telugu-film-comedian-venu-madhav-passes-away-1227345 |archivedate=25 Septemberసెప్టెంబర్ 2019 |language=te |url-status=live }}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/వేణుమాధవ్" నుండి వెలికితీశారు