వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 350:
En-cyclo-pae'dia, En-cyclo-pedia : శంకరనారాయణ ఇంగ్లీష్-తెలుగు నిఘంటువు 1972 n.
సర్వవిద్యా విషయములను శాస్త్రవిషయములను గుఱించి అకారాదిగా వ్రాయఁబడిన గ్రంథము, శబ్దార్థసర్వస్వము, సర్వసంగ్రహ నిఘంటువు, విశ్వకోశము, cyclopedia, a dictionary bearing on things objects & all facts of universal information (and not of words)
As per cambridge dictionary , encyclopedia is a large collection of information about one or many subjects, often arranged alphabetically in articles in a book or set of books, or available through a computer. ఇక్కడ కూడా '''knowledge / విజ్ఞానం''' లేదు.  [[వాడుకరి:Kasyap|Kasyap]] ([[వాడుకరి చర్చ:Kasyap|చర్చ]]) 11:54, 10 జనవరి 2020 (UTC)
 
ఒక్కో భాషలో ఒక్కో పదానికి అర్థం ఒక్కో మూలం నుంచి వస్తుంది. ఉదాహరణకు: తెలుగులో వర్థంతి అంటే చనిపోయిన తేదీకి వార్షికోత్సవం అని కదా మనం వాడుతున్నది. దానికి సంస్కృతంలోనూ, కన్నడంలోనూ అర్థం - పుట్టినరోజు అని. అంతమాత్రాన తెలుగువారిని దండించి దాన్ని పుట్టిన రోజుకు సమంగా వాడలేం. అలానే, ఫిల్మ్ అనే పదాన్ని సినిమాకు సమానార్థకంగా ఇప్పటికీ ఇంగ్లీషులోనూ, దాని ప్రభావం ఉన్న అనేక భాషల్లోనూ వాడుతున్నారు. ముడి ఫిలిం వాడి సినిమాలు తీసే రోజుల నాటిదీ వ్యుత్పత్తి. ఐతే, ఇప్పుడు డిజిటల్ వచ్చింది కదాని ఫిల్మ్ అన్న పదాన్ని నిషేధించి డిజిటల్స్ అని మార్చలేం. ఫిల్మ్ స్టడీస్, ఫిల్మ్ ఫేర్, ఫిల్మ్స్ అన్న పదాలు అలానే ఉంటాయి. భాష సాగే తీరును అవగాహన చేసుకోగలమే తప్ప దాన్ని తిప్పలేం. అదొక నదీ ప్రవాహం లాంటిది. ఇప్పుడు మన ఎన్‌సైక్లోపీడియా విషయానికి వస్తే దానికి 1853లోనూ, 1972లోనూ ఎలాంటి అర్థాలు నిఘంటువులు ఇచ్చాయన్నది ఈనాటి భాషా వ్యవహారానికి కొలమానం కాదు. ఎన్‌సైక్లోపీడియా అన్న పదానికి పత్రికాపదకోశం (ప్రెస్ అ.) 2004 ఇచ్చిన అర్థం విజ్ఞాన సర్వస్వం/కోశం, అంతకన్నా ప్రామాణికుడు బూదరాజు రాధాకృష్ణ- ఆధునికవ్యవహారకోశం ఇంగ్లీష్-తెలుగు (బూదరాజు రాధాకృష్ణ) 2008 ఇచ్చిన పదం విజ్ఞానసర్వస్వం. కాబట్టి, ఈ ప్రతిపాదనకు బలం లేదు. [[:en:Wikipedia:Purpose]] చదివి చూడండి "The goal of a Wikipedia article is to present a neutrally written summary of existing mainstream knowledge in a fair and accurate manner with a straightforward, "just-the-facts style". అన్న ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ప్రకారం చూసినా మన విజ్ఞాన సర్వస్వం అన్న పదం నప్పుతోంది. (నప్పకున్నా పదానికి తెలుగు అనువాదం ఎలా ఉంటే అలా స్వీకరించాలి, కానీ నప్పుతోంది అని విడిగా చెప్తున్నాను) బాంగ్లా భాషలో విశ్వకోశం అన్నది వారి భాషా చరిత్ర ప్రకారం విజ్ఞాన సర్వస్వానికి ఏర్పడిన పదం అయితే వాళ్ళని అది ఉంచనివ్వండి. మనకేం అభ్యంతరం ఉండనక్కరలేదు. మన భాష ప్రకారం ఇది విజ్ఞాన సర్వస్వం కాబట్టి ఇదిలా ఉండనిద్దాం. -[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 13:06, 10 జనవరి 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు