అక్కన్న మాదన్న: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ
ట్యాగు: 2017 source edit
(తేడా లేదు)

10:11, 25 ఆగస్టు 2020 నాటి కూర్పు

అక్కన్న, మాదన్న లు 1674 నుంచి 1685 మధ్యలో గోల్కొండ సంస్థానంలో మంత్రులుగా పనిచేసిన ఇద్దరు అన్నదమ్ములు. 1685 అక్టోబరు నెలలో వారు మరణించే వరకు గోల్కొండ రాజ్యంలోని అన్ని వ్యవహారాలు తమ ఆధీనంలో ఉంచుకోగలిగారు. ముస్లిం అధికారులు అధికంగా ఉన్న రాజ్యంలో హిందువులుగా వీరు అధికారం చలాయించగలిగారు కాబట్టి గోల్కొండ చరిత్రలో వీరి ప్రాముఖ్యత చెప్పుకోదగినది.

బాల్య జీవితం

అక్కన్న మాదన్నలు హనుమకొండలోని నియోగి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. వీరు నలుగురు అన్నదమ్ములు, మరికొంతమంది సోదరీమణులు.[1] ఒక సమకాలీన డచ్ మూలాల ప్రకారం అక్కన్న తన తల్లికి ఇష్టమైన వాడు. కానీ మాదన్న అందరికైనా తెలివైనవాడు. చారిత్రక సాహిత్యంలో అసలు వీరు తెలుగు వారా లేక మరాఠా జాతికి చెందిన వారా అని కొన్ని వాదనలు జరిగాయి. కానీ వారి బహుశా స్మార్త బ్రాహ్మణులు కావచ్చు. వీరు శివుడు, విష్ణువు, సూర్యుడు మొదలైన దేవతలకు ప్రాధాన్యం ఇచ్చేవారు.[2] వీరు భక్త రామదాసు మామలు. అక్కన్న వారసులు అక్కరాజులుగా, మాదన్న వారసులు మాదరాజులుగా ప్రాచుర్యం పొందారు. వీరి ఇంటి పేరు పింగిళి.

మూలాలు