వికీపీడియా:బాటు సహాయానికి అభ్యర్ధనలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 255:
::: {{Ping|Arjunaraoc}} గారూ, మొదటి పేజీలో మనం ప్రదర్శిస్తున్న వ్యాసాలు - "ఈవారం వ్యాసాలు", మీరు మాట్లాడుతున్న ఆ చిహ్నం లభించేది - "విశేష వ్యాసాల"కు. ఇవి రెండూ వేర్వేరు. ఒక వ్యాసం మొదటి పేజీలో ప్రదర్శించినంత మాత్రాన విశేష వ్యాసం కాబోదు. [[వికీపీడియా:విశేష వ్యాసం లక్షణాలు|విశేష వ్యాసం లక్షణాలు]] అనుసరించి అభివృద్ధి చేసి, ఆ లక్షణాలు ఉన్నవో లేవో సమగ్రమైన సమీక్ష జరిపి ఆ గౌరవాన్ని ఇవ్వాలి. అంతే తప్ప బాట్ రాసి వ్యాసాలన్నీ మూకుమ్మడిగా ఇవ్వదగ్గ గౌరవం కాదిది. "ప్రారంభంలో మొదటి పేజీలో ప్రదర్శించిన వాటిని విశేష వ్యాసాలుగా గుర్తించాము. ఆ తర్వాత ఆ రెంటినీ విడదీయటం జరిగింది. ఇప్పుడు విశేష వ్యాసాలతో సంబంధం లేకుండా మొదటి పేజీలో ప్రదర్శించే వ్యాసాలు అన్న ప్రక్రియ కొనసాగుతున్నాయి." అని గతంలో రచ్చబండలో [[వికీపీడియా:రచ్చబండ/పాత_చర్చ_41#విశేష_వ్యాసాల_పునస్సమీక్ష|విశేష వ్యాసాల పునస్సమీక్ష]] అని నేను ప్రారంభించిన చర్చలో వైజాసత్య గారు రాశారు. అలాగే మరొక మారు మణికంఠ అన్న సభ్యుడు తీసుకువచ్చిన చర్చలో ([[వికీపీడియా:రచ్చబండ/పాత_చర్చ_53#తేవికీ_లో_విశేష_వ్యాసాలు_(Featured_articles)_మరియు_మంచి_వ్యాసాలు_(Good_articles)_గుర్తించాలి|ఇక్కడ ఉంది]]) సభ్యుల అభిప్రాయాలు కూడా దీన్నే బలపరుస్తున్నాయి. ఆంగ్ల వికీలో మొదటి పేజీలో ఉన్న వ్యాసాలన్నీ చాలా కఠినమైన సమీక్షా పద్ధతులు అనుసరించి, ఫీచర్డ్ ఆర్టికల్ గుర్తింపు ముందు తెచ్చుకుని, ఆ తర్వాతనే మొదటి పేజీలో చూపిస్తారు. వాళ్ళ దగ్గర నాణ్యతపై శ్రద్ధ ఉన్నవారు తగినంతమంది ఉన్నందువల్ల ఇవన్నీ చేయగలుగుతున్నారు. మనం ఆ పద్ధతి అనుసరించలేం కాబట్టి వైజాసత్య వంటివారు మొదటి పేజీ వ్యాసాలుగా విశేష వ్యాసాలే ఉండనక్కరలేదని ఈ ఏర్పాటు చేశారు. బాట్లు రాసి ఈ మూసలు ఏ వ్యాసాల్లోనూ చేర్చవద్దు. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 09:18, 25 మార్చి 2021 (UTC)
::::[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] గారు, మీ స్పందనకు, పాత చర్చల లింకులకు ధన్యవాదాలు. గత15 ఏళ్లుగా విశేషవ్యాసాలను మనం చెయ్యలేకపోయాము అనేది స్పష్టం, వచ్చే 15 ఏళ్లలో ఆ పని జరుగుతుందని నాకు అనిపించటం లేదు. అయితే పదుల వేల సంఖ్యలో వున్న వ్యాసాలలో కొంతవరకైనా నాణ్యత గల వ్యాసాలను గుర్తించటం, వాటిలో కలిగే మార్పులపై , ఇటీవలి మార్పులలో లింకుల ద్వారా ఎక్కువమంది దృష్టిపెట్టేలా చేయటం అనేది ఈ చర్చకు నేపధ్యం కావున, ఆకుపచ్చ రంగు నక్షత్రం రూపంతో కనబడే {{tl|ప్రదర్శిత వ్యాసాలు}} అనే మూస చేయటం, వాటిని ప్రదర్శిత వ్యాసాలలో చేర్చటం గురించి మీ సూచనలు తెలపండి.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 21:43, 25 మార్చి 2021 (UTC)
::::: {{Ping|Arjunaraoc}} గారూ, కాంస్య తార గురించి కదా మీరు మాట్లాడింది ఇంత సేపూ హఠాత్తుగా ఈ పచ్చ తార ఎక్కడి నుంచి వచ్చింది? స్పష్టంగా చెప్పండి, విశేష వ్యాసం - ఈవారం వ్యాసం వేర్వేరు అని మీరు అర్థం చేసుకున్నారా? కాంస్య తార చేర్చే ప్రయత్నం మీరు విరమించుకున్నట్టేనా? ముందు అది స్పష్టమైతే మనం మిగతా విషయాలు తర్వాత చూచుకోవచ్చు. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 06:42, 26 మార్చి 2021 (UTC)
 
== ఈ వారం వ్యాసాల ఎంపికలో కొంత ఆటోమేషను కోసం బాటు ==