వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 320:
:::ఇకపోతే తెరిచిన ప్రతి గ్రామ వ్యాసం లోనూ మానవికంగా సమాచారాన్ని చేర్చే ఆలొచన బాగానే ఉంది. ఆ పని మిగతావారు చెయ్యాలి గానీ, @[[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] చెయ్యకూడదని నా అభిప్రాయం. ఎందుకంటే ఈ గ్రామాల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళే బృహత్తరమైన బాధ్యత ఒకటి ఆయనకుంది. ఆయన ఆ బాధ్యత తీసుకున్నారు కాబట్టి, మరికొందరు ఆయనతో కలిసి పనిచేసారు కాబట్టి పాతిక వేల పైచిలుకు పేజీలు, సంబంధిత మూసలు, వర్గాలు వగైరాలు రూపుదిద్దుకున్నాయి, ఈ స్థాయికి వచ్చాయి. ఈ ప్రాజెక్టులో ఇంకా బోలెడు పని మిగిలే ఉంది. ప్రతి పేజీ లోనూ ఉన్న సమాచారంలో చెయ్యాల్సిన మార్పుచేర్పులు అనేకం ఉన్నాయి. వాటిని క్రోడీకరించడం, ఆ పనులను చెయ్యడమే పెద్ద పని. ఆ పని మరొకరు చెయ్యగలిగేది కాదు. చేసేవాళ్ళూ లేరు. ఇప్పుడు ఆయన సృజనాత్మక ధోరణిలో సమాచారాన్ని మార్చడం చేర్చడం లాంటి పనులు తీసుకుంటే, ప్రాజెక్టు పని కుంటుపడుతుంది. అంచేత ఆ పనులు ఇతరులు చేస్తే మంచిది. __   [[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 01:34, 20 ఆగస్టు 2021 (UTC)
::::[[వాడుకరి:B.K.Viswanadh|విశ్వనాథ్]] గారూ " మండలాల్లో గ్రామాల విభజన, నిర్జన, రెవెన్యూ గ్రామాలను గుర్తించి విడగొట్టడం వంటి కృషి అద్భుతమైనవి". అని గుర్తించినందుకు ధన్యవాదాలు.మిగిలిన విషయాలు మీద [[వాడుకరి:Chaduvari|చదువరి]] గారు స్పందించిన తరువాత నేను పెద్దగా స్పందించాల్సిన అవసరం కనపడుటలేదు.కాకపోతే ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రస్తుతం నా వయస్సు 70 సంవత్సరాలు.నాది ఇప్పుడు బోనస్ లైఫ్. ఇది వ్యక్తిగత విషయం కావచ్చు.దీనికి సంబంధం ఉన్న విషయంగా భావించి ప్రస్తావిస్తున్నాను. నేను ఈ గ్రామాలు ప్రాజెక్టులో పూర్తిగా దిగాను కాబట్టి దానిమీదనే నాదృష్టిపెట్టి, నాకు చేతనైంతవరకు, అవకాశం ఉన్నంతవరకు పూర్తిచేద్దామనే అలోచనతప్ప వేరే ఉద్దేశ్యంమేమీలేదు.సదుద్దేశ్యంతో అర్థంచేసుకుంటే అంతేచాలు. [[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 04:33, 20 ఆగస్టు 2021 (UTC)
: {{Ping|B.K.Viswanadh}} సృజనాత్మక సమాచారం అన్న పదాన్ని మీరు బహుశా సంస్కృతి, దేవాలయాలు, చరిత్ర వంటి వాటిని ప్రస్తావిస్తూ వాడారని అనుకుంటున్నాను. మీ ఉద్దేశం అదే అయితే చాలా సంతోషం. ఎందుకంటే ఇంతకుముందు నేను చాలాసార్లు గ్రామాల వ్యాసాల్లో మూలాల ఆధారంగా ఈ తరహా సమాచారాన్ని చేర్చాలని చాలా ప్రయత్నాలే చేశాను. అయితే, తెలిసిన ఊరి గురించి తెలిసినట్టుగా మూలాల ఊసు లేకుండా రాయడం తేలిక. (తేలిక అంటే మన గుప్పెడు మందికి తెలిసిన ఓ ఇరవై ముప్పై ఊళ్ళ గురంచి రాయగలం. మనకు తెలియని వేలాది ఊళ్ళు అలానే పడుంటాయి.) మూలాల ఆధారంగా రాయడం కొంచెం సవాలుతో కూడిన పని. కానీ, వేలాది సంఖ్యలో ఉన్న వ్యాసాలను అభివృద్ధి చేయాలంటే మూలాల ఆధారంగా చేయడమే స్కేలబుల్ పద్ధతి, సరైన పద్ధతి. సరైన ప్రణాళికతో వెళ్తే చేయవచ్చు. [[వికీపీడియా:రచ్చబండ/పాత_చర్చ_65#నగరాలు,_పట్టణాలు,_గ్రామాల_వ్యాసాలకు_బెంచ్_మార్క్_వ్యాసాలు_రూపొందించుకుందాం|నగరాలు, పట్టణాలు, గ్రామాల వ్యాసాలకు బెంచ్ మార్క్ వ్యాసాలు రూపొందించుకుందాం!]] అని ఇంతకుముందు రచ్చబండలోనే ఆహ్వానించాను. చదువరి గారు ప్రోత్సహించారు. ఇతరులెవరూ పట్టించుకున్నట్టు లేదు. అయితే నేను నిరుత్సాహపడకుండా [[విజయవాడ]] నగరం వ్యాసాన్ని చాలావరకూ అభివృద్ధి చేశాను. తోడు లేకపోవడంతో పూర్తిచేయలేకపోయాను. ఈసారి కొంచెం చిన్న టార్గెట్ పెట్టుకుని [[అత్తిలి]] గ్రామ వ్యాసాన్ని చాలా సంతృప్తికరంగా అభివృద్ధి చేశాను.
: మీలాంటివాళ్ళు కలిసి వస్తాను అనాలే కానీ మనకు సముద్రం అంతటి సమాచారం అందుబాటులో ఉంది. ఉదాహరణకు:
:* ఈనాడు ఆదివారం పత్రికలో ప్రతీవారం ఒక పుణ్యక్షేత్రం గురించి వ్యాసం పడుతుంది అది మనకు మూలమే. కావాలంటే, పాత ఈనాడు ఆదివారాల స్కాన్లు మనం తెప్పించుకోవచ్చు.
:* తెలంగాణ ప్రభుత్వ సమాచార శాఖ తెచ్చే "తెలంగాణ" పత్రిక ఆన్‌లైన్‌లో ఉంది. పర్యాటకం, చరిత్ర వంటి విభాగాలకు వెళ్తే బోలెడు వ్యాసాలు ఉన్నాయి. ఒక్కోదానిలోనూ ఆయా గ్రామాలకు సంబంధించి ఉన్న చారిత్రక విశేషాలూ, పర్యాటక వివరాలు పట్టుకెళ్ళి గ్రామాల్లో చేర్చవచ్చు. (ఆంధ్రప్రదేశ్‌ పత్రిక కూడా ఆన్‌లైన్‌లో ఉంది కానీ అంత సౌకర్యంగా లేదు చదవడానికి. ప్రయత్నించడంలో తప్పులేదు.)
:* ఇంకా జిల్లాల వారీగా అనేక అంశాల మీద పుస్తకాలు ఉన్నాయి. మీకు ఎలాంటివి అందించాలన్నా సిద్ధమే.
: ముందుకు వస్తానంటే అత్తిలి వ్యాసం ఎంత అందంగా తయారైందో అలానే మిగిలిన వ్యాసాలు తయారుచేసుకోవచ్చు. యర్రా రామారావు గారు ప్రస్తుతం చేస్తున్న పని చాలా అవసరమైనది కాబట్టి ఆయన దారిన ఆయనను చేసుకోనిస్తూ, ఈ పని కావాలంటే మనం చేపట్టవచ్చు. పలుమార్లు ఇలాంటి ప్రయత్నాలు చేసి, ఒక్కణ్ణే కావడంతో విసుగెత్తి మానేసి ఉన్నాను. ఆ ఒక్క అత్తిలి వ్యాసం మాత్రం విశేషంగా తయారుచేయగలిగాను. (ఆఫ్‌కోర్స్ యర్రా రామారావు గారిలా ఒక్కరే ముందుకు సాగేందుకు కావాల్సిన పట్టుదల నాకు లేవని అనవచ్చు, తప్పులేదు) --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 11:58, 20 ఆగస్టు 2021 (UTC)
 
== The Wikimedia Foundation Board of Trustees Election is open: 18 - 31 August 2021 ==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు