యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 94:
== బాలాలయం తొలగింపు ==
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని పునర్నిర్మించడానికి 2014లో మాస్టర్‌ప్లాన్‌ రూపొందించినప్పుడు భక్తుల దర్శనాల కోసం తాత్కాలిక బాలాలయాన్ని నిర్మించాలని శ్రీవైష్ణవ పీఠాధిపతి [[చిన్న జీయర్ స్వామి|చినజీయర్‌స్వామి]] సూచించారు. దీంతో ప్రధానాలయానికి ఉత్తర దిశలో సువిశాలమైన ప్రాంగణంలో బాలాలయాన్ని నిర్మించారు. అయితే 2022 మార్చి 28న జరిగిన ఉద్ఘాటన అనంతరం ప్రధానాలయం గర్భాలయంలో ఉన్న నృసింహుని దర్శనాన్ని భక్తులకు కల్పిస్తున్నందున సువర్ణ ప్రతిష్ఠా అలంకారమూర్తులు కొలువుదీరిన బాలాలయాన్ని [[యాదగిరిగుట్ట టెంపుల్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ]] అధికారులు 2022 ఏప్రిల్ మాసంలో తొలగిస్తున్నారు.<ref>{{Cite web|date=2022-04-16|title=యాదగిరిగుట్టలో బాలాలయం తొలగింపు|url=https://www.andhrajyothy.com/telugunews/removal-of-a-kindergarten-in-yadagirigutta-ngts-telangana-1822041602444665|access-date=2022-04-16|website=www.andhrajyothy.com|language=en}}</ref>
 
== బంగారు తాపడం ==
స్వామి దేవాలయ గోపురానికి బంగారు తాపడం కోసం ముఖ్యమంత్రి [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు|కేసీఆర్]] దంపతులు తమ కుటుంబం తరఫున ప్రకటించిన కిలో 16 తులాల బంగారానికి సంబంధించిన రూ. 52.48 లక్షల చెక్కును సీఎం దంపతులు, కుటుంబ సభ్యుల సమక్షంలో మనుమడు హిమాన్షు చేతుల మీదుగా దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి, దేవాలయ అధికారులకు అందజేశారు. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి కిలో బంగారం కోసం రూ.50.15 లక్షల చెక్కును, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వేంరెడ్డి నర్సింహరెడ్డి కిలో బంగారం కోసం రూ. 51లక్షల చెక్కును, ఏనుగు దయానంద రెడ్డి కిలో కిలో బంగారం కోసం రూ.50.04 లక్షల చెక్కును అధికారులకు అందజేశారు.<ref>{{Cite web|last=telugu|first=NT News|date=2022-09-30|title=యాదాద్రి అభివృద్ధికి రూ.43కోట్లు : సీఎం కేసీఆర్‌|url=https://www.ntnews.com/telangana/cm-kcr-review-with-ytda-officials-783433|archive-url=https://web.archive.org/web/20220930182230/https://www.ntnews.com/telangana/cm-kcr-review-with-ytda-officials-783433|archive-date=2022-09-30|access-date=2022-09-30|website=Namasthe Telangana|language=te}}</ref>
 
== దగ్గరలోని దర్శనీయ స్థలాలు ==