నిరుద్యోగం: కూర్పుల మధ్య తేడాలు

చి లింకు చేర్చాను
పంక్తి 2:
[[నిరుద్యోగం]] ([[ఆంగ్లం]]: Unemployment) అనగా ఒక వ్యక్తి [[పని]] చేయగలిగి పనిని కాంక్షిస్తున్నప్పటికీ అతనికి పని దొరక్కపోవడం. ప్రపంచంలో అన్ని దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో నిరుద్యోగం ఒకటి.
 
అమల్లో ఉన్న వేతనాలతో పనిచేయడానికి ఇష్టపడి కూడా [[ఉపాధి]] లభించని స్థితిని అనిచ్ఛాపూర్వక నిరుద్యోగమంటారు. ఉపాధి అవకాశాలు ఉండి తమకు తాము గా నిరుద్యోగులుగా ఉండే స్థితిని ఇచ్ఛా పూర్వక నిరుద్యోగమంటారు. పనిచేసే సామర్థ్యం ఉన్న వారందరికీ ఉపాధి అవకాశాలు లభిస్తే దాన్ని సంపూర్ణ ఉద్యోగితా స్థాయి అంటారు.
 
సాధారణంగా అభివృద్ధి చెందిన దేశాల్లో నిరుద్యోగం సార్థక డిమాండ్ లోపించడం వల్ల, అంటే ఆర్థిక మాంధ్యం వల్ల ఏర్పడుతుంది. ఇలాంటి నిరుద్యోగం తాత్కాలికమైంది. అభివృద్ధి చెందుతున్న భారత్ వంటి దేశాల్లో నిరుద్యోగం వనరుల కొరత వల్ల ఏర్పడుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఏర్పడే నిరుద్యోగం శాశ్వతమైనది.
"https://te.wikipedia.org/wiki/నిరుద్యోగం" నుండి వెలికితీశారు